Latest Updates
-
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం
శ్రీకృష్ణ జన్మాష్టమి 2025..ఈ మంత్రాలతో మీ కోరికలు నెరవేర్చుకోండి!
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుల్లో శ్రీకృప్ణజన్మాష్టమి ఒకటి. విష్ణువు 8 అవతారాలలో ఒకరైన శ్రీకృష్ణుడు భాద్రపద మాసం కృష్ణ పక్ష అష్టమి తిథిలో జన్మించాడు. కృష్ణుడు పుట్టిన రోజుని శ్రీకృష్ణ జన్మాష్టమి పేరుతో పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు భక్తులు. ఈ ఏడాది ఆగస్టు 16 అంటే శనివారం రోజున జన్మాష్టమి జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించడం ద్వారా భక్తులు శుభ ఫలితాలను పొందుతారు. దీంతో పాటు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని అద్భుత మంత్రాలను కూడా జపించవచ్చు. ఈ మంత్రాలను జపించడం వల్ల జీవితంలో లేదా కుటుంబంలోని అతిపెద్ద సంక్షోభం తొలగిపోతుంది,శ్రీ కృష్ణుడి దయతో మీరు ఆధ్యాత్మిక శాంతిని కూడా పొందుతారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఈ మంత్రాలను జపించండి
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ్ హరే రామ్ రామ్ రామ్ హరే హరే.
ఓం దేవకీనందనాయ్ విధంహే వాసుదేవయ్ ధీమహి తన్నో కృష్ణ: ప్రచోదయాత్.
ఓం శ్రీ కృష్ణ: శరణం మమః.
ఓం నమో భగవతే శ్రీ గోవిందాయ.
ఓం కృష్ణాయ్ వాసుదేవయ్ హరయే పరమాత్మనే.. ప్రణతః క్లేశనాశాయ గోవిన్దాయ నమో నమః
ఓం కృష్ణాయ నమః
ఓం నమో భగవతే తస్మై కృష్ణాయ కుంఠమేధసే.
ఓం క్లీం కృష్ణాయ నమః
ఓం శ్రీ కృష్ణ: శరణం మమః

మంత్రాలను పఠించడం ప్రాముఖ్యత
శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ఈ మంత్రాలను జపించడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది. ఈ మంత్రాలను జపించడం ఆధ్యాత్మిక అభివృద్ధికి, మానసిక ఆరోగ్యం, దైవిక జ్ఞానాన్ని పొందడానికి కూడా చాలా ప్రభావవంతంగా పరిగణించబడతాయి. ఒత్తిడి,ఆందోళన నుండి ఉపశమనం పొందడానికి మీరు ఈ మంత్రాలను కూడా జపించవచ్చు. మంత్రాలలో ఒకదాన్ని కృష్ణ జన్మాష్టమి రోజున కనీసం 108 సార్లు జపించాలి. అప్పుడే మీరు దాని శుభ ప్రభావాన్ని చూడగలరు. మంత్రాలను జపించడానికి మీరు ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఇంట్లో ఏకాంతంగా ఉండకపోతే ఆలయానికి వెళ్లి కూడా ఈ మంత్రాలను జపించవచ్చు.
జన్మాష్టమికి సంబంధించిన ముఖ్యమైన సమయాలు
అష్టమి తిథి ప్రారంభం: ఆగస్టు 15, 2025 రాత్రి 11:49 గంటలకు
అష్టమి తిథి ముగింపు: ఆగస్టు 16, 2025 రాత్రి 9:34 గంటలకు
నిశిత పూజ సమయం (కృష్ణుడు పుట్టిన సమయం): ఆగస్టు 16, 2025 అర్థరాత్రి 12:04 గంటల నుండి 12:47 దాకా ఉంటుంది.



Click it and Unblock the Notifications
