Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Ganesha In Foreign Countries: విదేశాల్లో వినాయకుడు.. ఎక్కడెక్కడ ఎలా పిలుస్తారో తెలుసా?
జపాన్ లో బొజ్జ గణపయ్యను కాంగిటెన్ అంటారు. గణాబాచి, షాటెన్, బినాయకటెన్ ఇలా పలు పేర్లతో అక్కడి ప్రజలు పిలుచుకుంటారు.
Ganesha In Foreign Countries: దేవుళ్లలో ప్రథముడు గణనాథుడు. తొలి పూజలందుకునే ఇలవేల్పు. ఆ విఘ్నాలను తొలగించే వినాయకుడి చవితిని దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో గణేశ చతుర్థి సందడి అంతా ఇంతా కాదు.

విదేశాల్లోనూ వినాయకుడిని కోలుస్తారు. ఇక్కడా, అక్కడా పూజలందుకునే ఆ గణనాథుడిని ఒక్కో చోట ఒక్కోలా పిలుస్తారు. ఒకచోట తంత్ర గణపతిగా, బ్రహ్మగా ఇలా ఇష్ట దైవాన్ని ఎంతో ఇష్టంగా పిలుస్తూ కొలుచుకుంటారు.

1. జపాన్
జపాన్ లో బొజ్జ గణపయ్యను కాంగిటెన్ అంటారు. గణాబాచి, షాటెన్, బినాయకటెన్ ఇలా పలు పేర్లతో అక్కడి ప్రజలు పిలుచుకుంటారు. టోక్యో నగరం పురాతన బౌద్ధ ఆలయాలకు ప్రసిద్ధి. అక్కడ కాంగిటెన్ ఆలయం కూడా ఉంటుంది. కొన్ని ఆలయాల్లో ఆడ ఏనుగు(స్త్రీ శక్తిని)ను ఆలింగనం చేసుకున్న రూపంలోనూ విగ్రహాలు కనిపిస్తాయి. అయితే ఈ గణేశ విగ్రహాలను పెట్టెల్లో పెట్టి భద్ర పరుస్తుంటారు. ఉత్సవాల సమయంలో వీటిని బయటకు తీసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆర్థికంగా నిలుదొక్కుకునేందుకు, ఆర్థిక ప్రయోజనాలు జరగాలని జపాన్ ప్రజలు వినాయకుడిని కొలుస్తారు.

2. ఇండోనేషియా
ఇండోనేషియాలోని సుమత్రా, జావా, బాలీ దీవుల్లో వినాయక ఆలయాలు ఉంటాయి. భారత్ లో గణనాథుడిని కొలిచినట్లే ఇండోనేషియాలోనూ కొలుస్తారు. అక్కడి ప్రముఖ నిర్మాణాలు, పాఠశాలలు, ఇతర చోట్ల గణేశుడి విగ్రహాలను ప్రతిష్టిస్తుంటారు. ఇండోనేషియా కరెన్సీపై కూడా గణపతి బొమ్మ ఉంటుంది. ఇక్కడి వినాయక చవితి అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఇతర శుభ దినాల్లోనూ గజాననుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. బాలీ దీవిలో 30 అడుగుల ఎత్తున గణేశ విగ్రహం ఉంటుంది. దీనిని 2006లో ప్రతిష్టించారు. మన దేశంలో వినాయక చవితి ఎంత గ్రాండ్ గా చేసుకుంటామో.. నిమజ్జనమూ అంతే వైభవంగా చేసుకుంటాం. ఇండోనేషియాలోనూ గణేశ నిమజ్జనం కోలాహలంగా చేసుకుంటారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులు కొబ్బరి కాయలు కొడుతుంటారు. ఆ కొబ్బరి చిప్పలను తీసేసేందుకు ఒక రోజంతా పడుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

3. థాయ్ లాండ్
వినాయకుడిని థాయ్ లాండ్ లో ఫ్రా ఫికనెట్ అని పిలుస్తారు. గణేశుడి ఎత్తైన విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ప్రాజెక్టులో అతి పెద్ద వినాయక విగ్రహాలను ఉంచారు. అందులోని ఒక వినాయక విగ్రహం ఎత్తు 15 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. 2010వ సంవత్సరంలో పూర్తి అయిన మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఆ విగ్రహం ఎత్తు 9 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు ఉంటుంది.

4. మయన్మార్
మయన్మార్ లో వినాయకుడిని బ్రహ్మగా కొలుస్తారు. అలా బ్రహ్మ గా పిలుపుచుకోవడం వెనక ఇక్కడ ఓ పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. దాని ప్రకారం బ్రహ్మ దేవుడి శిరస్సు భంగం అయినప్పుడు.. ఆ తల భాగంలో ఏనుగు తలను అతికించారని.. అలా బ్రహ్మ దేవుడు కాస్త గజాననుడిగా మారాడని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. వినాయక చవితి రోజున కూడా గణనాథుడిని పరబ్రహ్మగా కొలుస్తారు.

5. నేపాల్
నేపాల్ లో హిందూ దేవుళ్ల ఆలయాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడి శివాలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి. అలాగే వినాయక ఆలయాలు కూడా ఎక్కువే. అయితే నేపాల్ ఆలయాల్లో కనిపించే వినాయక విగ్రహం కొంత భిన్నంగా ఉంటుంది. విగ్రహం చేతుల్లో మొక్కలు ఉంటాయి. కళ్లు ఏటవాలుగా ఉంటాయి. ఇక్కడి రైతులు వినాయకుడిని పంటల దేవుడిగా కొలుస్తారు. కొత్త పంటలు వచ్చినప్పుడు గణనాథుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు.

6. ఐర్లాండ్
వివిధ భంగిమల్లో ఉండే గణనాథుల విగ్రహాల ఫోటోలను చాలా మంది చూసే ఉంటారు. అయితే అవి భారత్ లోనివి కావు. వాటిని ఐర్లాండ్ లోని కౌంటీ విక్లోకు సమీపంలో విక్టోరియా వే పార్కులో ప్రతిష్టించారు. వీటిని తమిళనాడుకు చెందిన భారతీయ శిల్పకారులే చెక్కారు. ఈ శిల్పాలను చెక్కడానికి ఐదుగురు శిల్పుు ఏడాది పాటు శ్రమించారు. ఈ విగ్రహం ఒక్కొక్కటి 3 నుండి 5 అడుగుల ఎత్తు, మంచి రూపంతో ఉంటాయి.

7. సింగపూర్
సింగపూర్ లోని సిలాన్ రోడ్డులో శ్రీ సెంపెగ వినాయగర్ దేవాలయం ఉంటుంది. ఈ గుడిని పూర్తిగా చోళ శైలిలో నిర్మించారు. ఈ దేవాలయంలో వినాయకుడిని అక్కడి ప్రజలు విశేషంగా పూజిస్తారు. ఈ ఆలయానికి 162 ఏళ్ల చరిత్ర ఉంది.



Click it and Unblock the Notifications
