Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
దోషాలు తొలగించడానికి నెమలి పించం ఎలా ఉపయోగపడుతుంది ?
నెమలి పించం చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో కదూ.. ! రంగు రంగుల కంటి ఆహారం, దాని చుట్టూ మెరిసే రెప్పలు ఉన్నట్టు. చూడగానే.. ఎవరినైనా ఎట్రాక్ట్ చేస్తుంది. మీకు గుర్తుందా.. చిన్నప్పుడు నెమలిపించం కనిపిస్తే.. బుక్స్ పెట్టుకునేవాళ్లం. అయితే.. అప్పుడు సరదాగా పెట్టుకున్నప్పటికీ.. ఈ నెమలిపించం అనేక దోషాలను తొలగిస్తుందని తెలుసా ?
గాయత్రి మంత్రం ఎందుకంత శక్తివంతమైనది ? విశిష్టత ఏంటి ?
నిజమే.. నెమలి పించం డెకరేషన్ గానే కాదు.. చూడ్డానికి సాధారణంగా కనిపించే ఈ నెమలిపించం అన్ని రకాల దోషాలను నివారించి.. ఇంట్లో వాస్తు సమస్యలకు దూరంగా ఉంచుతుంది. మరి దోషాలు నివారించడానికి నెమలిపించం ఎలా ఉపయోగించాలి ? ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకోవాలనుందా ? అయితే.. ఈ స్టోరీ చదవండి..

శని దోషం
మూడు నెమలి పించములు తీసుకుని నలుపు దారంతో కట్టాలి. తర్వాత కొంచెం వక్కపొడి చల్లి.. కొంచెం నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు ఓం శనేశ్వరాయ నమ: అని.. 21 సార్లు జపించాలి.

వాస్తు దోషాలకు
వాస్తు దోషాలు తొలగించుకోవడానికి 8 నెమలి పించంలను తీసుకుని.. అన్నింటినీ కలిపి.. తెలుపు రంగు దారంతో కట్టాలి. అలా కట్టిన తర్వాత.. ఓం సోమాయ నమ: అని జపించాలి.

లాకర్ దగ్గర
లాకర్ దగ్గర నెమలి పించం పెడితే.. సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే.. డబ్బుని ఎట్రాక్ట్ చేస్తుంది.

నెగటివ్ ఎనర్జీ
నెమలిపించం నెగటివ్ ఎనర్జీస్ ను, వాస్తు దోషాలను తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇంటి ద్వారానికి కొన్ని నెమలి పించాలు పెట్టడం మంచిది.

ఆఫీస్ లో
ఆఫీస్ లో నెమలి పించం గానీ, నెమలి పించం పెయింటింగ్ గానీ పెట్టుకోవడం వల్ల.. మీ పనితీరు మెరుగవుతుంది. మంచి ప్రశంసలు అందుకుంటారు.

ఆరోగ్యం, శ్రేయస్సు
పురాతన కాలంలో నెమలిపించంను మెడిసిన్ గా ఉపయోగించేవాళ్లు. అలాగే విసనకర్రల రూపంలో వాడేవాళ్లు. అంటే.. నెమలిపించానికి, ఆరోగ్యానికి సంబంధం ఉన్నట్టే కదా..

ప్రేమ
బెడ్ రూంలో నెమలి పించం పెట్టుకోవడం వల్ల.. భార్యాభర్తల మధ్య అండర్ స్టాండింగ్ తోపాటు, సంబంధం మెరుగ్గా ఉంటుంది.

తలుపుకి ఎదురుగా
నెమలిపించంను ముఖద్వారానికి ఎదురుగా పెట్టుకోవడం వల్ల.. చెడుని, నెగటివ్ ఎనర్జీస్ ని మీ ఇంటి నుంచి తీసుకెళ్లిపోతుంది.

వేదాల్లో
మన వేదాల్లో.. నెమలిపించంకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీకృష్ణుడి రూపం నెమలి పించం లేకుండా.. పూర్తి అవదంటే అతిశయోక్తిలేదు.

ఆధ్యాత్మిక శక్తి
పురాతన గ్రంధాల ప్రకారం నెమలిపించానికి ఆధ్మాత్మిక శక్తి ఉందని, అందుకే ఆధ్మాత్మికంగా నెమలిపించముకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తుంది.



Click it and Unblock the Notifications
