Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఆ నిమ్మకాయల పవర్ అలాంటిది, లక్షలు పెట్టి ఆ స్వామి గుడిలో తీసుకుంటున్న భక్తులు
వేసవి ప్రారంభంలోనే మంచినీరు, శీతల పానీయాల ధరలు పెరిగాయి. నిమ్మకాయ ధర రూ 5 నుంచి రూ 6 రూపాయలు పలుకుతోంది. వేసవిలో నిమ్మకాయల ధరలు రూ.10 నుండి రూ. 15, ఒక్కోసారి రూ 20 రూపాయలు పలుకుతుంది. ఇక్కడ నిమ్మకాయల ధరల గురించి మాట్లాడటం లేదు. ఓ గుడిలో 9 నిమ్మకాయలు లక్షల రూపాయలకు కొనుగోలు చెయ్యడం ఇక్కడ అసలు టాపిక్.
ఓ ఆలయంలో పూజించిన నిమ్మ పండ్ల ధర గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మురుగన్ ఆలయంలో ఉన్నఈటెను అలంకరించే పవిత్రమైన నిమ్మకాయల ధర వింటే షాక్ అవుతారు. ఈ ఆలయానికి వందల ఏళ్ల నాటి చరిత్ర, సంప్రదాయాలు ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ పూజించే నిమ్మకాయలను వేలానికి పెడతారు. ఒక నిమ్మకాయను లక్షల రూపాయలకు వేలం వేస్తారు.

ఇటీవల నిర్వహించిన వేలంలో రూ. 2.36 లక్షలకు తొమ్మిది నిమ్మకాయలను భక్తులు దక్కించుకున్నారు. స్థానిక విశ్వాసాల ప్రకారం, ఈ పవిత్రమైన పండ్లతో తయారు చేసిన నిమ్మరసం తాగడం వలన వ్యాధులను నయం చేయడానికి, కుటుంబాలకు శ్రేయస్సును తీసుకురావడానికి కీలకమని పురాణాలు చెబుతున్నాయని భక్తులు అంటున్నారు. ఈ ప్రాంతంలోని మురుగన్ ఆలయం పవిత్రమైన నిమ్మకాయలకు ప్రసిద్ధి చెందింది. మురుగన్ విగ్రహం ముందు త్రిశూలానికి చెక్కిన నిమ్మకాయలకు అద్భుత శక్తులు వస్తాయని, అలాంటి శక్తులు నిమ్మకాయలకు ఉంటాయని భక్తులు, స్థానిక ప్రజలు బలంగా నమ్ముతారు.
వార్షిక పంగుని ఉతిరం పండుగ సందర్భంగా తిరువానైనల్లూర్ గ్రామంలోని రెండు కొండల సంగమం మధ్య ఉన్న ఈ మురుగన్ ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చి వెలుతుంటారు. ముఖ్యంగా సంతానం లేని దంపతులు తరలివస్తారు. ఇక్కడ పూజించే నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఉంది. వేలంలో ప్రజలు లక్షల్లో డబ్బు చెల్లించి నిమ్మకాయలను సొంతం చేసుకుంటారు. ఈ నిమ్మకాయలను దేవుని ఆశీర్వాదంగా తీసుకుంటామని భక్తులు అంటున్నారు.
దీనికి గల కారణాన్ని గ్రామస్థుడు వివరిస్తూ సంతానం లేని దంపతులు ఎక్కువగా నిమ్మకాయలను కొనుగోలు చేస్తారని, సంతానలేమిని నిమ్మకాయలు నయం చేస్తుందని, వ్యాపారులు తమ వ్యాపారాల్లో లాభాలు తెచ్చుకోవడానికి, కుటుంబం బాగుండాలని ఈ నిమ్మకాయలను కొనుగోలు చేస్తారని తెలిపారు. ప్రతిరోజు ఒక నిమ్మకాయను త్రిశూలం ఈటెపై గుచ్చుతారు. ఈ తొమ్మిది రోజుల సంప్రదాయానికి చివరి రోజున ఆ నిమ్మకాయలను వేలానికి ఉంచారు.
ఈ వేలం ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ పండుగలో మొదటి రోజున కుట్టిన నిమ్మకాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది చాలా పవిత్రమైనది, శక్తివంతమైనదని భక్తులు నమ్ముతారు. ఈ దీవించిన నిమ్మకాయలను వేలంలో దక్కించుకున్న భక్తులు దేవాలయం సమీపంలోనే స్నానం చేసి, ఆలయ పూజారి ముందు భక్తితో మోకరిల్లి వాటిని స్వీకరిస్తారు.
కులత్తూరు గ్రామానికి చెందిన దంపతులు ఒక్క నిమ్మకాయలను రూ.50, 500లకు దక్కించుకున్నారు. సంప్రదాయం, విశ్వాసంతో నిండిన ఈ పండుగ ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమంగా కొనసాగుతుంది. ఇది పురాతన సంప్రదాయాలు, నమ్మకాలను శాశ్వతంగా నిలబెట్టుతుందని భక్తులు, స్థానికులు అంటున్నారు. ఈ పండుగకు తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని గ్రామస్తులు అంటున్నారు.



Click it and Unblock the Notifications