Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
లక్ష్మీదేవి పాదాలు పూజించకూడదు అంటారు ? ఎందుకు ? వాస్తవమేనా ?
లక్ష్మీ దేవి పాదాలను పూజించకూడదు అనేది ఒక మూఢనమ్మకంగా ఏర్పడినదే. కానీ ప్రామాణిక గ్రంథాలలో ఏ దేవతామూర్తిని ఏవిధంగా అర్చించాలి అనే విశేషాంశాన్ని పరిశీలిస్తే మటుకు పాదాలనే పూజించాలి అంటాయి ఆ గ్రంథాలన్నీ కూడా. విశేషించి పాదాలకే పూజచేయడం శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించే సమయంలో మనం గమనింస్తుంటాం. అన్నమాచార్యుల వారు బ్రహ్మకడిగిన పాదము అని చెప్పారు కదా! మరి లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదనడానికి మరొకొన్ని ఆధారాలు ఈ క్రింది విధంగా...

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?
అలాగే బలిచక్రవర్తి కూడా వామనుని పాదాలను జలంతో తన భార్యమైన వింధ్యావళి నీళ్ళు పోస్తుండగా కడిగి ఆ స్వామి అడిగిన మూడు అడుగుల నేలను దానం ఇవ్వంగా ఆ స్వామి పాదాలతో ప్రుథి వ్యాపస్తేజో వాయురాకాశములు అయిన పంచభూతాత్మకిమైన ప్రపంచాన్నంతటినీ కూడా ఈ పాదంతో ఆక్రమించాడు. మరొక పాదంతో విశాల ఆకాశమంతా తానుగా దర్శించపజేసి ఆ మూడవపాదాన్ని బలిచక్రవర్తి శిరస్సున ఉంచాడు.

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?
కాబట్టి మనము భగవంతుని పాదములను ఆశ్రయించాలి. ‘‘భగవంతు వలగొను పదములు పదములు''అంటారు పోతనామాత్యులు. కనుక శ్రీమన్నారాయణుని ఆశ్రయించే సమయంలో పాదాములను ఆశ్రయించాలి. అమ్మవారికి మాత్రం పాదాములకు పూజించరాదు అని కొత్తగా కనుగొన్నారు.

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా? పూజింపవచ్చా?
వాస్తవానికి పరమేశ్వరి -పరమేశ్వరుడు, లక్ష్మీదేవి -శ్రీమన్నారాయణుడు, అంతా ఒక్కటే. కాబట్టి ఎటువంటి అనుమానమూ లేకుండా అమ్మవారి పాదాములు అర్చించవచ్చును.

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా? పూజింపవచ్చా?
అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్ళినా మరింకే అమ్మవారి క్షేత్రానికి వెళ్లినా నమస్కరిస్తే ఆ సమయంలో అర్చకుడు శఠగోపంను మన శిరస్సుపైన ఉంచుతారు . మనం తలవంచి నమస్కారం చేస్తాం.

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా? పూజింపవచ్చా?
ఆ శఠగోపం (శఠం అంటే మనలో ఉండి మొండితనం-దానిని తొలగించేవి పరమాత్ముని యొక్క పాదాములు). దాని మీద పరమాత్మం పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్ళి ఆ అమ్మవారికి నమస్కరించిన తర్వాత అర్చకులు మనశిరస్సుపై ఉంచే శఠగోపంలో అమ్మవారి పాదాలే ఉంటాయి. ఇది గమనించాలి. పాదపూజ అని చేప్తాం.

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా? పూజింపవచ్చా?
పరమాత్మను మనం అర్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఆయనను మనం దర్శించగలిగే స్థితి ఎక్కడ; అంటే పాదములను దర్శిస్తే చాలు పరమాత్మను దర్శించినట్లే, ఇటువంటి భావంతో అయ్యవారికైనా, అమ్మవారికైనా సర్వాంములు నమస్కరించవలసిందే.

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా? పూజింపవచ్చా?
లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఒక్కసారి పరిశీలించినా చంచలాయై నమ: - పాదౌపూజయామి, ఇలా సర్వాంగాలనూ పూజ చేస్తాం కదా! మరి పాదాలు పూజ చేయకుండా ఎలా? మొట్టమొదటి నామమే చంచలాయై నమ: పాదౌ పూజయామి. కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పాదములను తప్పకుండా పూజించవచ్చు..



Click it and Unblock the Notifications
