Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
DASARA WISHES IN TELUGU 2024: మీ స్నేహితులకు, బంధువులకు ఇలా దసరా విషెస్ చెప్పండి
ఏడాదికి ఒకసారి వచ్చే, దేశంలోనే అతిపెద్ద పండగ అయిన దసరా పండగ వచ్చేసింది. ఈరోజే దేశ వ్యాప్తంగా దసరా పండగను జరుపుకుంటున్నారు. బంధుమిత్రులతో కలిసి, పిల్లా జల్లా అంతా కలిసి ఈ పండుగను జరుపుకుంటున్నారు. అయితే మనకు ఆప్తులైన కొందరు మనతో ఉండకపోవచ్చు. వారి వారి సెలెబ్రేషన్స్‌లో బిజీగా ఉండొచ్చు. అలాంటి వారికి.. ఈ విజయదశమి రోజున.. ఈ కొటేషన్స్‌తో శుభాకాంక్షలు తెలియజేయండి. అవంటే ఇక్కడ చూద్దాం రండి..
దసరా శుభాకాంక్షలు
> మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. మీలోని చిన్నపాటి చెడుపై, మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను
> మీ జీవితంలో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని.. ప్రేమ, ఆనందం, ఆరోగ్యం చిగురించాలని ఆ దుర్గా మాతను వేడుకుంటున్నాను. హ్యాపీ విజయదశమి.

> ఈ విజయదశమి నాడు.. రావణుడి దహనంతో పాటు ఆ మంటల్లో మీ బాధలు, కష్టాలు కూడా దహించిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబానికి దసరా శుభాకాంక్షలు
> చెడు ఎంత ప్రభావవంతమైనప్పటికీ... ఎప్పటికీ మంచే విజయం సాధిస్తుంది. అలానే మీ జీవితంలో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, మీకు మంచే జరుగుతుందని ఆశిస్తూ, దసరా శుభాకాంక్షలు
> అడ్డంకులను, కష్టాలను ఎదుర్కునే శక్తి, సామర్ధ్యం, ధైర్యం.. ఆ దుర్గామాత మీకు అందించాలని వేడుకుంటూ దసరా శుభాకాంక్షలు
> ఈ విజయదశమి సందర్భంగా.. మీ జీవితంలో సత్యం, ధర్మం ఎప్పుడూ నిండి ఉండాలని కోరుకుంటూ.. నా మిత్రులు, శ్రయోభిలాషులు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
> ఈ దసరా నుంచి నీకు అన్నీ విజయాలే కలగాలని, విజయాలకు నువ్వు చిరునామాగా మారాలని కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు మిత్రమా
> ఆ జగన్మాత దుర్గాదేవి తల్లి ఆశీస్సులు ఎప్పుడూ మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.
> ఈ విజయ దశమి నుంచి.. రాముడు నడిచిన సన్మార్గంలో మీరు ఎల్లప్పుడూ నడవాలని, ఆ దుర్గా దేవిలా ధైర్య వంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు
> ఈ దసరా మీ జీవితంలో పూర్తి ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటూ.. హ్యాపీ దసరా.
> మీపై, మీ కుటుంబ సభ్యులపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు
పైన పేర్కొనబడిన దసరా శుభాకాంక్షల కొటేషన్స్, మీ స్నేహితులకు, శ్రయోభిషులకు షేర్ చేస్తూ.. విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కు ఇలాంటి కొటేషన్స్ కావాలంటే ఈ స్టోరీని షేర్ చేయండి.



Click it and Unblock the Notifications
