Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Ramayana: రావణుడికి 10 తలలు ఎందుకుంటాయి? దాని వెనక రహస్యం ఏంటంటే..
రామాయణంలో రావణుడికి 10 తలలు ఉంటాయని తెలిసిందే. అసలు రావణ బ్రహ్మగా పిలిచే రావణాసురుడికి ఈ 10 తలలు ఎలా వచ్చాయి. ఇలా 10 తలలు పొందడం వెనక రావణుడి ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రావణుడికి 10 తలలు ఉండటంపై వివిధ రామాయణ గాథల్లో రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణుడు బలశాలి, తపశ్శాలి. సనకసనందనాది రుషుల శాప ప్రభావంతో వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులే త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా జన్మించారని అంటారు.

విచిత్ర రామాయణం ప్రకారం..:
విశ్వవసు ఒక రోజు దాంపత్య సుఖాన్ని అనుభవించాలన్న కోరికతో తన భార్య కైకసి వద్దకు వెళ్తాడు. అప్పటికే ఆమె 11 సార్లు రుతుమతి అయినట్లు విశ్వవసు తెలుసుకుంటాడు. ఆమె ద్వారా 11 మంది పుత్రులను పొందాలని విశ్వవసు భావిస్తాడు. అయితే కైకసి మాత్రం తనకు ఇద్దరు పుత్రులే కావాలని విశ్వవసుకు చెబుతుంది. తపోనిధి అయిన విశ్వవసు తన మాట వృథా కాకుండా ఉండటానికి.. 10 తలలు ఉన్న రావణుడినీ, పదకొండో వాడిగా కుంభకర్ణుడినీ ఇచ్చాడని విచిత్ర రామాయణం కథ.
10 తలలు, 20 చేతులున్న నిన్ను మానవునిగా వచ్చి సంహరిస్తా:
విష్ణుమూర్తి నరసింహ అవతారంలో ఉద్భవించి హిరణ్యకశిపుడిని చంపాడు. అయితే తనను సంహరించే సమయంలో.. 'అకస్మాత్తుగా పుట్టి, ఇరవై గోళ్లతో నన్ను ఒక్కణ్ని చంపడం కూడా ఓ పౌరుషమేనా' అని ఆక్షేపించాడట హిరణ్యకశిపుడు. అప్పుడు శ్రీహరి 'తర్వాత జన్మలో నీకు 10 తలలు, 20 చేతులు ప్రసాదించి, మానవుడిగా అవతరించి సంహరిస్తాను' అని విష్ణుమూర్తి అన్నాడని మరో కథ ప్రచారంలో ఉంది.
వాల్మీకి రామాయణంలో ఇవేవీ లేవు:
వాల్మీకి రామాయణంలో వీటి ప్రస్తావన లేదు. రావణుడికి కామరూప విద్యతో 10 తలలు ఏర్పడ్డాయని కొందరు చెబుతారు. రావణాసురుడు కోరుకున్నప్పుడు 10 తలలు, 20 చేతులు వస్తాయి. అలాగే 5 కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు.. మొత్తం 10 ఇంద్రియాలు ఉంటాయి. వీటిని అదుపులో పెట్టుకోవడం ఆధ్యాత్మిక సాధనకు బలాన్ని ఇస్తుంది. 10 ఇంద్రియాలకు లొంగిపోయినవాడే దశకంఠుడు అని పెద్దలు అంటారు.
పురాణాల ప్రకారం రావణుడి 10 తలలు వేటిని సూచిస్తాయి:
* కామం
* క్రోదం
* దురాశ
* మోహం
* మదం
* అసూయ
* అహంకారం
* చిత్త శుద్ధి
* హృదయం
* బుద్ధి



Click it and Unblock the Notifications
