Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఆ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే.. ఏ కోరిక అయినా నెరవేరుతుందంట.. ఆలయం ఎక్కడుందంటే!
కొన్ని దేవాలయాలకు వెళ్లి ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు తీరిపోతాయి. కొన్ని దేవాలయాలకు వెళ్లి కొన్ని పరిహారాలు చెల్లిస్తే అనుకున్న పని పూర్తవుతుంది అని మనం వింటూ ఉంటాము. అలానే మీసాల దేవుడిగా పేరున్న చిలుకూరు బాలాజీ ఆలయానికి కూడా పేరుంది. అయితే అలాంటి ఆలయమే తెలంగాణలో మరొకటి ఉంది.
అదే రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం. ఈ దేవాలయం ఎక్కడుంది?, ఈ ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తే ఫలితం దక్కుతుంది, అనే తదితర ఆసక్తికర విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ దేవాలయం ఎక్కడుందంటే!
ఈ రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం తెలంగాణలోని పఠాన్‌చెరు మండలం, రుద్రారం గ్రామంలో ఉంది. స్వయంభుగా వెలిసిన ఈ ఆలయానికి చాలా మహిమాన్వితమైనదిగా పేరుంది. ఈ ఆలయం దక్షిణముఖంగా ఉంటుంది. ఈ ఆలయంలో విగ్నేశ్వరుడు స్వయంభుగా వెలిశారు. కర్ణాటక సరిహద్దుల్లోని పురాతనమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలోని గణేశుడు సంకటహర చతుర్థి నాడు ప్రత్యేకంగా పూజలు అందుకుంటారు.

ఆలయానికి ఎలా వెళ్ళాలి?:
ఈ ఆలయానికి హైదరాబాద్ నుంచి సులువుగా వెళ్లొచ్చు. హైదరాబాద్ నగరం నుంచి ఈ ఆలయం కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి అనేక మార్గాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. బస్సులు లేదా ఆటోలు, ఇతర మార్గాల ద్వారా కూడా ఈ ఆలయానికి చేరుకొని మహిమాన్వితుడైన విఘ్నేశ్వరుడిని పూజించొచ్చు.
కోరికలు తీరాలంటే ఏం చేయాలి..
కోరికలు తీరాలంటే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే ఆ కోరికలు తీరుతాయని చెబుతున్నారు. పైగా ఈ ఆలయం దక్షిణ ముఖంగా ఉన్నందున కోరుకున్న వెంటనే కోరికలు తీరిపోతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. అయితే ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు తమ మనసులో కోరికలు చెప్పుకుంటూ 11 ప్రదక్షిణలు చేయాలి.
ఈ 11 ప్రదక్షిణలు పూర్తయ్యాక 41 రోజుల్లో కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. ఈ అయితే కోరికలు నెరవేరాక మళ్ళీ తప్పనిసరిగా ఈ ఆలయానికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేయాలని అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ ఆలయం విశిష్టతలు..
ఈ రుద్రారం గణేష్ ఆలయాన్ని 200 ఏళ్ల క్రితం కర్ణాటకకు చెందిన శివరామభట్టు అనే వ్యక్తి.. కాలినడకన తిరుమలకు వెళ్తుండగా.. రుద్రారం అడవుల్లో ఆగి సింధూరంతో ఉన్న గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించారు. అనంతరం ఆ విగ్రహాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు. కొన్నేళ్ల తరువాత రుద్రారం అడవుల గుండా ముఖందాస్ అనే భక్తుడు వెళ్తుండగా.. గణనాథుడి విగ్రహం ఉన్న ప్రదేశానికి వచ్చేసరికి గుర్రం కదల్లేకపోయింది.
దీంతో అతను అక్కడే పడుకోగా.. గణనాథుడు రాత్రి కలలోకి వచ్చి తనకు గుడి కట్టాలని కోరాడట. దీంతో ముఖందాస్ గుడి కట్టడంతో ఈ ఆలయం నిర్మితమైనదని చెప్పుకుంటారు. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు సింధూరంలో దర్శనమిస్తాడు. స్వామి వారి విగ్రహం కింద మకర తోరణం ఉంటుంది. అలాగే ఓ చిన్న గణనాథుడి విగ్రహం కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో పైన పేర్కొనబడిన అంశాలు పలువురు నిపుణులు, వివిధ శాస్త్రాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. అవి కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు.



Click it and Unblock the Notifications
