Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
కన్నడ చిత్రసీమలో మరో తీవ్ర విషాదం..గుండెపోటుతో ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత
కన్నడ చిత్రసీమలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత అయిన దిలీప్ రాజ్ (47) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన హఠాన్మరణం అభిమానులను, కన్నడ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున ఆయనకు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచారని, ఆయనను బతికించలేకపోయామని డాక్టర్లు ధృవీకరించారు.

నాటకరంగం నుండి వెండితెరకు..
దిలీప్ రాజ్ ప్రయాణం సాగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. టెలివిజన్, వెండితెరపై తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ముందు ఆయనకు నాటకరంగమే బలమైన పునాదిగా నిలిచింది. నటరంగ, దృష్టి వంటి ప్రఖ్యాత నాటక బృందాలతో ఆయన ఎంతో చురుకుగా పనిచేశారు.
నాటకాల్లో నటిస్తూనే తనలోని నటుడికి అద్భుతంగా పదును పెట్టుకున్నారు. ఈ నాటక ప్రయాణంలోనే ప్రముఖ నాటక, టీవీ నటి నందితతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ఆయనను బుల్లితెర ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేసి, ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
బుల్లితెరపై చెరగని ముద్ర..
కన్నడ టెలివిజన్ రంగంలోకి కంబడ మానే అనే టెలిఫిల్మ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన దిలీప్ రాజ్, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. జనని సీరియల్ ఆయన కెరీర్ కు అతిపెద్ద బ్రేక్ ఇచ్చింది. అందులో ఆయన చేసిన పాత్రకు విశేష ఆదరణ లభించింది. ఆ తర్వాత సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా కన్నడ ప్రేక్షకులకు ఇంటి మనిషిగా మారిపోయారు.
ముఖ్యంగా ప్రముఖ జీ కన్నడ ఛానెల్ లో ప్రసారమైన హిట్లర్ కళ్యాణ సీరియల్ లో హీరోగా నటించి ఆయన స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. కేవలం నటుడిగానే ఆగిపోకుండా డిఆర్ క్రియేషన్స్ అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన టీవీ సీరియల్స్‌ను సైతం నిర్మించారు.
వెండితెరపై ప్రయాణం, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు..
బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా దిలీప్ తన సత్తా చాటారు. తన కెరీర్ లో సుమారు 24కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 2007లో దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తో కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మిలానా సినిమా ఆయనకు వెండితెరపై ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత యు టర్న్, బాయ్‌ఫ్రెండ్ వంటి ఎన్నో సినిమాల్లో తనదైన శైలిలో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. నటన, నిర్మాణంతో పాటు ఆయన అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఆ దినగలు సినిమాలో హీరో చేతన్ కుమార్‌కు ఆయన చెప్పిన డబ్బింగ్ ఆయనలోని వాయిస్ యాక్టింగ్ నైపుణ్యానికి ఒక నిదర్శనం.



Click it and Unblock the Notifications
