Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
బల్లిగా మారిన శివుడు.. కేదర్‌నాథ్ ఆలయ రహస్యాలు మీకు తెలుసా..?
ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో కేదర్‌నాథ్ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటారు. అయితే కేదర్ నాథ్ ఆలయం వెనక ఉన్న రహస్యాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. హిమాలయ పర్వతాల్లో ఉండే ఈ ఆలయానికి దేశంలో ఉన్నవారే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. ఈ ఆలయం ఎన్నో పౌరాణిక కథలు, రహస్యాలతో నిండి ఉంది. అవేంటో తెలుసుకుందాం.

1. ప్రాచీన నిర్మాణం
కేదర్‌నాథ్ ఆలయం సుమారు 1000 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడినదని భావిస్తారు. ఈ ఆలయం మందాకిని నది ఒడ్డున 3,583 మీటర్ల ఎత్తులో ఉంది. ఆలయ నిర్మాణం మొత్తం రాళ్ళతో కట్టబడింది, ఇది హిమాలయాల్లో వచ్చే భారీ మంచును వరదలను కూడా తట్టుకొని ఇన్నేళ్లు నిలబడగలిగిందని అంటారు. ఈ ఆలయ నిర్మాణంలో పాటించిన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యాన్ని వక్తం చేస్తున్నారు.
2. పాండవుల పౌరాణిక కథలు
పాండవులు మహాభారత యుద్ధం అనంతరం, తమ పాపాల నివారణ కోసం శివుని ప్రార్థించడానికి కేదర్‌నాథ్ వచ్చారని విశ్వాసం. ఈ సమయంలో శివుడు భీముని నుండి తప్పించుకోడానికి బల్లిగా మారి మట్టిలోకి దూరిపోయాడని, భీముడు ఆ బల్లిని పట్టుకొని పగలగొట్టాడని ఒక కథ ఉంది. ఈ కథ ప్రకారం, శివుని వివిధ భాగాలు పంచ కేదరాలలో దర్శనమిస్తున్నాయని పురాణ కథ ఉంది.
3. తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్
కేదర్‌నాథ్ తో పాటు ఈ నాలుగు ఆలయాలు పంచకేదరాలలో భాగంగా ఉన్నాయి. భక్తులు ఈ ఆలయాలను సందర్శించడం వల్ల శివుని ఆశీస్సులు పొందవచ్చని నమ్మకం. ఈ ఆలయాలు అంతర్గత శాంతి, ఆధ్యాత్మిక ఆవిష్కరణకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయ్. కేదర్‌నాధ్‌కు వస్తే మిగిలిన ఈ నాలుగు ఆలయాలను కూడా దర్శించుకోవాల్సిందే.
4. 2013 వరదలు
2013లో కేదర్‌నాథ్ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయ్. ఈ ప్రమాదంలో ఆలయం చుట్టుపక్కల ఉన్న అనేక నిర్మాణాలు ధ్వంసమయినా సరే, ఆలయం మాత్రం నిలిచి ఉండటం అద్భుతం. ఈ ఘటన ఆలయం ప్రాముఖ్యతను, దాని మహిమను మనందరికీ తెలియజేస్తుంది. ఇన్నేళ్ల నుంచి ఎన్ని వరదలు, తుఫానులు వచ్చినా ఆలయం చెక్కు చెదరకుండా ఉంది అంటే అక్కడ ఏదో శక్తి ఉన్నట్టేనని అనుకోవచ్చు.
5. శివలింగం
కేదర్‌నాథ్ ఆలయంలోని శివలింగం ప్రత్యేకమైనది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిల, ఇది శివుని మహిమాన్విత రూపమని భక్తుల నమ్మకం. ఈ శివలింగం మీద జరిగే పూజలు, అభిషేకాలు భక్తులకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయి.
6. హిమాలయాలలో మహాదేవుని సన్నిధి
హిమాలయ పర్వతాలలో ఉన్న ఈ ఆలయం చాలా రహస్యాలను, గాఢమైన ఆధ్యాత్మిక అనుభవాలను కలిగి ఉంది. ఇక్కడ భక్తులు శివుని సన్నిధిని పొందడానికి అనేక కష్టాలను ఎదుర్కొంటారు. ఇక్కడికి రావాలంటే ఎన్నో కొండలు, లోయలను దాటుకొని రావాలి. ఈ ఆధ్యాత్మిక యాత్ర భక్తుల విశ్వాసం భక్తిని మరింత పెంచుతుంది..
7. రహస్య మార్గాలు
కేదర్‌నాథ్ ఆలయం చేరుకునే మార్గంలో అనేక రహస్యమైన మార్గాలు ఉన్నాయి. పాత కాలంలో భక్తులు ఈ మార్గాలను ఉపయోగించి, అరణ్యాల మధ్య ఆధ్యాత్మిక అన్వేషణ కోసం ప్రయాణించేవారు. ఈ మార్గాల ద్వారా ఇప్పటికీ పర్యాటకులు, యాత్రికులు కేదర్‌నాధ్ ఆలయయానికి వెళ్తారు.
కేదర్‌నాథ్ ఆలయం అనేది కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికత, పురాణాలు, విశ్వాసాలకు నిదర్శనం. ఈ ఆలయం సందర్శించేవారికి ఎన్నో అద్భుత అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభూతులు కలిగిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఈ ప్రాచీన ఆలయ రహస్యాలను అన్వేషించి, తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారు.



Click it and Unblock the Notifications