Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
వినాయకుడిని ఇంట్లో లేదా ఆఫీస్ లో పెడుతున్నప్పుడు ఈ 10 విషయాలను అస్సలు మర్చిపోకండి
గణేషని ఇంట్లో లేదా ఆఫీస్లో పెట్టేటప్పుడు గుర్తించుకోవల్సినవి
తన భక్తులు ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలతో మంచి భవిష్యత్తుని కలిగి ఉండాలని, సంతోషం, ఆనందం మరియు విజయాలకు ప్రతీకగా నిలిచే వినాయకుడు కొన్ని వేల సంవత్సరాల నుండి ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందుండి, మనం దైర్యం కోల్పోకుండా విజయం సాధించేలా నడిపిస్తారు. ఇందు మూలంగానే జీవితంలో ఏ పనిని లేదా ఏ కొత్త విషయాన్ని మొదలుపెట్టాలన్నా ఆ విగ్నేశ్వరుడిని పూజిస్తారు.
ఆ విగ్నేశ్వర స్వామిని చాలా మంది భక్తులు తమ ఇళ్లల్లో పెట్టుకుంటారు. కాకపొతే చాలా మందికి ఇంట్లో ఏ ఏ ప్రదేశాల్లో ఎలాంటి గణేశుడి విగ్రహాన్ని పెడితే ధనంతో పాటు, ఆనందం విజయం ప్రాప్తిస్తాయి అనే విషయాలు పెద్దగా తెలియవు.
మీకు గనుక ఏ ఏ ప్రదేశాల్లో విగ్నేశ్వరుడిని విగ్రహం పెట్టాలని తెలియకపోతే, వాస్తు ఆధారంగా క్రింద చెప్పబడిన సూచనలను తప్పక పాటించి ఆయా ప్రదేశాల్లో విగ్రహాన్ని పెట్టి సకల సౌభాగ్యాలను మీ వశం చేసుకోండి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1)ఎవరైతే ఆనందాన్ని, శాంతిని మరియు సిరిసంపదలను కోరుకుంటారో అలాంటి వ్యక్తులు తెల్ల వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలి. తెల్ల వినాయకుడి చిత్రాన్ని తప్పక ఇంట్లో పెట్టుకోవాలి.
2)ఎవరైతే స్వీయ అభివృద్ధి కోరుకుంటారో, అటువంటి వ్యక్తులు సిందూర వర్ణము వినాయకుడిని ఇంటికి తెచ్చుకొని ప్రతి రోజు పూజించాలి.

3)ఇంట్లో పూజించుకోవడానికి కూర్చొని ఉన్న గణేషుడిని తెచ్చుకుంటే చాలా మంచిది. కూర్చున్న వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అదృష్టం మరియు విజయాలు మన జీవితంలో తిష్ట వేస్తాయి.
4)కూర్చొని ఉన్న వినాయకుడి తొండం ఎడమ వైపుకి వంగి ఉన్న విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టుకోవాలి. ఏ గణేశుని విగ్రహానికైతే తొండం కుడి వైపుకి వంగి ఉంటుందో ఆ విగ్రహం పెట్టుకుంటే, వినాయకుడి అనుగ్రహం పొందడం కష్టమవుతుంది.
5)మీరు గనుక విగ్నేశ్వరుడు విగ్రహాన్ని పని చేస్తున్న దగ్గర పెట్టుకోదలిస్తే, నిలుచుకొని ఉన్న విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలనే విషయాన్ని మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం ద్వారా మీరు చేస్తున్న పనికి శక్తితో పాటు ఉత్సాహం తోడవుతుంది.

6)ఎలుకతో పాటు, ఉండ్రాళ్లు కలిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోండి. అది మీకెంతో పవిత్రతను చేకూరుస్తుంది.
7)మీ పూజ గదిలో వినాయాక స్వామి విగ్రహాన్ని ఒక్కటి మాత్రమే పెట్టుకోండి. ఒకటి కంటే ఎక్కువ గనుక పెట్టుకున్నట్లైతే, విగ్నేశ్వరుడి భార్యలు రిద్ధి, సిద్ది నిరుత్సాహ పడతారు .

8)గణేశునికి గడ్డి ని సమర్పించడం మాత్రం భక్తులు మర్చిపోకూడదు. గడ్డిని సమర్పించిన తర్వాత భక్తులు ఈ గణపతి మంత్రాన్ని తప్పక పఠించాలి.
" ఓం గమ్ గణపతయే నమః "
9)స్వస్తిక్ చిహ్నం వినాయక స్వామిదని చాలా మంది నమ్ముతారు. అందు చేత ఎవరైతే వాస్తుదోషం తో బాధపడుతుంటారో అటువంటి వ్యక్తులు ఇంట్లో స్వస్తిక్ చిహ్నాన్ని పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది.
10)ఈ అద్భుతమైన మంత్రాన్ని పఠిస్తే ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది.
11)"ఓం నమః శివాయ.... శివ శివ శివ... ఓం శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్... ఓం శ్రీ హనుమతే నమః ... జై జై బజరంగబలి... ఓం గమ్ గణపతయే నమః... ఓం శ్రీ గణేశాయ నమః...ఓం నమో నారాయణ... ఓం నమో భగవతే వాసుదేవాయే... ఓం గురు... ఓం గురు... ఓం శ్రీ దుర్గాయా నమః...ఓం శ్రీ శనిదేవాయ నమః... ఓం శ్రీ శనైశ్చరాయ నమః... ఓం శ్రీ సూర్య నమః...ఓం సున్ సూర్య నమః "



Click it and Unblock the Notifications
