Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
అరేంజ్‌డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.!
పెద్దలు కుదిర్చిన వివాహం అంటే కేవలం రెండు కుటుంబాలు కలవడం మాత్రమే కాదు.. అది ఇద్దరు తెలియని వ్యక్తుల మధ్య కొత్త బంధానికి నాంది పలకడం. ఇక, పెళ్లికి ముందు జరిగే నిశ్చితార్థం అంటే సగం వివాహం అయిపోయినట్లే. ఈ క్రమంలో ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్లికి ముందు ఉండే కాలాన్ని "కోర్ట్‌షిప్ పీరియడ్" అంటారు. ఈ సమయాన్ని వారు కలిసి తిరగడానికి కాదు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఇష్టాయిష్టాలు పంచుకోవడానికి ఇది సరైన సమయం.

పెళ్లికి ముందే మీకు కాబోయే భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. ప్రేమ పెళ్లి, అరేంజ్‌డ్ మ్యారేజ్ ఏదయినా.. కాబోయే భాగస్వామిలో కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే మీ బంగారు జీవితంలో ఎన్నో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా పార్ట్‌నర్ వ్యక్తిత్వానికి సంబంధించి ఏడు హెచ్చరిక సంకేతాలపైన అప్రమత్తంగా ఉండాలి.
ఇరు కుటుంబాల మధ్య పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత కాబోయే వధూవరుల మధ్య ఫోన్ కాల్స్, తరచూ కలవడం, బయటకు వెళ్లడం ఇవన్నీ ఈ రోజుల్లో సాధారణం. అయితే ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత మీ పార్ట్‌నర్ తరచూ పెళ్లి తేదీని వాయిదా వేయడానికి సాకులు వెతకడం లేదా, మాటల్లో మీపై అయిష్టం కనిపించినా.. దీనిని పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటి సందర్భాల్లో వారితో ఒంటరిగా మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోండి. విషయాన్ని పక్కదారి మళ్లిస్తున్నట్లయితే సదరు వ్యక్తితో పెళ్లి జీవితం పట్ల అప్రమత్తంగా ఉండండి.
కొందరు ఇతరుల ముందు మీరంటే ఇష్టమున్నట్లుగా నటిస్తూ మీతో చనువుగా ఉంటారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి భావోద్వేగ బంధాన్ని ప్రదర్శించరు. సోషల్ మీడియాలో మీపై చూపే ప్రేమను నమ్మకండి. వ్యక్తిగతంగా మీపై ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నారో గమనించడం. అదే వారి నిజమైన ప్రవర్తనను ప్రదర్శిస్తుంది. దీనిని మీ భవిష్యత్తుకు హెచ్చరికగా భావించాలి.

రిలేషన్‌షిప్‌లో ఇద్దరికీ ఎంతోకొంత వ్యక్తిగత స్వేచ్ఛ తప్పనిసరిగా ఉంటుంది. అయితే గోప్యతకు, రహస్యానికి తేడా ఉంటుంది. ఈ క్రమంలో మీ భాగస్వామి ఫ్రెండ్స్, రోజులో చేసిన పనులు, సామాజిక జీవితం గురించి ఎప్పుడూ దాచిపెడుతున్నట్లయితే వాటిపై ఓ కన్నేయాలి. ఫోన్ విషయంలోనూ సీక్రెట్స్ ఉన్నట్లయితే అప్రమత్తంగా ఉండాలి. బంధంలో నమ్మకం ఉండాలి. కానీ ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు.
కొందరు పెద్దల ఇష్టం మేరకు, లేదా వారి ఒత్తిడి మేరకు వారి ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటారు. వారు కుదిర్చిన సంబంధం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే మనసులో మాత్రం వేరే వ్యక్తితో ప్రేమలో ఉంటారు. దీంతో కాబోయే భాగస్వామితో అంటీ ముట్టనట్లుగా ఉంటారు. ఇది ఇద్దరి జీవితాలను మంచిది కాదు. ఒత్తిడి వల్ల తీసుకునే ఏ నిర్ణయాలు ఒక బంధాన్ని పదిలంగా ఉంచవు.
వివాహ బంధంలో నిజాలు, అబద్ధాలు అనేవి ఆ బంధానికి పునాదిగా నిలుస్తాయి. కాబోయే భాగస్వామి వద్ద పదేపదే అబద్ధాలు చెప్పినా.. విషయాలను దాచిపెట్టినా, తప్పు చేస్తూ దొరికినప్పుడు సాకులు చెప్పి తప్పించుకునేందుకు యత్నిస్తే అది చాలా ప్రమాదకరం. ఇలాంటి విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు.
పెళ్లి తర్వాత కొత్త జీవితం ఆరంభించేటప్పుడు ఎక్కడ నివసించాలి, కెరీర్ ప్రణాళికలు, ఆర్థిక బాధ్యతలపై ఒక అవగాహన ఉండాలి. వీటి విషయంలో మీకు కాబోయే భాగస్వామి వద్ద స్పష్టమైన సమాధానం లేకపోయినా, నిర్లక్ష్యం వహించినా ఆ వ్యక్తికి బంధంపై సీరియస్‌గా లేరని అర్థం. కేవలం శృంగారంపైనే దృష్టి సారిస్తూ ఇతర విషయాలను నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యక్తితో జీవితం దుర్భరంగా ఉంటుంది.

మీకు సంబంధించి పుట్టినరోజు, పండుగల వంటి ప్రత్యేక రోజుల్లో మీతో ప్రత్యక్షంగా సంభాషించకుండా, విషెస్ చెప్పకుండా.. కేవలం పబ్లిక్ మెప్పు కోసం సోషల్ మీడియాలో ఫొటోల ద్వారా ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే ఆ బంధంలో సంతోషం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా రీల్స్ ఆధారంగా కాకుండా, మీకు కాబోయే భాగస్వామి వ్యక్తిత్వం, ప్రవర్తన ఆధారంగా భాగస్వామి ఎంపిక చేసుకోవాలని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
