Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
2026 హనుమాన్ జయంతి: ఏప్రిల్ 1నా? 2నా? సరైన తేదీ, పూజా ముహూర్తాల పూర్తి వివరాలు!
శ్రీరామ కార్య సాధనకు, ధర్మ రక్షణకు జన్మించిన మహా పరాక్రమవంతుడు, వాయుపుత్రుడు శ్రీ హనుమంతుడు. చైత్ర మాస శుక్ల పక్ష పౌర్ణమి నాడు, మంగళవారం, చిత్ర నక్షత్రం, మేష లగ్నంలో... సూర్య, కుజ, గురు గ్రహాలు అత్యంత శుభ స్థానాలలో ఉండగా ఆంజనేయస్వామి జన్మించాడు.
శ్రీరాముని కష్టాలను తీర్చడమే కాక, లంకా దహన సమయంలో రావణుని చెరనుండి శనిదేవుడిని విడిపించి ఆపద్బాంధవుడిగా, సంకటమోచనుడుగా కీర్తింపబడ్డాడు. సాక్షాత్తూ సూర్య భగవానుడి దగ్గరే సకల విద్యలు అభ్యసించిన మహా జ్ఞానఖని హనుమంతుడు. వాయుదేవుని మానస పుత్రుడైనందున పవన పుత్రుడిగానూ పూజలందుకుంటున్నాడు.

2026లో హనుమాన్ జయంతి ఎప్పుడు?
ఈ ఏడాది చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 7:41 గంటల వరకు కొనసాగుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం పండుగలను సూర్యోదయ తిథి (ఉదయించే తేది) ఆధారంగా లెక్కిస్తారు కాబట్టి హనుమాన్ జయంతిని ఏప్రిల్ 2వ తేదీ, గురువారం నాడు జరుపుకుంటారు.
పూజకు శుభ ముహూర్తాలు
పురాణాల ప్రకారం స్వామి ఉదయం వేళ జన్మించారు. కాబట్టి ఏప్రిల్ 2న ఉదయం 6:10 నుండి 7:44 గంటల మధ్య పూజ చేయడం అత్యంత శుభప్రదం. ఉదయం కుదరని భక్తులు సాయంత్రం కూడా పూజలు నిర్వహించుకోవచ్చు.
సాయంత్రం పూజ: 6:39 నుండి 8:06 గంటల వరకు (అమృత-సర్వోత్తమ ముహూర్తం). ఆ తర్వాత రాత్రి 8:06 నుండి 9:32 వరకు (చర-సామాన్య ముహూర్తం).
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4:38 నుండి 5:24 వరకు.
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:00 నుండి 12:50 వరకు.
విశిష్టమైన ధ్రువ యోగం, హస్తా నక్షత్రం
ఈ ఏడాది హనుమాన్ జయంతి నాడు విశేషమైన ధ్రువ యోగం, హస్తా నక్షత్రం ఏర్పడుతున్నాయి. తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం 2:20 వరకు ఉండే ధ్రువ యోగం.. ఏ విధమైన స్థిరమైన కార్యాలకైనా ఎంతో అనుకూలమైనది. ఆ తర్వాత వ్యాఘాట యోగం వస్తుంది. అలాగే ఉదయం నుంచి సాయంత్రం 5:38 వరకు హస్తా నక్షత్రం, ఆ తర్వాత చిత్ర నక్షత్రం ఉంటాయి.
మారుతి జన్మస్థలాలు ఇవే..
కేసరి, అంజనాదేవిల ముద్దుబిడ్డ అయిన హనుమంతుని జన్మస్థలం గురించి మన దేశంలో పలు చారిత్రక నమ్మకాలున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర (నాసిక్)లోని అంజనేరి పర్వతం, కర్ణాటక (హంపి)లోని అంజనాద్రి పర్వతం, జార్ఖండ్ లోని అంజన్ ధామ్, హర్యానాలోని కైతాల్ (దీని ప్రాచీన నామం కపిస్థల్), గుజరాత్ లోని డాంగ్ జిల్లాలోని అంజనీ గుహలను స్వామి జన్మించిన పవిత్ర స్థలాలుగా భక్తులు విశ్వసిస్తారు.



Click it and Unblock the Notifications
