For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రులు 2019 : తొమ్మిది రోజుల ప్రాముఖ్యత మరియు శుభ ముహుర్తం..

|

శరదృతువు కాలంలో ప్రారంభమయ్యే ఈ పండుగను శరణ్ నవరాత్రి అని కూడా అంటారు. హిందువుల అత్యంత పవిత్రమైన పండుగలలో దసరా నవరాత్రులు చాలా ముఖ్యమైనవి. ఈ నవరాత్రులు దుర్గాదేవికి అంకితం చేయబడింది. నవరాత్రి పండుగను చెడుపై విజయం సాధించే పండుగ అని కూడా అంటారు. దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగకు కొన్ని ప్రాంతాల్లో భిన్నమైన సంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరలో లేదా అక్టోబర్ ప్రారంభంలో వచ్చే ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మను విభిన్న రకాలుగా శక్తివంతంగా అలంకరించి పూజిస్తారు. అందుకు అనుగుణంగా శరణ్ నవరాత్రలు వేళ ప్రత్యేక అలంకరణలు మరియు దేవతకు నైవేద్యాలు ఇస్తారు. మహిషాసుర అనే రాక్షసుడిని వధించినందుకు ఈ పండుగ జరుపుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

Navarathri

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర భారతంలో, కలకత్తా, మైసూరు వంటి ప్రముఖ ప్రాంతాలతో పాటు చాలా చోట్ల నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం నుండే బెజవాడ కనకదుర్గమ్మను, శ్రీశైలంలో భ్రమరాంబిక దేవి, మల్లికార్జున స్వామి, తిరుపతిలో బ్రహ్మోత్సవాలు, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏయే ప్రాంతాల్లో నవరాత్రుల ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారో.. ఏ విధంగా జరుపుకోనున్నారో తెలుసుకుందాం.

సెప్టెంబర్ 29, తొలిరోజు..

సెప్టెంబర్ 29, తొలిరోజు..

ఆంధ్రాలో స్వర్ణ కవచాలంకృత కనకదుర్గా దేవిగా, శైలపుత్రి అవతారంలో ఇతర ప్రాంతాల్లో దర్శనమిచ్చారు. అమ్మవారిని తొలిరోజు మందార పూలతో పూజించారు. దుర్గాదేవి యొక్క ఈ అవతారం బ్రహ్మ, విష్ణు, మరియు మహేశ్వర యొక్క సామూహిక శక్తి యొక్క స్వరూపం. ప్రతాపత అని పిలువబడే ఈ మాత (అక్షరాలా ‘‘పర్వత కుమార్తె‘‘)తో సంబంధం కలిగి ఉన్నట్లు పురాణాలలో పేర్కొనబడింది. ఆదివారం కన్యలగ్నం ఉంటుంది. స్థాపన ముహుర్తం ఉదయం 6:18 నుండి రాత్రి 7:41 వరకు కొనసాగింది.

సెప్టెంబర్ 30, రెండోరోజు..

సెప్టెంబర్ 30, రెండోరోజు..

విజయవాడలో రెండో రోజైన సోమవారం కనకదుర్గమ్మ బాలా త్రిపుర దేవిగా దర్శనమిచ్చారు. ఇతర ప్రాంతాల్లో బ్రహ్మచారిణిగా అలంకరించి పూజలు చేశారు. రెండోరోజు పచ్చగా ఉండే చామంతి పూలతో పూజించారు. పసుపు రంగు ప్రశాంతత మరియు బలాన్ని ఇస్తుంది. ఈ దేవతను విముక్తి లేదా మోక్షం మరియు శాంతి మరియు శ్రేయస్సు కోసం పూజిస్తారు.‘‘భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా‘‘ అనే మంత్రాన్ని జపించారు.

అక్టోబర్ 1, మూడో రోజు..

అక్టోబర్ 1, మూడో రోజు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ప్రాంతంలోని అమ్మవారు మూడోరోజు అయిన మంగళవారం గాయత్రిదేవిగా దర్శనమివ్వనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో చంద్రఘంట రూపంలో దర్శనమివ్వనున్నారు. ఈ రూపంలో అమ్మవారి అందం యొక్క స్వరూపం చంద్రబింబం వలె ఆమె నుదిటిని అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి తెల్లటి పూలతో పూజిస్తారు. ‘‘గాయత్రి వ్యాహృతి సంధ్యా నిజబృంద నిషేవితా‘‘ అనే మంత్రాన్ని జపిస్తారు. గాయత్రి దేవి అనుగ్రహంతో జీవితంలో అన్నపానాలను ఎటువంటి ఢోకా ఉండదని భక్తుల నమ్మకం.

అక్టోబర్ 2, నాలుగోరోజు..

అక్టోబర్ 2, నాలుగోరోజు..

నాలుగోరోజైన బుధవారం అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఇతర చోట్ల కుష్మాండ అవతారంలో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. నాలుగోరోజు కూడా అమ్మవారికి తెల్లటి పూలతో పూజ చేస్తారు. ‘‘పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరీ‘‘ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి ధనం, బంగారం, వస్తు, వాహన ప్రాప్తిస్తుందని భక్తులు నమ్ముతారు.

అక్టోబర్ 3, ఐదోరోజు

అక్టోబర్ 3, ఐదోరోజు

ఐదో రోజు అయిన గురువారం నాడు లలితా త్రిపుర సుందరదేవీగా అమ్మవారు కనిపిస్తారు. ఇతర చోట్ల స్కందమాతగా అలంకరించబడతారు. లలితా సహస్ర నామాన్ని పఠిస్తారు. ‘‘శ్రీ శివశతైక్యరూపిణి లలితాంబిక‘‘ అనే మంత్రాన్ని జపిస్తారు. చామంతి పూలతో పూజిస్తారు.ఈ దేవిని పూజిస్తే ఈ ఏడాదంతా అఖండ ఐశ్వర్యం, భోగభాగ్యాలు, ఆరోగ్యప్రాప్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

అక్టోబర్ 4, ఆరోరోజు..

అక్టోబర్ 4, ఆరోరోజు..

ఆరో రోజు అయిన శుక్రవారం నాడు అమ్మవారు మహాలక్ష్మీ రూపంలో దర్శనమిస్తారు. మిగిలిన చోట్ల కాత్యాయణి రూపంలో అలంకరించబడి ఉంటుంది. మహాలక్ష్మీ దేవిని మల్లి, జాజి, గులాబీ పూలతో పూజిస్తారు. ‘‘మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ, మృడప్రియ‘‘ అనే మంత్రా జపిస్తారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల అమ్మవారం అనుగ్రహం నిత్యం మనకు ఉంటుందని అందరూ నమ్ముతారు.

అక్టోబర్ 5, ఏడో రోజు..

అక్టోబర్ 5, ఏడో రోజు..

ఏడో రోజు అయిన శనివారం నాడు అమ్మవారు మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు. ఇతర ప్రాంతాల్లో కలదేవతగా అలంకరించి పూజిస్తారు. ఈ మాతకు కూడా తెల్లటి పూజలతో పూజ చేయాలి. తెలుపు రంగు పదార్థాలతోనే నైవేద్యం సమర్పించాలి. ఏడో రోజు పూజా ముహుర్తం మధ్యాహ్నం 3:49 నుండి సాయంత్రం 6:11 గంటల వరకు ఉంటుంది.

అక్టోబర్ 6, ఎనిమిదో రోజు..

అక్టోబర్ 6, ఎనిమిదో రోజు..

ఎనిమిదో రోజు అయిన ఆదివారం అంటే అష్టమి. ఈరోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనిమిస్తారో మాత్రం చాలా మందికి బాగా గుర్తుంటుంది. బెజవాడలో దుర్గాష్టమి రోజున అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఇతర చోట్ల మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని ఎర్రటి పూలతో పూజిస్తారు. ‘‘దుర్లభా దుర్గమా దుర్గా దుఖహంత్రీ సుఖప్రదా యై నమ:‘‘ అనే మంత్రాన్ని జపించాలి. దీని వల్ల నరఘోష, అంతశత్రు బాధల నుండి సులభంగా బయటపడొచ్చని భక్తులందరూ నమ్ముతారు.

అక్టోబర్ 7, తొమ్మిది రోజు.

అక్టోబర్ 7, తొమ్మిది రోజు.

తొమ్మిదో రోజుకు ఈ ఏడాది ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ ఏడాది 9 రోజులలో చివరి సోమవారంతో కలిపితే రెండు సోమవారాలు వచ్చాయి. సోమవారం అమ్మవారికి ఇష్టమైన రోజు తొమ్మిదో రోజున మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. మిగతా చోట్ల సిద్ధిదాత్రిగా పూజలందకుంటారు. ఎర్రటి పూలతో పూజిస్తారు. ‘‘అపర్ణా చండికా చండముండాసుర నిఘాధిని‘‘ అనే మంత్రాన్ని జపిస్తూ గంటను గట్టిగా మోగిస్తారు. దీని వల్ల ఇంట్లో ఏవైనా దుష్టశక్తులుంటే అవన్నీ పారిపోతాయి. భూత, ప్రేత, పిశాచాల బాధల నుండి బయటపడతారని పురాణాల్లో పేర్కొంది. అంతేకాదు ఈరోజు ఆయుధాలకు పూజ కూడా చేస్తారు.

అక్టోబర్ 8, పదో రోజు..

అక్టోబర్ 8, పదో రోజు..

పదో రోజు అయిన మంగళవారం నాడు అసలు పండుగ ప్రారంభమవుతుంది. అమ్మవారి విజయదశమి రోజు రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారు. ఆరోజునే దసరా అని కూడా అంటారు. అంత ప్రధానమైన రోజు అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. ‘‘రాజ రాజేశ్వరీ రాజ్యధాయని రాజ్యవల్లభయేనమో నమ:‘‘ అనే మంత్రాన్ని జపిస్తారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు అని భక్తుల నమ్మకం. ఇక అదేరోజు చాలా చోట్ల అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అందుకు శుభ సమయం ఉదయం 6:21 నుండి ఉదయం 8:42 గంటల వరకు పంచాంగంలో పేర్కొనబడింది.

English summary

Navarathri 2019: Dates, Significance And Shubha muhurtham

Navratri is one of the most significant and awaited Hindu festival. The zeal and excitement of the festival is evident all over India way before the actual festival starts. Navratri celebrations in India are grand and everyone wants to be a part of them.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more