Latest Updates
-
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.!
Jagannath Rath Yatra 2023: జగన్నాథుని విగ్రహం అసంపూర్తిగా ఉండటం వెనక రహస్యమేంటి?
పూరీ జగన్నాత రథ యాత్ర.. ఈ ఆధ్యాత్మిక వేడుక చాలా అట్టహాసంగా, గొప్పగా జరుగుతుంది. మొత్తం 9 రోజుల పాటు ఉండే ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకను చూసేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. జగన్నాథుడు అన్న బలరాముడు, సోదరి సుభద్రలతో కలిసి గర్భ గుడి నుండి బయటకు వచ్చి వీధుల్లో ఊరేగింపుగా వెళ్తాడు. ఒడిశాలోని పూరీ పట్టణంలో ఈ రథయాత్ర జరుగుతుంది. అలా దీని పూరీ జగన్నాథ రథయాత్రగా పిలుస్తారు. శుక్ల పక్షంలోని రెండో రోజు జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుంది.
ఈ సంవత్సరం జూన్ 20వ తేదీన పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పూరీ జగన్నాథుడి గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.

చేతులు, కాళ్లు లేని విగ్రహాలు:
పూరీ జగన్నాథు విగ్రహం, అన్న బలరాముడు, సోదరి సుభద్రలా విగ్రహాలు గమనించినట్లైతే.. వాటికి చేతులు, కాళ్లు ఉండవు. దాని వెనక కారణం మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. అసలు ఈ విషయం కూడా చాలా మంది గమనించిన ఉండరు. దాని వెనక అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
రాజు ఇంద్రద్యుమ్నుడికి ఓ రోజు కలలో దేవుడు కనిపించి తన గుడి నిర్మించాలని చెబుతాడు. పూరీలోని బంకముహన సమీపంలో ఓ ప్రత్యేకమైన చెక్క దుంగ ఉంటుందని దాంతో తన విగ్రహం తయారు చేయించి ప్రతిష్టించాలని ఆ రాజును ఆదేశిస్తాడు భగవంతుడు. తర్వాత ఆ రాజు బంకముహన వెళ్లగా అక్కడ నిజంగానే ఓ ప్రత్యేకమైన చెక్క ఉంటుంది. దైవ కార్యం తన జరుగుతుందని సంతోషించిన రాజు ఇంద్రద్యుమ్నుడు.. శిల్పులను పిలిపించి ఆ చెక్కతో దేవతా మూర్తుల ప్రతిమలను తయారు చేయాలని చెబుతాడు. కానీ వాళ్లెవరూ ఆ చెక్కతో ప్రతిమను తయారు చేయలేకపోతారు.
వారి ఇనుప పని ముట్లు విరిగిపోతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన శిల్పులను పిలిపించినా ఫలితం ఉండదు. విగ్రహాలను తయారు చేయించడం ఎలా అని మదన పడుతున్న రాజుకు.. విశ్వకర్మ గురించి కొందరు చెబుతారు. ఆ రాజు ఇంద్రద్యుమ్నుడు విశ్వకర్మ వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పి ఆ చెక్కతో దేవతా మూర్తుల ప్రతిమలను తయారు చేయాలని వేడుకుంటాడు. దానికి సరేనన్న విశ్వకర్మ.. ఆ రాజుకు ఒక షరతు పెడతాడు.
ఆ చెక్కతో జగన్నాథుని ప్రతిమను చెక్కే సమయంలో తనకు, తన పనికి ఎవరూ భంగం కలిగించకూడదని షరతు పెడతాడు. విగ్రహం పూర్తయ్యే వరకూ ఎవరూ దానిని చూడకూడదని అంటాడు. విశ్వ కర్మ షరతుకు ఒప్పుకున్న రాజు.. విశ్వకర్మకు ఓ పెద్ద గది కేటాయిస్తాడు. అందులోకి ఎవరూ వెళ్లకుండా చూసుకుంటాడు. విశ్వకర్మ లోపల పని చేస్తుంటే బయటకు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలా రెండు వారాలు గడిచిన తర్వాత ఒక రోజు ఉన్నట్టుండి లోపలి నుంచి శబ్దాలు రావడం ఆగిపోతుంది. విశ్వకర్మకు బాగానే ఉన్నాడా, ఏం జరగలేదు కదా అని సందేహిస్తూ, ఆందోళన పడుతూ ఉంటాడు రాజు.
కానీ లోపలికి వెళ్లే సాహసం మాత్రం చేయడు. అయితే విశ్వకర్మ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని రాజు భార్య గుండిచా చెబుతుంది. దీనికి రాజు అయిష్టంగా ఆ గది తలుపు తెరిచి లోపలికి వెళ్తాడు. అప్పుడు అక్కడ విశ్వకర్మ విగ్రహం దాదాపు పూర్తయిపోయి కనిపిస్తుంది. చేతులు మాత్రం ఇంకా పూర్తవ్వలేదు. ఆ పని చేస్తుండగానే రాజు లోపలికి రావడంతో విశ్వకర్మ తన పనిని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతాడు.
పూర్తి కాని విగ్రహాలను ఎలా ప్రతిష్టించాలని రాజు ఇంద్రద్యుమ్నుడు మదన పడుతుంటాడు. ఓ రోజు రాజు కలలో కనిపించిన భగవంతుడు.. అసంపూర్తిగా ఉన్న ఆ విగ్రహాలనే ప్రతిష్టించాలని చెప్పడంతో వాటినే ప్రతిష్టించి గుడిని ప్రారంభిస్తాడు రాజు.



Click it and Unblock the Notifications