Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
రుద్రాక్షలో ఇన్ని శక్తులు వున్నాయని మీకు తెలుసా..? రుద్రాక్ష శక్తిని ఇలా పరీక్షించవచ్చు..!
సృష్టిలో ప్రతీ ఒక్క వస్తువుకు ఒక ప్రత్యేకమైన శక్తి వుంటుంది. ఈ ప్రపంచంలో జంతువులకు, మనుషులకు, దేవుడి ప్రతిమలకు, కొన్ని రకాల విగ్రహాలకు, చెట్లకు, అలాగే రుద్రాక్షలకు ఒక ప్రత్యేకమైన శక్తి వుంటుంది. రుద్రాక్షలకు ప్రత్యేకమైన ప్రకంపణలు వున్నట్లు గుర్తించారు. రుద్రక్ష మన చుట్టూ వున్న కాంతి మండలాన్ని శుద్ధి చేస్తుంది. మన చుట్టూ వుండే ఆరానే కాంతిమండలంగా చెబుతాం. ఈ రోజుల్లో ఈ ఆరాని రికార్డ్ చేయడం కూడా చేస్తున్నారు. కాంతి మండలాలు, నల్లటి రంగు నుంచి తెలుపు రంగు వరకు వుంటుంది.

ఈ ఆరాని గుర్తించే వారు భారత దేశంలో చాలా మంది వున్నారు. వారికి అధునాత చేతబడి కూడా తెలిసి వుంటుంది. భారతదేశంలో చాలా మంది సాధువులు వీటిని ధరించడానికి కారణం వారు ఎప్పుడూ సంచరిస్తూ వుంటారు. వేరే వేరే చోట్ల నిద్రించడం, తినడం వల్ల వారి శరీరం క్షీణిస్తుంది. కొన్ని చోట్ల నిద్రపోని పరిస్థితి కూడా మీకు ఎదురౌతుంది. ప్రతీ రోజూ ఒకే చోట నిద్రించడం వల్ల ఒక శక్తి ఆ స్థలంలో ఏర్పాటవుతుంది. అక్కడ నిద్రించినప్పుడు మాత్రమే మీకు నిద్ర సరిగ్గాపడుతుంది. స్థలం మారితే కొంత విసుగు చెందుతారు.
రుద్రాక్ష ధరించిన వారి చుట్టూ ఒక శక్తి కవచం ఏర్పడుతుంది. బయట నుంచి వచ్చిన ఏ శక్తి కూడా వీరిని ఏమీ చేయలేదు. ఎక్కువ ప్రయాణించడం వల్ల మీ కాంతిమండలం దెబ్బ తింటుంది. రుద్రాక్ష ధరించడం వల్ల ఈ కాంతిమండలానికి ఏమీ కాకుండా వుంటుంది.
రుద్రాక్ష రక్షణగా కూడా ఉపయోగపడతుంది. కొందరు ఇతరుల జీవితాలను నాశనం చేయాలని చూస్తుంటారు. చేతబడులు, క్షుద్ర విద్యల ద్వారా ఈ పనులను చేస్తారు. నాలుగు వేదాల్లో అథర్వన వేదంలో ఈ దుష్ట శక్తుల గురించి మంత్ర తంత్రాల గురించి చెప్పబడి వుంది. శక్తిని ఇతరులకు హాని కలిగించే విధంగా ఎలా ఉపయోగించవచ్చో ఇందులోొ స్పష్టంగా చెప్పబడి వుంది.

కొందరు చేతబడులకు తమకు తెలియకుండా గురౌతారు. చేతబడుల్లో ఉపయోగించిన వస్తువులను తొక్కడం వల్లో లేక తాకడం వల్ల, లేదంటే ఆ చేతబడి గాలి తగలడం వల్ల కొందరు వింతగా ప్రవర్తిస్తుంటారు. వారిలో నెగిటివ్ ఎనర్జీ పనిచేయడం మొదలౌతుంది. ఇలాంటి వాళ్లు రుద్రాక్ష వేసుకోవడం వల్ల అలాంటి చెడు శక్తి ఏది వున్నా వాటి నుంచి కాపాడబడుతారు. రుద్రాక్ష ఒక రక్షణ కవచంగా ఎప్పుడూ మనతో వుంటుంది.
నీళ్లు ఆరోగ్యంగా వున్నాయా లేదా కలుషితంగా వున్నాయా అనే విషయాలను రుద్రాక్షతో తెలుసుకోవచ్చు. విషపు నీళ్లల్లో రుద్రాక్ష వేసినప్పుడు ఆ రుద్రాక్ష అపసవ్యంగా తిరుగుతూ వుంటుంది. రుద్రాక్ష మీ రక్తపోటును తగ్గిస్తుంది, మీకు విశ్రాంతిని ఇస్తుంది. గుండెపోటు సమస్యలను రుద్రాక్షను వేసుకోమని వైద్యులు స్వయంగా సలహాలిస్తున్నారు.
మనం దేనికైనా అనుగ్రహ పాత్రులమయినప్పుడు మన జీవితం సాఫీగా కష్టాలు ఎక్కువ లేకుండా సాగిపోతుంది. రుద్రాక్ష మనకు ఆ అవకాశాన్ని కలిగిస్తుంది. రుద్రక్షలో కచ్ఛితంగా కొంత శక్తి వున్నందువల్ల ప్రకృతి, పండితులు మనకు అందించిన ఈ రుద్రక్షలను మనము ఉపయోగించుకోవాలి. ఇలా చేయడం వల్ల మన జీవితంలో వున్న సమస్యలను కొంత వరకు తగ్గించుకోవచ్చు. రుద్రాక్షను కేవలం ఒక లాకెట్ గా మాాత్రమే చూసిన వాళ్లకు దీని ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా వ్యర్థమే అవుతుంది. ఎందరో మేధావులు, యోగులు, శాస్త్రవేత్తలు రుద్రాక్ష గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. వైద్యులు దీనిలో వున్న ప్లాసిబో ఎఫెక్ట్‌ను చూస్తున్నారు కానీ దీనిలో అనంతమైన శక్తి దాగి వుందనేది కాదననేలి సత్యం.



Click it and Unblock the Notifications
