For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాణక్యనీతి: మీ జర్నీ స్వర్గం నుండి ప్రారంభం అయ్యిందని తెలిపే లక్షణాలు

|

మరణం తరువాత మానవులు స్వర్గం లేదా నరకానికి వెళ్లేందుకు గల కారణాలను పురాతన తత్వశాస్త్రాలలో విశదీకరించ బడింది. మరియు ఈ స్వర్గం, నరకం అనేవి జీవన ప్రమాణాలమీద చూపే ప్రభావాల కారణంగా, ప్రజలలో అత్యంత ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఇవి నిజానికి ఉన్నాయో లేదో ఎవ్వరికీ పూర్తి స్థాయిలో తెలియనప్పటికీ, అవి మానవ జీవన విధానాన్ని సన్మార్గంలో ఉంచేందుకు కొద్దో గొప్పో దోహద పడ్డాయి అన్నమాట వాస్తవం. కానీ, పూర్వ జన్మలో మనం ఎక్కడికి పంపబడ్డామో ఎలా తెలుస్తుంది ? అదేవిధంగా ఈ జీవితం పూర్తయ్యాక ఎక్కడికి పంపబడుతాము అన్నది ఎలా తెలుసుకోవడం ? చాణక్య నీతిలో దీనికి సమాధానం ఉంది. చాణక్యుడు., స్వర్గం నుండి వచ్చానని తెలుసుకునే క్రమంలో భాగంగా వ్యక్తికి సంబంధించిన నాలుగు లక్షణాల గురించిన వివరణను ఇచ్చాడు. క్రింద చెప్పబడిన శ్లోకంలో ఈ లక్షణముల గురించి తెలుపబడింది.

four signs that you have been to heaven

స్వర్గవాసి జన్ కే సదా, చర్ చిహ్న లేఖి యేహి !

దేవ్ విప్ర్ పూజా మధుర్, వక్య దాన్ కరి దేహి !!

ప్రజా సంక్షేమం కోసం ఎవరు దాన ధర్మాలకు పూనుకుంటారో ….

ప్రజా సంక్షేమం కోసం ఎవరు దాన ధర్మాలకు పూనుకుంటారో ….

సహాయం చేసే మంచి దృక్పదం, మంచి మనసు ఉన్నవారు ఇతరుల బాధను అర్ధం చేసుకోవడంలో ముందు ఉంటారు. వీరు ప్రజల బాధలను భరించలేరు. పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు, అవసరమైన వారికి విరాళాలను ఇచ్చేవారిగా ఉన్నతమైన ఆలోచనా ధోరణి కలిగిన వారిగా ఉంటారు. అంతేకాకుండా తమ కష్ట ఫలాలను తెలియని వారితో పంచుకునేందుకు కూడా సిద్దంగా ఉండరు. ఇలా అవసరమైన విరాళాల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న వ్యక్తులు స్వర్గం నుంచి వచ్చినట్లుగా నమ్మబడుతుంది.

వినయ విధేయతలతో కూడుకుని, మృదుస్వభావం కలిగినవారు …

వినయ విధేయతలతో కూడుకుని, మృదుస్వభావం కలిగినవారు …

కొంత మంది ఎల్లప్పుడూ ప్రశాంతంగా, కనిపిస్తూ ఉంటారు. నిజానికి మానసిక ప్రశాంతత, జీవితంలోని ఒడిదుడుకుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ కష్టాన్ని అధిగమించడంలో చివరికి మానసిక ప్రశాంతతను పొందడంలో వీరు ఉన్నతంగా కనిపిస్తారు. శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రకారం, ఒక వ్యక్తి తీవ్రంగా భాధపడుతున్నాడు లేదా సంతోషంలో ఉన్నాడు అని చెప్పడానికి వారి మాట తీరు, ప్రవర్తనా సరళి సహాయపడుతుంది. క్రమంగా వారి ప్రవర్తనలో మృదు మధురంగా ఉన్నవారు స్వర్గం నుండి వచ్చినట్లుగా చెప్పబడుతుంది.

ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపే వ్యక్తి …

ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపే వ్యక్తి …

ఏ భక్తుడై పూజ చేసేది, తమ కుటుంబ మరియు శ్రేయోభిలాషుల లేదా ప్రజల సంక్షేమం మరియు శ్రేయస్సు దృష్ట్యా., అవునా ?. చాణక్యుని ప్రకారం, ఇలా ఆధ్యాత్మికతను నమ్ముకుని, మతాతీత మనస్సును కలిగి ఇతర జీవుల పట్ల సానుకూల దృక్పధాన్ని కలిగి ఉండే వ్యక్తి స్వర్గం నుండి వచ్చినట్లుగా చెప్పబడుతుంది.

ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించేవాడు …

ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించేవాడు …

ఈ ప్రపంచమంతా ఉనికి కోసం పోరాడుతూనే ఉంటుంది. ఆ ఉనికి పరువు, ప్రాణం, గుర్తింపు వంటి అనేక అంశాల చుట్టూ తిరుగుతుంది. ఒక వ్యక్తి ఉనికి లేదా గుర్తింపుకు సహాయం చేసేకన్నా, అతని ఆకలి తీర్చేందుకు ఆహారం అందించే వారిని ఉత్తమునిగా చెప్పబడుతుంది. కేవలం వ్యక్తుల పరంగానే కాకుండా, ఈ సృష్టిలోని సకల చరాచర జీవులకీ ఇది వర్తిస్తుంది. అది వారి వారి మనుగడకు సహాయపడుతుంది. ఈ విధంగా వారి భాదను అర్ధం చేసుకుని ఆకలిని తీర్చే ప్రయత్నం చేసే వ్యక్తులు స్వర్గం నుండి వచ్చిన వారిగా చెప్పబడుతుంది. అలాకాకుండా స్వార్థపూరిత ఆలోచనలతో, అత్యాశతో ఇతరుల ఆకలి భాధలను పట్టించుకోకుండా, ఆస్తులు కూడబెట్టుటకే తమ ఆలోచనలని ఉపయోగించేవారు, తప్పక నరక లోకము నుండి వచ్చిన వారిగా చెప్పబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: spirituality
English summary

Four Signs That You Have Been To Heaven

How do we know that we came to live this another life, from heaven or hell? Well, there is an answer for this in Chanakya Niti. Chanakya had told about four qualities in a person that tell he came from heaven.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more