Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
హై కాల్షియం, జీరో షుగర్.. పవర్ ప్యాక్డ్ రాగి స్మూతీ ఎలా చేసుకోవాలంటే..
ఉదయం పూట హడావిడిలో సరైన బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తున్నారా? లేదా కఠినమైన వర్కౌట్ చేసిన తర్వాత శరీరానికి తక్షణ శక్తినిచ్చే, అలసటను తగ్గించే ఆరోగ్యకరమైన డ్రింక్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకు యాపిల్ రాగి స్మూతీ బెస్ట్. రోజువారీ ఆహారంలో సిరిధాన్యాలను (మిల్లెట్స్) భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

మన సంప్రదాయ ఆహారమైన రాగులలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. యాపిల్స్ లోని సహజమైన తీపి, ఖర్జూరాల రుచితో తయారయ్యే ఈ స్మూతీలో బయట దొరికే ఎలాంటి రిఫైండ్ షుగర్ (కృత్రిమ చక్కెర) వాడాల్సిన అవసరం లేదు. ఎముకలను దృఢంగా ఉంచే కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలు ఇందులో దాగి ఉన్నాయి.
యాపిల్ రాగి స్మూతీ తయారీకి కావాల్సిన పదార్థాలు
రాగి పిండి - 1 టేబుల్ స్పూన్
యాపిల్ - 1
పాలు - అర కప్పు
నీళ్లు -తగినంత
నానబెట్టిన ఖర్జూరాలు - 4
నానబెట్టిన బాదం పప్పులు - 5
యాలకుల పొడి - చిటికెడు
ఐస్ క్యూబ్స్ - కొన్ని
బాదం ముక్కలు - కొద్దిగా
యాపిల్ రాగి స్మూతీ తయారీ విధానం
-ముందుగా ఒక చిన్న గిన్నెలో పావుకప్పు నీళ్లు తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ రాగి పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని అందులో పోయాలి. మంటను మీడియంలో ఉంచి, అడుగు అంటకుండా, ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-రాగి జావ పూర్తిగా చల్లారిన తర్వాత దానిని ఒక జ్యూస్ బ్లెండర్ లేదా మిక్సీ జార్ లో వేసుకోవాలి. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులు, గింజ తీసేసిన ఖర్జూరాలను, చిటికెడు యాలకుల పొడి, అరకప్పు పాలను, కొన్ని ఐస్ క్యూబ్స్ మిక్సీలో వేసి అన్ని పదార్థాలు మెత్తగా, స్మూత్ గా అయ్యేంత వరకు బ్లెండ్ చేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన స్మూతీ రెడీ. దీనిని ఒక గ్లాసులోకి తీసుకొని, పైన సన్నగా తరిగిన బాదం ముక్కలతో అలంకరిస్తే, త్రాగేటప్పుడు పంటికి తగులుతూ భలే కరకరలాడుతూ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
