అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..?

సోషల్ మీడియాలో ఫ్రెండ్ అయ్యింది. చేసే ప్రతి మెసేజ్ కి రిప్లై ఇచ్చింది. ఇంత అందమైన నమ్మాయి నాకు పడిపోయదనుకుని మురిసిపోయాడు. రొమాంటిక్ గా మాట్లాడి కవ్వించింది. కంటి మీద కునుకులేకుండా కలలు కన్నాడు. ఒక రోజు కలుద్దాం అని పిలిచింది. అర్థరాత్రి ఎగరేసుకుంటూ వెళ్లాడు. అమ్మాయి వచ్చింది.. రూమ్ లోకి తీసుకెళ్లింది. తర్వాత అంతా షాక్..అందమైన అమ్మాయి అనుకుని వస్తే ఇలా అయ్యిందేంటని ఏడ్చాడు. అసలు అతడు ఎవరు, ఆ అమ్మాయి ఎవరు, ఏం జరిగిందనే పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

మనదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన అసోంలోని తిన్ సుఖియా జిల్లాలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా పనిచేసే వ్యక్తికి ఈ ఏడాది జులైలో ఇన్ స్టాగ్రామ్ లో ఓ అందమమైన అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. వెంటనే యాక్సెప్ట్ చేశాడు. అయితే ఆ అందం వెనుక పెద్ద అపాయం ఉందని గమనించలేకపోయాడు. వెంటనే ఆ అమ్మాయి బ్యాంక్ మేనేజర్ ని తన మెసేజ్ లతో కవ్వించడం మొదలుపెట్టింది.

Instagram Honey Trap Case Bank Manager Lured for a Midnight Date Blackmailed with Secret Video

అందమైన అమ్మాయి మేసేజ్ లు చేస్తే ఎవ్వరు రిప్లై ఇవ్వకుండా ఉంటారు చెప్పడండి. వెంటనే బ్యాంకు మేనేజర్ కుడా మేసేజ్ లు పంపడం, క్రమంగా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం జరిగింది. రోజుల వ్యవధిలోనే వీరి మధ్య బంధం బలపడింది. ఈ క్రమంలో ఆగస్టు 14న ఆ అమ్మాయి బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరు అర్థరాత్రి 1 గంటకి జోర్హాట్ అనే సిటీలోని తన ఇంటికి రమ్మంది. దీంతో నా అంత అదృష్టవంతుడు లేడనుకుంటూ ఆమె చెప్పినట్లు జోర్హాట్ కి చేరుకున్నాడు మేనేజర్. అతడిని సియోనీ అలీ ఏరియాలోని ఓ రెంట్ హౌస్ కి తీసుకెళ్లింది.

అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా..అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా..

అమ్మాయి, మేనేజర్ ఇద్దరూ ఇంట్లొకి వెళ్లి తలుపులు వేసుకుని ఉన్న సమయంలో కొద్దిసేపటికి ఎవరో తలుపు కొట్టారు. ఆ అమ్మాయి నేను వెళ్లి చూస్తా అని చెప్పి డోర్ తీసింది. వెంటనే ఇంట్లోకి వచ్చిన మేనేజర్ ని వీడియో తీశారు. 2లక్షలు ఇవ్వకుంటే ఈ వీడియోని మీ కుటుంబసభ్యులకు పంపుతాం,సోషల్ మీడియాలో పెడతాం అని మేనేజర్ ని బెదిరించారు. దీంతో భయపడిన మేనేజర్ వాళ్లకి 2 లక్షలు ఇచ్చారు. అయితే ఆ తర్వాత కూడా ఫోన్ చేసి బెదిరించడంతో మరో రూ. 1 లక్ష ఇచ్చాడు.

అయితే ఇదంతా ఆ అమ్మాయి పనే అని మనోడికి ఆలస్యంగా అర్థం అయ్యింది. అప్పటికే 3 లక్షలు వాళ్లకు ఇవ్వగా..వాళ్లు మరో 5 లక్షలు తమకు ఇవ్వాలని మేనేజర్ ని బెదిరించారు. నిరంతర బెదింపులతో మేనేజర్ ఇక అక్టోబర్ 2న జోర్హాట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి విషయం మొత్తం పోలీసులకు చెప్పేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు..ఇన్ స్టాగ్రామ్ వేదికగా హనీ ట్రాపింగ్ జరుగుతుందని గుర్తించి, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు. మొత్తం 2 మహిళలు, 3 పురుషులను అరెస్ట్ చేశారు.

Instagram Honey Trap Case Bank Manager Lured for a Midnight Date Blackmailed with Secret Video

ఈ ముఠా వెనుక మోరోమో దాస్ నియోగ్ అనే మహిళ మాస్టర్ మైండ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందమైన తమ ఫొటోలు, వీడియోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి డబ్బున్న వ్యక్తులను ట్రాప్ లోకి దించుతున్నట్లు గుర్తించారు

Story first published: Monday, October 12, 2026, 12:32 [IST]
Desktop Bottom Promotion