Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి?
డిజిటల్ ప్రపంచంలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో, ఏది వైరల్ గా మారుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని ట్రెండ్స్ నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆల్పైన్ డివోర్స్ అనే ట్రెండ్ మాత్రం మహిళల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

ఆల్పైన్ డివోర్స్ అంటే ఏమిటి?
ఇది చట్టపరంగా కోర్టుకు వెళ్లి తీసుకునే విడాకులు కాదు. ఇదొక ఆన్ లైన్ స్లాంగ్ (యాస) పదం. దీని అర్థం ఏంటంటే.. భాగస్వామిని ఏదైనా దట్టమైన అడవిలో, మారుమూల పర్వత ప్రాంతాల్లో లేదా ప్రమాదకరమైన ట్రెక్కింగ్ మార్గాల్లోకి తీసుకెళ్లి, అక్కడ వారిని ఒంటరిగా వదిలేసి రావడం. అక్కడి నుండి వారు ప్రాణాలతో, సురక్షితంగా తిరిగి రావడం దాదాపు అసాధ్యం.
ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే నిజం
ఇది వినగానే మీ మదిలో మెదిలే మొదటి ప్రశ్న.. మనుషులు ఇంత క్రూరంగా ఎలా ఉంటారు? ఎవరైనా ఇలా చేస్తారా? అని. కానీ నమ్మశక్యం కాని నిజం ఏమిటంటే.. ఇలాంటి ఘటనలు వాస్తవంగానే జరుగుతున్నాయి. కొంతమంది పురుషులు తమ భాగస్వాములను వదిలించుకోవడానికి ఈ కిరాతక మార్గాన్ని ఎంచుకుంటున్న కేసులు వెలుగులోకి రావడంతో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది.
ఆల్పైన్ అంటేనే స్విట్జర్లాండ్, స్కాట్లాండ్ లాంటి అత్యంత ఎత్తైన, గడ్డకట్టే చలి ఉండే పర్వతాలు. సరైన సన్నాహాలు లేకుండా అక్కడ ఒంటరిగా బతకడం అసాధ్యం.
130 ఏళ్ల నాటి కథ నుంచి..
ప్రస్తుతం టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ వంటి ప్లాట్ ఫామ్‌లలో ఈ పదం ట్రెండింగ్ లో ఉన్నప్పటికీ, దీనికి దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది 1893లో రాబర్ట్ బార్ అనే రచయిత రాసిన యాన్ ఆల్పైన్ డివోర్స్ అనే చిన్న కథ నుంచి పుట్టింది. ఆ కథలో భార్యను వదిలించుకోవాలనుకున్న ఒక భర్త.. ఆమెను స్విస్ ఆల్ప్స్ పర్వతాలకు తీసుకెళ్లి చంపి, దాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించాలని కుట్ర పన్నుతాడు.
దీని వెనుక ఉన్న మనస్తత్వం ఏంటి?
ఈ ట్రెండ్ నేటి సమాజంలో సంబంధాలలో పెరుగుతున్న అపనమ్మకానికి, విషపూరితమైన మనస్తత్వాలకు అద్దం పడుతోందని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు దీనిని ఒక వ్యంగ్య హాస్యంలాగా తీసుకుంటున్నప్పటికీ, ఇది మహిళల భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన హెచ్చరిక.
ట్రెక్కింగ్ కు వెళ్లేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సమాచారం ఇవ్వండి: మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అనే పూర్తి వివరాలను మీ కుటుంబ సభ్యులకు లేదా నమ్మకమైన స్నేహితులకు తప్పకుండా తెలియజేయండి.
మ్యాప్స్ వెంట ఉంచుకోండి: టెక్నాలజీపైనే పూర్తిగా ఆధారపడకుండా, ఆ ప్రాంతానికి సంబంధించిన ఆఫ్ లైన్ లేదా పేపర్ మ్యాప్స్ మీ దగ్గర ఉంచుకోవడం ముఖ్యం.
సేఫ్టీ కిట్ తప్పనిసరి: ఫస్ట్ ఎయిడ్ కిట్, తగినంత ఆహారం, నీరు, టార్చ్ లైట్, విజిల్ వంటి భద్రతా పరికరాలను ఎప్పుడూ మీ సొంత బ్యాగ్ లోనే ఉంచుకోండి.



Click it and Unblock the Notifications
