Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
Mercury Transit :మహాశివరాత్రి రోజున బుధుడి సంచారంతో.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు...!
మహా శివరాత్రి రోజున బుధుడి సంచారంతో రాశిచక్రాలపై ఏ ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మరి కొన్నిరోజుల్లో మహా శివరాత్రి పండుగ దేశవ్యాప్తంగా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే శ్రీశైలం, కోటప్పకొండతో సహా ఇతర ప్రాంతాల్లో శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి.

శివునికి అంకితం చేయబడిన ఈ పండుగ రోజున, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశం చేయనున్నాడు. నవగ్రహాలలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని తెలివికి, వ్యాపారం, విజ్ణానశాస్త్రం వంటి వాటికి కారణమని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతుంటారు.

ఈ సమయంలో బుధుడు తన స్థానం మారడం వల్ల 12 రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబంలో అంతా మంచే జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి..
బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ రాశి వారికి చాలా రంగాల్లో విజయం దక్కుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీలో ధైర్యం మరియు శౌర్యం కూడా వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి అద్భుతంగా ఉంటుంది.

మిధున రాశి..
కుంభరాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి చాలా విషయాల్లో లక్కీ వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు ప్రయాణించొచ్చు. మీ రోజు వారీ పనులు కూడా పెరుగుతాయి. భవిష్యత్తులో మీ రచనల వల్ల ప్రయోజనం పొందుతారు.

కర్కాటక రాశి..
బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ఆరోగ్య పరంగా ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాతావరణ మార్పులతో మీకు కొన్ని పెద్ద వ్యాధులు రావొచ్చు. భూమి, ఆస్తి సంబంధిత విషయాల్లో సమస్యలు ఉండొచ్చు. మీరు ఆర్థిక అడ్డంకులను నివారించాలి.

సింహ రాశి..
ఈ రాశి వారు వైవాహిక జీవితంలో ఆనందం పొందుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన సమస్యల నుండి పెద్ద ఉపశమనం లభిస్తుంది. మీరు వ్యాపారం చేస్తుంటే.. మీకు అనేక విషయాల్లో విజయం లభిస్తుంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి బుధుడి సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మీకు దీర్ఘ కాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు జాగ్రత్తగా పనులు చేసుకోవడం మంచిది.

తుల రాశి..
ఈ రాశి వారికి జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు దక్కుతాయి. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. ప్రేమకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు వివాహానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది.

వృశ్చికరాశి..
బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు తల్లి ఆశీర్వాదం అందుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి లాభం వస్తుంది. మీరు స్నేహితులు మరియు బంధువుల నుండి సహకారాన్ని కూడా ఆశించవచ్చు. కానీ యాత్రల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి..
బుధుడు కుంభరాశిలోకి సంచారం చేసే సమయంలో మీ శక్తి పెరుగుతుంది. మీకు స్నేహితులు మరియు తోబుట్టువులు సహాయం చేస్తారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే, అందులో పూర్తిగా విజయం సాధిస్తారు. మీరు మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మీరు దాన ధర్మాలు కూడా చేయొచ్చు.

మకర రాశి..
బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారికి ఆర్థిక మంచి పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు నైపుణ్యతను పెంచుకుంటారు. మీరు ప్రతికూలతలను సులభంగా అధిగమిస్తారు. మీ కుటుంబంలో శాంతి, ఆనందం ఉండొచ్చు.

కుంభ రాశి..
బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ రాశి వారికి పిల్లల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ వంటి శుభవార్తలు వింటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో పని చేసే వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

మీన రాశి..
బుధుడు కుంభరాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మీరు ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అదే విధంగా మీరు కోర్టు కేసులను లేదా ఏదైనా వివాదాల నుండి వీలైనంత రాజీ కుదుర్చుకుని సమస్యల నుండి బయటపడాలి.



Click it and Unblock the Notifications