Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
భార్యా భర్తల మధ్య గొడవలా.. అయితే ఈ మంత్రాన్ని పారాయణం చేయాలి..!
ఈ మధ్య చాలా మంది భార్యా భర్తల మధ్య గొడవలు విపరీతంగా పెరిగిపోతున్నాయ్. కొంత మంది భార్యా భర్తలు ఇంట్లో విపరీతమైన టార్చర్‌ను అనుభవిస్తుంటారు. భార్యపై భర్త, భర్తపై భార్య ఫిర్యాదులు చేసుకుంటూ వుంటారు. ఇద్దరూ విడిపోవడానికి కూడా సిద్దమైపోతుంటారు. ఇలా గొడవపడి విడాకులు తీసుకున్న వారున్నారు. మరొకొంతమంది కోర్టులకు వెళ్లి కేసులు కొట్లాడుతూ వున్నారు. భార్యా భర్తల మధ్య వున్న అన్ని సమస్యలూ తొలగపోవాలంటే, భార్యా భర్తలు మళ్లీ అన్యోన్యంగా వుండాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.
ఏ సమస్యకైనా కొన్ని పరిహారాలను మన పూర్వీకులు, పండితులు, జ్యోతిష్యులు సూచించారు. ఆ పరిహారాలను చేసుకుంటే సమస్య కఛ్ఛితంగా తీరుతుంది. భార్యా భర్తల మధ్య వున్న గొడవలు తగ్గడానికి కూడా ఒక పరిహారం వుంది. అదేంటో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం.

సద్గురువు ఆది శంకరాచార్యులు అర్ధనారీశ్వర స్త్రోత్రాన్ని రచించారు. ఎవరైతే ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారి ఇంట్లో వున్న అన్ని కుటుంబ సమస్యలు తొలగిపోతాయ్. భార్యా భర్తల మధ్య వున్న గొడవలు కూడా మాయమైపోతయ్. ఈ అర్థనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన నియమం వుంది. ఎప్పుడంటే అప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణం చేయవద్దు. కేవలం సోమవారం రోజు మాత్రమే ఈ పారాయణాన్ని ప్రారంభించి అప్పటి నుంచి 21 రోజులు ఈ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేయాలి.
సాయంకాలం సమయంలోనే ఈ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇల్లూ వాకిలి శుభ్రం చేసుకొని, కల్లాపి చల్లుకొని, స్నానం చేసుకొని పూజా గదిలో కూర్చొని పారాయణం చేయాలి. పారాయణం సమయంలో అర్ధనారీశ్వర చిత్రపఠం వుంటే చాలా మంచిది. పారాయణం చేసే ముందు దీపాలను వెలిగించుకోవాలి. ముందుగా మహాగణపతి స్తోత్రాన్ని స్మరించుకోవాలి. ఫోటో తుడుచుకొని, గంధం కుంకుమ పెట్టి, ఎర్రని పువ్వులు పెట్టి, శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పించి, పాలలో కటికబెల్లం వేసి నైవేద్యాన్ని సమర్పించాలి. పూజ తరువాత ఈ కటికబెల్లం పాలను కేవలం భార్యా భర్త మాత్రమే తాగాలి.

జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు ఈ కింది స్తోత్రాన్ని రచించారు. భార్యా భర్తలు కనుక ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే వారి మధ్య వున్న గొడవలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయ్.
(అర్ధనారీశ్వర స్తోత్రం)
చాంపేయగౌరార్ధశరీరకాయై
కర్పూరగౌరార్ధశరీరకాయ |
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ || 1 ||
కస్తూరికాకుంకుమచర్చితాయై
చితారజఃపుంజ విచర్చితాయ |
కృతస్మరాయై వికృతస్మరాయ నమః
శివాయై చ నమః శివాయ || 2 ||
ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ |
హేమాంగదాయై భుజగాంగదాయ
నమఃశివాయై చ నమః శివాయ || 3 ||
విశాలనీలోత్పలలోచనాయై
వికాసిపంకేరుహలోచనాయ |
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ || 4 ||
మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ |
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమః శివాయై చ నమః శివాయ || 5 ||
అంభోధరశ్యామలకుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ |
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ || 6 ||
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ |
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ || 7 ||
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ |
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమః శివాయై చ నమః శివాయ || 8 ||
ఏతత్పఠేదష్టకమిష్టదం యో
భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ |
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం
భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః || 9 ||
ఈ స్తోత్రాన్ని సోమవారం ప్రారంభించి ప్రతి రోజూ 108 సార్లు 21 రోజులు ఎవరైతే పారాయణం చేస్తారో ఆ ఇంట్లో మృత్యు గండాలు వుండవని, భర్త పూర్తి ఆరోగ్యంగా వుంటాడని, భార్య నిత్య సుమంగలిగా వుంటుందని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications