Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
వర్షాకాలంలో అదరగొట్టే ప్రకృతి అందాలు.. టూర్ ప్లాన్ చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. జలపాతాలు పొంగేందుకు, ప్రకృతి పచ్చని చీర చుట్టుకుని మనకు చల్లదనాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ సమయంలో వాటి అందాలు వీక్షించేందుకు రెండు కళ్లూ సరిపోవు. వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్, లాంగ్ టూర్స్‌కి ఇది అనువైన సమయం. అయితే ఈ కాలంలో లాంగ్ టూర్స్ ప్లాన్ చేసుకునేవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

వర్షాకాలం ప్రయాణానికి అనువుగా ఉన్నా అందులో కొంత ప్రమాదం పొంచి ఉందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కీలక జాగ్రత్తలు తీసుకోవాలి. పర్వతాలు, జలపాతాలు, పచ్చని ప్రకృతిని వీక్షించేందుకు టూర్ లవర్స్ క్యూ కడుతుంటారు. అయితే వాతావరణంలో ఆకస్మిక మార్పులు, రోడ్లపై నీరు నిలవడం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు మన ఆరోగ్యానికి సవాలు విసురుతుంది. అందుకే ఈ కాలంలో టూర్‌కి వెళ్లేవారు సరైన సన్నద్ధతతో ఉండాలి. ముఖ్యంగా జర్నీలో పిల్లలు, వృద్ధులు, ముందు నుంచి అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
మాన్‌సూన్‌లో మీరు లాంగ్ టూర్‌కి ప్లాన్ చేసుకున్న రూట్ మ్యాప్‌లో ఒక్కసారి వాతావరణ సూచనను తనిఖీ చేసుకోవాలి. భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటం, రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఆ ప్రాంతాలకు దూరంగా ఉండాలి. మీ లగేజ్‌లో ఎప్పుడూ అవసరమైన మందులు, రెయిన్‌కోట్, గొడుగు, వాటర్‌ప్రూఫ్ బ్యాగ్, అదనంగా దుస్తులు పెట్టుకోవాలి.

వర్షాకాలంలో బయటి ఆహారం కంటే ఇంట్లోనే వండిన శుభ్రమైన తాజా ఆహారం తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో స్ట్రీట్ ఫుడ్‌లో బ్యాక్టీరియా, శుభ్రత లేమి కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. బయట ఎక్కడ పడితే అక్కడ నీరు తాగకుండా.. సురక్షితమైన, ప్యాక్ చేసిన నీటిని మాత్రమే వెంట తీసుకెళ్లాలి. ప్రయాణంలో జారే చెప్పులు ధరించకూడదు. దీని వల్ల ఇబ్బంది పడతారు. సౌకర్యవంతంగా, జారకుండా ఉండే బూట్లను ధరించాలి.
బయటకు వెళ్లినప్పుడు మొబైల్ ఫోన్ ఎక్కువగా తడిసే ప్రమాదం ఉంటుంది. అందుకని వీటి కోసం ప్రత్యేకంగా కవర్ కేటాయించుకోవాలి. పవర్ బ్యాంక్, ముఖ్యమైన పత్రాలను కారులో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఎదురయ్యే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడూ ఫోన్ ఆన్‌లో ఉండేలా చూసుకోవాలి. ఇక పిల్లలు, వృద్ధులతో ప్రయాణిస్తున్న వారు వారికి సంబంధించిన వస్తువులను, అవసరాలను తప్పనిసరిగా బ్యాగ్‌లో ఉంచుకోవాలి.
ఈ కాలంలో ఎక్కువ సమయం ప్రయాణించడం వల్ల కడుపు ఇన్‌ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్, జలుబు, వైరల్ జ్వరాలు, స్కిన్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జర్నీలో నీరు ఎక్కువగా తాగని కారణంగా డీహైడ్రేషన్ పెరగవచ్చు. వర్షపు నీరు, ధూళి కారణంగా అలర్జీలు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. ఇంకా ఎక్కువసేపు తడి బట్టలు, బూట్లు ధరించి ఉంటారు. దీంతో చర్మ సమస్యలు మరింతగా ఎక్కువయ్యే అవకాశం ఉంది. జర్నీలో ఉన్నప్పుడు జ్వరం, విరేచనాలు, వాంతులు, నీరసం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎదురైనట్లయితే వెంటనే సమీప వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

వర్షాకాలంలో విహారయాత్రలు జాలీగా, ఆరోగ్యకరంగా సాగేందుకు మంచి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. తరచుగా చేతులు కడుక్కోవాలి. డీహైడ్రేషన్‌కి గురి కాకుండా పుష్కలంగా నీరు తాగాలి. ఎల్లప్పుడూ తాజా, శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మీ శక్తికి మంచి జర్నీలు చేయకండి. వాతావరణానికి అనుగుణంగా బట్టలు ధరించండి. తడిసిన బట్టలతో ఎక్కువసేపు ఉండకండి. అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇలాంటి సాధారణ జాగ్రత్తలతో టూర్లు సురక్షితంగా, సౌకర్యవంతంగా, ఆనందంగా సాగుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
