Latest Updates
-
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Sankranti 2025: సంక్రాంతిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?
మకర సంక్రాంతి సంవత్సరంలో మొట్ట మొదటిగా జరుపుకునే అత్యంత సాంప్రదాయకమైన పండగ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో జరుపుకునే కొన్ని పండుగల్లో ఇది కూడా ఒకటి. ఈ మకర సంక్రాంతి వేడుకలను దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాల్లో జరుపుకుంటారు. మకర సంక్రాంతి హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ రోజు బెల్లం అన్నం వండి పాలు పొంగించుకొని పూజలు చేస్తారు.
ఈ రోజున సాధారణంగా పొంగల్, కిచడీ, ఏలు బెల్ల వంటి అనేక తీపి వంటలు చేసుకొని తింటారు. ఉత్తర భారతదేశంలో, గాలిపటాలు ఎగురవేయడానికి ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. దక్షిణాదిలో, ఎద్దుల-పోటీలు మరియు గాలిపటాలు ఎగరేయడం వంటి అనేక రకాల సంప్రదాయాలు ఉన్నాయి. ఈ సంక్రాంతిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. కాబట్టి ప్రతి రాష్ట్రంలో సంక్రాంతిని ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ
ఆంధ్రా, తెలంగాణాలోని అనేక ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు వివిధ రకాలుగా జరుగుతాయి. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులు పండగను జరుపుకుంటారు. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసి పాత వస్తువులు, చెత్తను పక్కన పెట్టి నిప్పంటిస్తారు. సంక్రాంతి రోజున బెల్లం అన్నం వండి పాలను పొంగిస్తారు. కనుమ రోజు ఇంటికి వచ్చిన అతిథులకు మాంసాహారంతో విందు భోజనం ఏర్పాటు చేస్తారు.
తమిళనాడు
సంక్రాంతిని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. ఇది తమిళనాడులో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను వరుసగా 4 రోజులు జరుపుకుంటారు. ఈ పండుగనాడు రైతులు తమ పొలాలను పూజిస్తారు. ఎద్దులను అలంకరిస్తారు. అలాగే వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు.
కేరళ
కేరళలో సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగ. మకర విళక్కు అని కూడా ఆ రాష్ట్రంలో అంటారు. ఈ రోజు శబరిమలలో మకరజ్యోతి దర్శనమిస్తుంది. దీంతో అయ్యప్ప క్షేత్రం భక్తులతో నిండిపోతుంది. అదేవిధంగా ఈ రోజున కేరళలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు.
గుజరాత్
ఈ పండుగను గుజరాత్‌లో గురత్‌లో ఉత్తరాయణంగా జరుపుకుంటారు. ఇక్కడ గాలిపటాలు ఎగరేయడం పురాతన సంప్రదాయం. పండుగ రోజున చేసే ప్రత్యేక స్వీట్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో కిచడీ చేసి ఆ రోజున ఎంజాయ్ చేసే సంప్రదాయం ఉంది. మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్‌తో సహా అనేక రాష్ట్రాల్లో ఈ పండగను ప్రత్యేకంగా జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications











