నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి

Posted By:

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2026లో భాగంగా 3 వ రోజున(అక్టోబర్ 13)న అమ్మవారిని శ్రీ అన్నపూర్ణావేవి రూపంలో అలంకరించి కొలుస్తారు. లోకంలోని జీవులన్నింటికీ ఆకలి తీర్చి, పోషణ కల్పించే జగన్మాతగా అన్నపూర్ణాదేవిని కొలుస్తారు. అలాంటి అమ్మకు నైవేద్యంగా కొబ్బరి పాయసం చేయండి.

లోకానికే అన్నం పెట్టే ఆ అన్నపూర్ణా దేవి తల్లికి.. స్వచ్ఛమైన పాలు, కొబ్బరి, నెయ్యితో చేసిన మధురమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే, ఆ తల్లి ఎంతో సంతోషించి మన కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నైవేద్యంగా సమర్పించడానికి, ఎంతో రుచికరమైన,నోట్లో వేసుకోగానే కరిగిపోయే కొబ్బరి పాయసాన్ని ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

Dussehra Navaratri Day 3 Naivedyam How to Make Delicious Kobbari Payasam for Annapurna Devi

కావాల్సిన పదార్థాలు

పచ్చి కొబ్బరికాయ - 1
చిక్కటి పాలు - తగినన్ని
పంచదార - రుచికి సరిపడా
కుంకుమపువ్వు - కొద్దిగా
నెయ్యి - కొద్దిగా
డ్రై ఫ్రూట్స్- జీడిపప్పు, బాదం, కిస్మిస్
యాలకుల పొడి - కొద్దిగా

దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి?

తయారీ విధానం

-ముందుగా ఒక తాజా పచ్చి కొబ్బరికాయను తీసుకుని రెండుగా పగలగొట్టాలి. పెంకు నుంచి కొబ్బరిని జాగ్రత్తగా బయటకు తీసి, దానికి అడుగున ఉన్న బ్రౌన్ రంగు పొరను పూర్తిగా చెక్కు తీసేయాలి. ఆ తర్వాత ఆ తెల్లటి కొబ్బరిని నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి.

-ఇప్పుడు ఆ కొబ్బరిని ఒక తురుము పీట లేదా గ్రేటర్ సహాయంతో చాలా సన్నగా తురుముకోవాలి. కొబ్బరి తురుము ఎంత సన్నగా ఉంటే పాయసం అంత అద్భుతమైన రుచిని ఇస్తుంది.

-తర్వాత ఒక మందపాటి గిన్నెలో లేదా కెటిల్‌ లో చిక్కటి పాలు పోసి బాగా మరిగించాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత సన్నని మంటపై, పాలు సగం పరిమాణానికి తగ్గేలా నిదానంగా మరిగించాలి. ఇలా నెమ్మదిగా మరిగించడం వల్లే పాయసానికి అద్భుతమైన క్రీమీ టెక్స్చర్ వస్తుంది.

-పాలు బాగా చిక్కబడి సగానికి తగ్గాక, ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని అందులో వేయాలి. పాయసం చిక్కగా, క్రీమీగా మారేంతవరకు కనీసం 7 నుంచి 8 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. ఈ సమయంలో కొబ్బరి పాలలోని కమ్మదనాన్ని పీల్చుకుని మరింత రుచిగా మారుతుంది.

-పాయసం ఉడుకుతున్నప్పుడు అందులో మీ తీపికి తగినంత చక్కెర వేసుకోవాలి. అలాగే ముందుగా కుంకుమపువ్వు నానబెట్టుకున్న పాలను, నేతిలో దోరగా వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయాలి. కుంకుమపువ్వు వల్ల పాయసానికి మంచి రాయల్ లుక్ వస్తుంది.

-చివరగా పాయసంలో కొద్దిగా యాలకుల పొడి చల్లి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన, కొబ్బరి పాయసం రెడీ. దసరా సమయంలో ఉపవాసాలు ఉండే భక్తులకు కూడా ఈ పాయసం తక్షణ శక్తిని ఇస్తుంది.

[ of 5 - Users]
Story first published: Monday, October 12, 2026, 18:29 [IST]
Desktop Bottom Promotion