Latest Updates
-
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు
బలి చక్రవర్తి రావాలి కేరళను కాపాడాలి, పాతాళం నుంచి పైకి రా.. చక్రవర్తి, ఓనం పండుగ నేపథ్యం తెలుసా?
బలి చక్రవర్తి జయించిన తర్వాత రాక్షసుల్లో భయం మొదలైంది. తమ బలిని ఈ దేవతల్లో ఎవరైనా చంపేస్తారేమో అనుకున్నారు. అందుకే అందరూ బలిని దేవలోకం వదిలెయ్యమని ప్రాథేయపడ్డారు. ఇక ప్రహ్లాదుడు బలి వీరిలో ఈ భయమంతా..
కేరళలో ఏటా ఈ సమయంలో ఓనం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేవి. కానీ ఈ సారి మాత్రం అక్కడ వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో కేరళవాసులు ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే ఓనం వేడుకల్ని ఈ సారి రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
గత వందేళ్లలో ఇలాంటి ప్రళయాన్ని కేరళ ఎప్పుడూ చూడలేదు. ఓనం పండుగ కోసం కేటాయించిన డబ్బును కూడా అక్కడి ప్రభుత్వం సహాయ నిధికి మళ్లించింది. ఈ ఉత్సవాలను ప్రతి సంవత్సరం కేరళ ప్రభుత్వం కన్నుల పండువగా నిర్వహించేది. వరదలు రాకుండా ఉండి ఉంటే ప్రస్తుతం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కేరళ జనం ఆనందంగా గడిపేవారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని
పాపం వరదల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అల్లాడిపోతున్నారు. ఇక కొందరు ఈ వరదలకు కారణం ప్రకృతిని నాశనం చెయ్యడమే అని అంటుంటే.. మరికొందరు దేవునికి వ్యతిరేకంగా కేరళలో తీర్పులు రావడమే అని అంటున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే కేరళ ఎంతో సంప్రదాయంగా నిర్వహించుకునే ఓనం పండుగ నేపథ్యం తెలుసుకుందాం

కేరళను పరిపాలించాడు
ప్రహ్లాదుడికి నలుగురు కుమారులు. వారిలో ఒకరు విరోచనుడు. విరోచనుడి కుమారుడే బలి. బలి చక్రవర్తి ఇప్పుడున్న కేరళను రాజ్యంగా చేసుకుని పరిపాలించాడు. బలి ఒక్కసారి మాట ఇచ్చాడంటే దాన్ని ప్రాణం పోయినా కూడా తప్పేవాడు కాదు. ధర్మాన్ని పాటించేవాడు. న్యాయానికి కట్టుబడి ఉండేవాడు. దీంతో బలి చక్రవర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తన రాజ్య ప్రజలకు ఒక్క కష్టం రాకుండా చూసుకునేవాడు.

దేవతలు అడ్డుకుంటున్నారు
అలాంటి బలి చక్రవర్తి దగ్గరకు ఒక రోజు కొందరు రాక్షసులు వచ్చారు. తాము చేసే ప్రతి కార్యాన్ని దేవతలు అడ్డుకుంటున్నారని బలికి చెబుతారు. బలి దేవలోకంపై దండెత్తుతాడు. ఇంద్రనగరాన్ని జయించి ఇంద్రుడిని ఓడించాలనుకుంటాడు. కానీ ఇంద్రుడు పారిపోతాడు. బలిని గెలవాలంటే తన తరం కాదని ఇంద్రుడికి తెలుసు. ఇంద్రుడి గురువు బృహస్పతి కూడా అదే విషయం చెబుతాడు.

ముల్లోకాలకు బలి.. చక్రవర్తి అయ్యాడు
ఇంద్రుడు పారిపోవడంతో ముల్లోకాలకు బలి.. చక్రవర్తి అయ్యాడు. అందరినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. భూలోకం నుంచి ఒక అతను దేవతలపై పెత్తనం చెలాయించడం దేవతల్లో ఎవ్వరికీ నచ్చలేదు. అయితే బృహస్పతి ఇంద్రుడికి ఒక సూచన ఇస్తాడు. నువ్వు విష్ణువును కలిస్తే నువ్వు ఆయన చేసే సాయం ద్వారా మాత్రమే ఇంద్రలోకంలో ఉండగలుగుతావు అంటాడు.

తమ బలిని చంపేస్తారేమోనని భయం
బలి చక్రవర్తి జయించిన తర్వాత రాక్షసుల్లో భయం మొదలైంది. తమ బలిని ఈ దేవతల్లో ఎవరైనా చంపేస్తారేమో అనుకున్నారు. అందుకే అందరూ బలిని దేవలోకం వదిలెయ్యమని ప్రాథేయపడ్డారు. ఇక ప్రహ్లాదుడు బలి వీరిలో ఈ భయమంతా ఆ విష్ణువు వల్లే అని అన్నాడు. విష్ణువా.. ఎవరు అతను దేవలోకాన్నే జయించాం.. అతనేం చేస్తాడు మనల్ని అంటూ విర్రవీగాడు బలి.

వామన రూపంలో బలి దగ్గరకు వెళ్తాడు
ప్రహ్లాదుడు.. నువ్వు కచ్చితంగా ఆ విష్ణుమూర్తి వల్లే నష్టపోతావని శపిస్తాడు. తర్వాత బ్రహ్మ ఆదేశంతో విష్ణువు వామన రూపంలో బలి దగ్గరకు వెళ్తాడు. నాకు కాస్త సాయం చేయగలవా అని దీనంగా కోరుతాడు. కోరుకో తప్పకుండా ఇస్తా అన్నాడు. రాక్షసులంతా అతను విష్ణువు అని సందేహపడ్డారు. వద్దు బలి ప్రభూ అంటూ వేడుకున్నారు. కానీ తాను ఒక్కసారి దానం విషయంలో మాటిస్తే ప్రాణాలు పోయినా మాట తప్పనని బలి అంటాడు.

ఓస్... అంతేనా తీసుకో
వామనుడు తనకు మూడు అడుగుల నేల కావాలని కోరుతాడు. దీంతో బలి, ఓస్... అంతేనా తీసుకో అంటాడు. వామనుడు ఒక్కసారిగా భారీగా మారిపోతాడు. తన ఒక్కసారి పాదం మోపగానే అది భూమి మొత్తం సరిపోతుంది. రెండో సారి మోపితే ఆకాశం అంతా సరిపోతుంది. మూడో సారి పాదం మోపడానికి అసలు స్థలమే లేకుండా పోతుంది. అప్పుడు బలి తన తలపై ఉన్న స్థలానికి తీసుకో అంటాడు. విష్ణు తన పాదంతో బలిని చంపే ప్రయత్నం చేయగా ప్రహ్లాదుడు విష్ణువుకు బలి గురించి చెబుతాడు.

బలి చక్రవర్తి దయ వల్ల కేరళ మళ్లీ కోలుకోవాలి
బలి చక్రవర్తి ఎంతో భక్తి, న్యాయం, దాన గుణాలు కలవాడు అతన్ని చంపకండి అంటూ ప్రార్థిస్తాడు. దీంతో విష్ణు మూర్తి బలిని పాతాళంలోకి తొక్కుతాడు. అలా పాతాళంలో బందీగా ఉన్నటువంటి బలి ప్రతి ఏటా ఓనం పండుగలప్పుడు తన రాజ్యం అయిన కేరళను సందర్శించి వెళ్తాడని ప్రతీతి. అందుకే ఓనం పండుగను కేరళవాసులంతా ఘనంగా చేసుకుంటారు. కేరళను బలి పాలించినట్లు పురాణాల్లో ఉంది. కానీ ఈ సారి వరదల్లో కేరళ మొత్తం మునిగిపోయింది. ఆ బలి చక్రవర్తి దయ వల్ల కేరళ మళ్లీ కోలుకోవాలని కోరుకుందాం. తమ రాజ్య ప్రజల కష్టాలు బలికి కనిపించి వారిని గట్టెక్కించాలని కోరుకుందాం.



Click it and Unblock the Notifications