Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
ఈ వస్తువులు ఇంటి గుమ్మం వద్ద ఉంటే మీరు సంపన్నులవుతారని మీకు తెలుసా..
మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఒక గాజు పరికరంలో లేదా బంకమట్టి కుండలో పూలు లేదా పూల రేకులను ఉంచడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.
మన దేశంలో సంపద, సౌకర్యం, ఆనందం కోసం ప్రతి ఒక్కరూ నిత్యం అనేక కష్టాలు పడుతుంటారు. కానీ వారు చేసే కొన్ని తప్పుల వల్ల వారి సంతోషకరమైన క్షణాలను పొందలేకపోతున్నారు. అలాగే అనేక ఆర్థిక పరమైన సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తప్పులలో వాస్తు నిర్మాణం కూడా చాలా ముఖ్యం. మీ సొంత ఇల్లు మరియు మీ జీవితానికి సంబంధించి వాస్తు శాస్త్రం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వాస్తు శాస్త్రం వల్ల నిజంగా మరియు ఆచరణాత్మకంగా చాలా మందికి సానుకూల శక్తి వచ్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.

ముందుగా మీరు నిర్మించుకునే ఇంటి నిర్మాణం బాగుంటే, ఆ ఇంట్లోని మనుషుల మనసులు తేలికగా ఉంటాయి. దీని వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహం సైతం కలుగుతుంది. దీని వల్ల మీ ఇంటికి మంచి అదృష్టం వస్తుందని వాస్తు శిల్పులు చెబుతుంటారు. ఈ సందర్భంగా వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ద్వారం వద్ద కొన్ని వస్తువులను ఉంచడం ద్వారా మీ ఇంటిలోని కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని సుసంపన్నం చేస్తుంది. అలాగే మీకు సంపదను ప్రోత్సహిస్తుంది. ఇంతకీ ఆ వస్తువులు ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే ఈ స్టోరీని పూర్తిగా చూడండి.. మీరు అపార సంపదను సంపాదించి, అద్భుతమైన జీవనాన్ని కొనసాగించండి..

1) పూల కుండ మరియు నీరు...
మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఒక గాజు పరికరంలో లేదా బంకమట్టి కుండలో పూలు లేదా పూల రేకులను ఉంచడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా మంచిది. ఈ నీటి కుండ వల్ల మీ ఇంటికి సంపద మరియు సౌభాగ్యం లభిస్తుంది. అలాగే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అంతేకాక లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా మీ ఇంటికి ప్రతికూల శక్తులను బాగా తగ్గిస్తుంది. వీటితో పాటు మీ ఇంట్లోని కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.

2) ప్రతికూల ప్రకంపనలు...
మీ ఇంటిపై చెడు కంటి చూపు పడకుండా మీరు కొన్ని సంప్రదాయ పద్ధతులను పాటించాలి. చాలా మంది హిందువులు పండుగ సందర్భాలలో చేసే పనే ఇది. దీని వల్ల మీ ఇంటికి ఎంత పాజిటివ్ శక్తి వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. మామిడి, బూడిద ఆకు లేదా అశోక ఆకుల నుండి తయారు చేసినటువంటి మాల లేదా దండను ఇంటి తలుపుకు ఉంచడం వల్ల అది ప్రతికూల ప్రకంపనలను గ్రహిస్తుంది. మీ వ్యతిరేక శక్తి ఇంట్లోకి రాకుండా చేస్తుంది. అంతేకాదు చెడు కంటి చూపు నుండి మీ ఇంటిని కాపాడుతుంది. ముఖ్యంగా ఇంట్లో కీటకాలు చొరబడకుండా శాస్త్రీయంగా నిరోధిస్తుంది. ఆకు ఎండిన తర్వాత మీరు కొత్త వాటిని తిరిగి పెట్టొచ్చు.

3) లక్ష్మీదేవి విగ్రహం..
లక్ష్మీదేవి విగ్రహాన్ని మీ ఇంటి గుమ్మం లేదా ప్రవేశ ద్వారం మీద ఉంచే సంప్రదాయాన్ని హిందువులు చాలా కాలంగా కొనసాగించారు. ఇంతకుముందు రంగులను ఉపయోగించి పెయింట్ చేసేవారు. కానీ ఇప్పుడు రేడియమ్ స్టిక్కర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ రేడియం స్టిక్కర్లను వాడరాదని కొందరు గురువులు చెబుతున్నారు. అయితే లక్ష్మీదేవి చిత్రపటం ఇంటి ప్రవేశద్వారం దగ్గర ఉంచడం వల్ల ఇంటి సంపద పెరుగుతుంది. అలాగే, లక్ష్మీ దేవత దృష్టిలో పడుతుంది. మరియు ఇది గ్రహ కదలిక యొక్క ప్రతికూలతలను కూడా తగ్గిస్తుంది.

4) స్వస్తిక్ ఇంటి తలుపు వద్ద..
హిందువులకు స్వస్తిక్ గుర్తు అంటే చాలా ఇష్టం. ఈ గుర్తును మీ ఇంటి తలుపు వద్ద పెట్టడం ఇంటికి మంచిది. ఇది ఇంటికి అదృష్టం మరియు శ్రేయస్సు తెస్తుంది. స్వస్తిక్ చిహ్నం వ్యాధులు మరియు కష్టాలను కూడా తగ్గిస్తుంది మరియు ఆనందాన్ని పెంచుతుంది. ఇంటి ప్రవేశద్వారం దగ్గర స్వస్తిక్ గుర్తును ఉంచి అసలైన అనారోగ్యాలను వదిలించుకోండి.

5) పెద్ద ప్రవేశ ద్వారం..
మీ ఇంటికి సంబంధించి పెద్ద ప్రవేశ ద్వారం ఉంటే, ఇది మంచి సంకేతం. తలుపులు మూసివేస్తే ఇంటికి వచ్చే ప్రతికూలతలను కూడా ఇది తొలగిస్తుంది. ఇంటి తలుపు కింది నుండి పైకి లేస్తే, అది ఇంటిని ప్రకాశవంతం చేయడానికి కూడా సహాయపడుతుంది. పై చిత్రంలో చూపిన మాదిరిగా మీ తలుపులకు వెంటిలేషన్ మాదిరిగా సెట్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
ఈ వాస్తు శాస్త్రం వివరాలు మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులతో, మీ ప్రియమైన వారితో షేర్ చేసుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య, సౌందర్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం తెలుగు బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, కామెంట్స్ విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications











