Latest Updates
-
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
శ్రీరామ నామానికి అంతటి శక్తి ఎలా వచ్చింది..?
శ్రీరామనామానికి చాలా శక్తి ఉందని పురాణాలు చెబుతున్నాయ్. అందుకే కేవలం రామనామం రాయిపై రాస్తేనే అతి నీళ్లల్లో తేలియాడింది. హనుమంతుడికి కూడా రామనామం జపించగానే ఎక్కడలేని శక్తి వస్తుంది. రామనామం జపిస్తే పాపాపు పోతాయంటారు. ఇలా రామనామం మహత్యం వెనక ఉన్న రహస్యం ఏంటి. ఎందుకు శ్రీరామనామానికి అంత ప్రాముఖ్యత ఉంది. రామనామంలో ఆ అపార శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం.

రామనామం విష్ణుసహస్రనామం
విష్ణు సహస్రనామం చదవాలంటే చాలా సమయం పడుతుంది. శ్రీవిష్ణు దేవుడికి ఉన్న వెయ్యి నామాలను చదవాల్సి ఉంటుంది. అదే రామనామాన్ని మూడు సార్లు జపిస్తే విష్ణుసహస్రనామాన్ని జపించినంత పుణ్యం లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు. పురాణాల్లో కూడా "సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే" అని ఉంది. రామ రామ రామ అంటే సహస్రనామం చెప్పినంత విలువ.
రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము అని చదివితే సహస్రనామం చదివినట్టేనట్టు. రామ నామం జపించిన వాళ్లపై హనుమంతుడి పరవశించిపోయి వాళ్లని ఆశీర్వదిస్తాడని చెబుతున్నారు.
రామకోటి విలువ
రామకోటి రాస్తే కూడా చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయ్. పురాణాల్లో ఎన్నో కథల్లో రామనామం చేసిన వారికి అపారమైన శక్తి లభించినట్లుగా ఉంది. రామనామం వెనక ఎన్నో అద్భాతాలు ఉన్నాయ్. చిన్నవయసు నుంచే పిల్లలకు రామనామం జపించమని అలవాటు చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదని ప్రముఖు పండితులు చెబుతున్నారు.
ఏడు కోట్ల మహామంత్రాలు ఒక ఎత్తు, రామ అనే రెండక్షాలు ఒక ఎత్తు అని యజుర్వేదంలో ఉంది. ఈ రెండక్షరాలకు అంత శక్తి ఉందని శాస్త్రాలు అంటున్నాయ్.
రామనామం జపించిన వాల్మీకి
రామనామం వెనక మరో పురాణ కథ ఉంది. బ్రహ్మదేవుడు నారాయణుడి పేరులోని రెండో అక్షరాన్ని, నమ:శివాయ పేరులోని రెండో అక్షరాన్ని తీసుకొని కలిపి రామ నామాన్ని సరస్వతీ దేవికి చెప్పాడట. రామనామం చాలా మహమాన్వితమైనది, రామనామం జపించిన వారికి అంతా శుభమే జరుగుతుందని సరస్వతీ దేవికి చెబుతుండగా అక్కడే ఉన్న నారదుడు విని భూలోకానికి చేరుకున్నాడు. అడవిలో నారదుడు వెళ్తుండగా దారిలో ఓ బోయవాడు కనబడ్డాడు. హింసా ప్రవృత్తితో బ్రతుకుతున్న బోయవాడి పాపాలు పోవాలంటే రామనామం జపించమని నారదుడు బోయవాడితో అంటాడు. ఆ బోయవాడు అలా ఎన్నో ఏళ్లు రామనామం జపించి జపించి ఆ బోయవాడి చుట్టూ పుట్టపేరుకుపోతుంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆ బోయవాడికి వాల్మీకి అని నామకరణం చేసి రామాయణాన్ని రచించమని చెబుతాడు. రామనామం శక్తి వెనక రామాయణ రచన కూడా ఉందని మనకు అర్థమవుతుంది.



Click it and Unblock the Notifications
