Latest Updates
-
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్‌రూట్‌ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.?
క్యారెట్, కీరదోసకాయతో పాటు సలాడ్‌లో ఎక్కువగా తీసుకునేది బీట్‌రూట్. రక్తహీనత సమస్య ఉన్నవారికి బీట్‌రూట్ మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఈ సూపర్‌ఫుడ్‌ను కూరలా వండుకోవడం కంటే సలాడ్‌లలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే బీట్‌రూట్‌ను పచ్చిగా తినడం, రసం చేసుకోవడం లేదా ఆవిరి మీద ఉడికించడం.. ఇలా వేటితో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..

బీట్‌రూట్‌లో ఫైబర్, ఫోలేట్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పోటాషియం, ఫాస్ఫరస్, మాంగనీస్ వంటి మినరల్స్, విటమిన్ సి, ఏ మేళవింపుతో శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. అందుకే ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే చాలా మంది వీటిని సలాడ్ రూపంలో అంటే పచ్చిగా తినడం, రసం చేసుకుని తాగడం, ఇంకా ఆవిరి మీద ఉడికించి తింటూ ఉంటారు. అయితే బీట్‌రూట్ పూర్తి ప్రయోజనాలను అందాలంటే బీట్‌రూట్‌ను ఎలా తీసుకోవాలో డైటీషియన్ నిపుణులు చెబుతున్నారు.
బీట్‌రూట్‌ను వండుకొని తినడం కంటే పచ్చిగా తినడం వల్ల అధిక పోషక విలువలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్, కీరదోస వంటి వాటితో కలిపి సలాడ్‌లో చేర్చుకుని సాయంత్రం సమయంలో తినవచ్చు. అయితే బీట్‌రూట్‌ను నమిలి తినేటప్పుడు జాగ్తత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దుంప భూమిలోపల పెరుగుతుంది. అందువల్ల ఇందులో మట్టి రేణువులు, బ్యాక్టీరియా ఉంటుంది. తద్వారా ఇన్‌ఫెక్షన్‌కి దారితీయవచ్చు. అందుకే తినే ముందు బాగా రుద్ది కడిగి, పీలింగ్ చేసి తినడం ఉత్తమం.
అయితే కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యలు ఉన్నవారు పచ్చిబీట్‌రూట్‌ను తినడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కడుపు నొప్పి రావచ్చు. వీటిలో ఆక్సలేట్ అధికంగా ఉండటం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరింత ప్రమాదం కలుగుతుంది. వైద్యుల సలహా మేరకు బీట్‌రూట్‌ను ఆహారంలో చేర్చుకోవాలి.
బీట్‌రూట్‌ను పచ్చిగా తినడం ఇష్టం లేని వారు రసం చేసుకుని తాగుతుంటారు. అయితే ముక్కల్లో రసంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మీ శరీర అవసరాలను బట్టి రసం లేదా సలాడ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీ బాడీకి నైట్రేట్లు అవసరమైతే, బీట్‌రూట్ రసం మేలు చేస్తుంది. అంతేకాకుండా రసంలో నీటి శాతం ఎక్కువగా ఉన్నందున తక్షణ శక్తి కోసం జ్యూస్ మేలు.
బీట్‌రూట్‌లను ఆవిరి మీద ఉడికించడం అంటే నీటి అవసరం ఉండదు. దీనిద్వారా ఎక్కువగా ఉండికించే పని లేకుండా నీరు లేకుండా ఇడ్లీల మాదిరిగా ఆవిరిపైన ఉడికించవచ్చు. ఇలా ఉడికించడం ద్వారా పోషకాలు నశించే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

ఆవిరి ద్వారా ఉడికించడం వల్ల మరో ప్రయోజనం ఉంటుంది. హానికరమైన బ్యాక్టీరియా, పురుగు మందులు, ఇతర హానిచేసే పదార్థాలను నశింపజేస్తుంది. అందుకే క్యారెట్, బీట్‌రూట్ వంటి దుంపలను కూరలా వండుకోవడం కంటే ఆవిరి మీద ఉడికించడం వల్ల శరీరానికి ప్రయోజనాలు అుందుతాయి. పచ్చి బీట్‌రూట్‌ను తినడం ఇష్టం లేని వారు, జ్యూస్ చేసుకునే తీరిక లేని వారు ఇలా ఆవిరి మీద ఉడికించడం ద్వారా అరుగుదల ప్రక్రియ సమయంలో జీర్ణక్రియపై ఎలాంటి ఒత్తిడి చూపించదు. మీ ఆహారంలో సౌకర్యవంతంగా, రుచికరంగా దీనిని ఆస్వాదించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బీట్‌రూట్‌ను రెగ్యులర్‌గా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తహీనత సమస్యను నివారించి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
