Latest Updates
-
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త!
లక్ష్మీ కటాక్షం పొందాలంటే.. ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలి ?
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. ఆశిస్తారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే.. ఆ ఇంట్లో లేమి అన్న కొరత ఉండదు. సుఖసంతోషాలతో ఉండగలరు. అయితే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా మంది చాలా రకాలు పూజలు చేస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం అయితే ఇల్లంతా కళగా అలంకరిస్తారు. అయితే లక్ష్మీ దేవి ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసా ?
సాధారణంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి గడపకు పసుపు రాసి.. పూలతో అలంకరిస్తారు. అలాగే.. ఇంట్లో దేవుడి గదిలో పూలు, పండ్లతో చక్కగా పూజలు నిర్వహిస్తారు. మంత్రాలు, శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో నియమాలతో పాటు, కొంతమంది శుక్రవారం డబ్బులు ఇతరులకు ఇవ్వరు. అలాగే.. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకం కాబట్టి.. చాలామంది చాలా రకాల నియమాలు పాటిస్తుంటారు. కానీ.. లక్ష్మీ దేవి ఎక్కడ ఉంటుంది ? ఎలాంటి ప్రాంతంలో ఉండదు అనే విషయాన్ని మహావిష్ణువు ఎలా వివరించాడో ఇప్పుడు తెలుసుకుందాం..

లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులు కురిపించాలంటే ?
భగవంతుని పాలకులపై కోపం ప్రదర్శించే వాళ్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట.

లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులు కురిపించాలంటే ?
శంఖం శబ్ధం వినిపించని ఇంట్లో కూడా లక్ష్మీ నివాసం ఉండదట.

లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులు కురిపించాలంటే ?
ప్రతి ఇంట్లో తులసి ఉండాలని ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అయితే తులసిని పూజించని చోట కూడా ఆ లక్ష్మీదేవి ఉండదని మహా విష్ణువు వివరించారు.

లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులు కురిపించాలంటే ?
అతిథులకు భోజనాలు పెట్టని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని వివరించారు.

లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులు కురిపించాలంటే ?
ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట. అంటే.. ఇంట్లో పూజలు, పునస్కారాలు లేకుండా, ఎప్పుడు లేమి అనే బాధపడే వాళ్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట.

లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులు కురిపించాలంటే ?
ఇంటికి దీపం ఇల్లాలు అయిన ఆమె ఎప్పుడూ కంటతడి పెడుతూ ఉంటే.. అక్కడ లక్ష్మీదేవి ఉండదని విష్ణుమూర్తి వివరించాడు.

లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులు కురిపించాలంటే ?
చెట్లను నరికేవాళ్ల ఇంట్లో కూడా లక్ష్మి కటాక్షం లోపిస్తుందట.

లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులు కురిపించాలంటే ?
సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాళ్ల ఇంట్లో, తడి పాదాలతో నిద్రపోయేవారి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదట.

లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులు కురిపించాలంటే ?
తులసీ దేవిని పూజించే ఇంట్లో, శంఖ ధ్వని ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విష్ణుమూర్తి సెలవిచ్చారట.



Click it and Unblock the Notifications