Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
2020 జనవరి నెలలో ముఖ్యమైన పండుగలేంటో తెలుసా...!
ఈ సమయంలో సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశి లోకి ప్రవేశిస్తాడని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ పండుగకు ఆ పేరు వచ్చింది. సంక్రాంతితో పాటు ఈ నెలలో ఇంకా ఏయే పండుగలు ఉన్నాయో తెలుసుకుందాం.
మన దేశంలో హిందువుల పండుగలన్నీ లునార్ క్యాలెండర్ మరియు సోలార్ క్యాలెండర్ ను అనుసరించి జరుపుకుంటారు. అందుకే ప్రతి ఏటా భారతదేశంలో పండుగల డేట్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం జనవరి నెలలో వచ్చే మకర సంక్రాంతి పండుగ తేదీ మాత్రం మారదు.

ఎందుకంటే సోలార్ క్యాలెండర్ ప్రకారం మకర సంక్రాంతి పండుగ తేదీలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి. అయితే కొన్నిసార్లు మాత్రం జనవరి 14, ఇంకొన్ని సార్లు జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ నెలలో సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశిస్తాడు.

అందుకే ఈ పండుగకు మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. ఈ సమయంలో సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశి లోకి ప్రవేశిస్తాడని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ పండుగకు ఆ పేరు వచ్చింది. సంక్రాంతితో పాటు ఈ నెలలో ఇంకా ఏయే పండుగలు ఉన్నాయో తెలుసుకుందాం...

జనవరి 6వ తేదీ..
జనవరి 6వ తేదీ అయిన సోమవారం నాడు ఏకాదశి. తెలుగు క్యాలెండర్ ప్రకారం శుక్ల పక్షానికి చెందిన ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటాు. ఈరోజున అనేక మంది హిందువులు విష్ణు దేవుడిని పూజిస్తారు.

జనవరి 8వ తేదీ..
జనవరి 8వ తేదీ అయిన బుధవారం నాడు ప్రదోష్ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పర్వదినాన్ని శివుడు మరియు పార్వతీకి అంకితం చేయబడింది. ఈరోజు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడం ఆనాదిగా వస్తోంది.

జనవరి 10వ తేదీ..
జనవరి 10వ తేదీ అయిన శుక్రవారం నాడు శాకంబరి పౌర్ణమి. ఇది తెలుగు నెలలో చివరి రోజు. ఈరోజు పౌర్ణమి సందర్భంగా చాలా మంది హిందువులు సత్యనారాయణ కథను పఠించడం వల్ల తమకు శుభం కలుగుతుందని భావిస్తారు.

జనవరి 13వ తేదీ..
జనవరి 13వ తేదీ అయిన సోమవారం నాడు గణేష్ చతుర్థి సందర్భంగా చాలా మంది హిందువులు ఆరోజున ఉపవాసం ఉంటారు. ఈ పండుగను టిల్ చతుర్థి అని కూడా అంటారు. ఈరోజు విఘ్నేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ సందర్భంగా ఆరోజున చాలా మంది హిందువులు ఉపవాసం ఉండి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.

జనవరి 14వ తేదీ..
జనవరి 14వ తేదీ అయిన మంగళవారం నాడు మన తెలుగు రాష్ట్రాల్లో భోగీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆరోజు ప్రజలందరూ తెల్లవారు జాము నుండే భోగి మంటలు వేసి చలి నుండి వెచ్చదనాన్ని పొందుతారు. అలాగే రంగు రంగుల ముగ్గులు కూడా వేస్తారు. గొబ్బెమ్మలను కూడా పెడతారు.

జనవరి 15వ తేదీ..
మన దేశంలో జనవరి నెలలో ఏదైనా ప్రత్యేకమైన పండుగ ఉందంటే అది మకర సంక్రాంతి. ఈ నెలలో బుధవారం నాడు సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సందర్భంగా చాలా మంది హిందువులు ఉదయాన్నే నదిలో పవిత్ర స్నానం చేస్తారు. సూర్య నమస్కారాలు చేస్తారు. ఆ తర్వాత మకర సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి. ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఈ పండుగ రోజున గాలిపటాలను కూడా ఎగురవేస్తారు.

జనవరి 16వ తేదీ..
భోగీ, మకర సంక్రాంతి తర్వాత కనుమ పండుగను కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో కోడి పందెలు, ఎద్దుల పందేలు, తమిళనాడు వంటి ప్రాంతాల్లో జల్లి కట్టు పోటీలను నిర్వహిస్తారు.

జనవరి 20వ తేదీ..
జనవరి 20వ తేదీ అయిన సోమవారం నాడు షట్టిల ఏకాదశి. ఈ ప్రత్యేకమైన రోజు దేవుడికి నువ్వుల గింజలతో చేసిన వంటకాన్ని సమర్పిస్తారు. ఆరోజున నువ్వులతో చేసిన వస్తువులను ఎక్కువగా తింటారు.

జనవరి 22వ తేదీ..
జనవరి 22వ తేదీ అయిన బుధవారం నాడు ప్రదోష్ వ్రతంగా పరిగణిస్తారు. ఈరోజున ఈశ్వరుడు మరియు పార్వతీ దేవిల ఆశీర్వాదం పొందుతారు.

జనవరి 24వ తేదీ..
జనవరి 24వ తేదీ అయిన శుక్రవారం నాడు మౌని అమావాస్య. ఈ సందర్భంగా చాలా మంది హిందువులు పవిత్రమైన నదిలో స్నానం చెయ్యాలి. అలాగే ఆరోజున స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలి.

జనవరి 28వ తేదీ..
జనవరి 28వ తేదీ అయిన మంగళవారం నాడు అంగారక్ వినాయక చతుర్థిని జరుపుకుంటారు. వాస్తవానికి వినాయక చతుర్థి మంగళవారం నాడు వస్తే అప్పుడే అంగారక వినాయక చతుర్థి అని అంటారు.

జనవరి 30
జనవరి 30వ తేదీ అయిన గురువారం నాడు బసంత్ పంచమి. ఈ పండుగ రోజున సరస్వతీ దేవికి అంకితం చేయబడింది. ఈరోజు ఆ తల్లిని ప్రత్యేకంగా పూజిస్తారు.



Click it and Unblock the Notifications
