Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
అలా అయితేనే పెళ్లి చేసుకోండి.. రిలేషన్‌షిప్‌పై అమ్మాయిలకి సమంత పవర్‌ఫుల్ అడ్వైజ్.!
ఓ వ్యక్తితో బంధం గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయం సరైనదేనా.. సరైన వ్యక్తినే ఎంచుకున్నామా.. రిలేషన్‌షిప్‌లో ఏవైనా అనుకోని పరిస్థితులు తలెత్తితే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి.. మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో వారి సపోర్ట్ ఎలా ఉంటుంది.. ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ క్రమంలో ప్రస్తుత కాలంలో యువతకి, సింగిల్స్‌కి నటి సమంత కీలక సలహాలు ఇచ్చారు.

మీ లైఫ్ సంపూర్ణంగా, సంతోషంగా ఉండాలంటే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తిపైనే అది ఆధారపడి ఉంటుందని సమంత అంటున్నారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత రాజ్ నిడమూరుతో రెండో వివాహం, మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సినీ కెరీర్‌ను మళ్లీ ఆరంభించిన సమంత రుతుప్రభు 'మా ఇంటి బంగారం’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. అంతేకాకుండా రాజ్‌తో వివాహ జీవితంలో మరికొన్ని నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది సమంత. అటు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా డబుల్ హ్యాపీనెస్‌తో ఉన్న సమంత.. సక్సెస్ మీట్‌లో రిలేషన్‌షిప్‌పై పలు ఆసక్తికర వ్యాఖఅయలు చేశారు.
రిలేషన్‌షిప్స్ విషయంలో ఈ కాలం యువతకి, ముఖ్యంగా అమ్మాయిలకి మీరిచ్చే మోటివేషన్ ఏంటని విలేకరి అడగ్గా.. సమంత చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరు చేసుకోబోయే వ్యక్తి మిమ్మల్ని ప్రతి విషయంలోనూ మీకు మద్దతుగా నిలిచి మీ జీవితాన్ని సంపూర్ణం చేస్తానరని . ఎప్పుడూ అనుకోవద్దని సమంత అన్నారు. ముందు అమ్మాయిలు తమ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నచ్చిన రంగాల్లో సంపూర్ణంగా విజయం సాధించిన తర్వాతే భాగస్వామిని వెతుక్కోవాలని సలహా ఇచ్చారు. అప్పుడే వివాహ బంధం విజయవంతమవుతుందని సలహా ఇచ్చారు.
ఏ అమ్మాయికైనా కెరీర్ అనేది వారి వారి చేతుల్లోనే ఉంటుంది కానీ.. రిలేషన్‌షిప్ అనేది ఇద్దరిపైనా ఆధారపడి ఉంటుందని సమంత అన్నారు. ప్రస్తుత జనరేషన్‌లో అమ్మాయిలు పార్ట్‌నర్‌ను ఎంచుకునే విషయంలో తడబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వృత్తిపరంగా ఏం జరిగినా దానికి రెస్పాన్సిబిలిటీ మీదేనని.. కానీ రిలేషన్‌షిప్ కొన్నిసార్లు సంక్లిష్టంగా మారుతుందని చెప్పారు. అందుకే ముందుగా అమ్మాయిలు ఆర్థికంగా మరొకరిపై ఆధారపడే పరిస్థితి రాకుండా తమ కాళ్లపై తాము నిలబడటం ముఖ్యమని సూచించారు. తర్వాతే జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని సూచించారు. ప్రతిదానికీ భాగస్వామిపై ఆధారపడకూడదని.. యువతులకు వారిపై వారికి కాన్ఫిడెన్స్ చాలా అవసరమని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గత కొన్నేళ్లుగా సమంత వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, ఒడుదొడుకుల నేపథ్యంలో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు యువతను ఆలోచింపజేస్తున్నాయి. చైతూ విడాకుల తర్వాత మయోసైటిస్ బారిన పడటం, తర్వాత వరుసగా సినిమాలు విఫలం కావడం, అనంతరం డైరెక్టర్ రాజ్ నిడమూరుతో వివాహమయ్యాక.. ఇప్పుడు సినీ రంగంపై దృష్టి సారించారు.
ముఖ్యంగా అమ్మాయిలు పార్ట్‌నర్ ఎంపిక విషయంలో తప్పులు చేయకూడదని చెప్పడం.. నేటి డేటింగ్, రిలేషన్‌షిప్, సిట్యుయేషన్‌షిప్ అంటూ పూటకొకటి సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్న కల్చర్‌కి అట్రాక్ట్ అవుతున్న యువతని ఆలోచింపజేస్తుంది. ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు తమకంటూ కెరీర్‌ను, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఏర్పరుచుకున్నాకే వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. భర్తపై ఆధారపడటం తగ్గిస్తున్నారు. ఇప్పుడు సమంత వ్యాఖ్యలు వారి నిర్ణయానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.



Click it and Unblock the Notifications
