Latest Updates
-
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఆగష్టులో ప్రధాన గ్రహాల రాశి మార్పులు.. ఈ నాలుగు రాశుల వారికి లక్కే లక్కు.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగష్టు అనేక ముఖ్యమైన గ్రహాల సంచారంతో ప్రారంభం కావడంతో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు అందుతున్నాయి. శుక్రుడు, కుజుడు రాశి చక్రాలను మార్చుకోవడం, సూర్యుడు తన సొంత రాశి సింహ రాశిలోకి ప్రవేశం కారణంగా కొందరికి పురోగతి, విజయం లభిస్తుంది. శ్రావణ మాసం, రక్షా బంధన్ సానుకూల శక్తి కారణంగా ముఖ్యంగా నాలుగు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఏంటో చూద్దాం..

మేష రాశి
ఆగష్టు నెల మేష రాశి వారికి ఆనందం, విజయాలను అందించే సూచనలు ఉన్నాయి. ఆదాయంతో పాటు లాభాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు కీర్తి, ప్రజాదరణ అందుకుంటారు. వృత్తి పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. ఈ రాశి వారికి పెండింగ్ పనులు ఆగష్టులో పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రేమ జీవితానికి సంబంధించి సంబంధాలు మళ్లీ చిగురిస్తాయి. ఆయా దశల్లో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.
సింహ రాశి
ఆగష్టు నెల సింహరాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది. సింహ రాశిలోకి సూర్య సంచారం మీలో ఆత్మవిశ్వాసం, విజయం పెరుగుతుంది. వృత్తిపరంగా ఆశించిన ఫలితాలు పొందుతారు. పై అధికారుల మద్దతు, పనిలో మీ శ్రమ కారణంగా పదోన్నతి పొందే సూచనలు ఉన్నాయి. కుటుంబపరంగా జీవితం సంతోషంగా ఉంటుంది. వస్తు, వాహనాలు కొనాలనే మీ ప్లానింగ్ విజయవంతమవుతుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఆగష్టు నెల ఆర్థిక లాభాలు అందించే అవకాశాలు ఉన్నాయి. వీరి అదృష్టం మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తులను కలిసే సూచనలు ఉన్నాయి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తిపరంగా ప్రయత్నాల్లో విజయం అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఇది శుభ సమయం. వ్యాపారంగంలో ఉన్న వారికి శుభ దాయకంగా ఉంటుంది. మీ వ్యక్తిగత, వృత్తిపరంగా పురోగతికి, సమాజంలో గుర్తింపునకు కొత్త అవకాశాలు అందుకుంటారు.
మీన రాశి
మీన రాశి వారు ఆగష్టులో విజయాలు అందుకుంటారు. మీ పనిలో ప్రత్యేకతకు గౌరవం లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కోర్టు కేసులకి సంబంధించి ఉపశమనం పొందవచ్చు. కొంతకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఈ నెలలో బయటపడతారు. భూ, ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారరంగంలో కొత్త అవకాశాలు అందుకుంటారు. ఫలితంగా భవిష్యత్తులో పురోగతి అందుకుంటారు. వివాహానికి సంబంధించి శుభవార్త అందుకుంటారు. మీ వ్యక్తిగత జీవితంలో కొత్త వ్యక్తి రాకతో ఒంటరితనం నుంచి ఉపశమనం లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
