Latest Updates
-
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.!
గడపకు పసుపు-కుంకుమ అలంకరిచడంలో గల సైంటిఫిక్ రీజన్స్..
ఏ గృహానికైనా గడపలు తప్పనిసరిగా ఉండాల్సిందే... పల్లెటూల్లలోనే కాదు పట్టనాల్లో కూడా నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గమనించినట్లైతే ఇంటి సింహద్వారానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారాలుండవు. గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది అని అంటుంటారు.
గడపకు పసుపు.. గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇళ్లు కళకళలాడుతుంది. ఆయురారోగ్యం అందించే గడప పండుగ రోజులు, ఇతర విశేష దినాల్లో గడపకు పసుపు రాయడం మన సంప్రదాయం. ఈ ఆచారాన్ని మొక్కుబడి వ్యవహారంగా అందరూ పాటిస్తుంటారు. కానీ, ఇలా ఎందుకు పసుపు రాస్తారో, దీని వెనుక ఉన్న ప్రయోజనాలు ఏమిటో చాలా మందికి తెలీదు. పురాణ గ్రంధాల్లో ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి...

గడపకు పసుపు కుంకుమలు పెట్టడానికి గ్రంధాలు ఏం చెబుుతున్నాయి
గడపకు ( Threshold) పసుపు రాస్తే సూక్ష్మ క్రిములు నశిస్తాయనే సంగతి అందరికీ తెలుసు. తెలీని విషయం ఏమిటంటే గడపకు పసుపు రాస్తే మంచి వరుడు వస్తాడని. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినందువల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని మన ధార్మిక గ్రంధాలు చాటుతున్నాయి.

గడపకు పసుపు కుంకుమలు పెట్టడానికి గ్రంధాలు ఏం చెబుుతున్నాయి
గడపను గౌరీ దేవితోనూ ,మహాలక్ష్మీ తోనూ పోలుస్తాం మనం.అందుకే ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు ,క్రిములు ప్రవేశించకుండా గడపకు పసుపు రాసి బొట్టుపెట్టి క్రమం తప్పకుండా పూజ చేస్తాం.

గడపకు పసుపు కుంకుమలు పెట్టడానికి గ్రంధాలు ఏం చెబుుతున్నాయి
గడప చాలా ప్రాధాన్యత కలిగినది. ఇంట్లో ఆయా గదులకు గడపలు లేకున్నా సరేకానీ తప్పనిసరిగా గృహంలో సింహద్వారానికి గడప ఖచ్చితంగా ఉండాలి. గడపను పసుపు, కుంకుమలతో, బియ్యంపిండితో అలంకరించుకుంటేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పెద్దల నమ్మకం. పసుపులో యాంటీబయటిక్ గుణం ఉంది. మనం వీధులల్లో వెళ్తున్నపుడు ఎన్నో లక్షల బ్యాక్టీరియాలను మన చెప్పులకు, మన కాళ్లకు అంటించుకుని ఇంట్లోకి వస్తుంటాము.

గడపకు పసుపు కుంకుమలు పెట్టడానికి గ్రంధాలు ఏం చెబుుతున్నాయి
ఉదయాన్నే పసుపు నీళ్లతో శుద్ధిచేసినటువంటి గడపలోకి అడుగుపెట్టినప్పుడు పసుపులో ఉండే యాంటీ బయోటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్లను శుద్ధిచేస్తాయి. అనేక లక్షల సూక్ష్మజీవులను మన కాళ్లనుండి దూరం చేస్తాయి.

గడపకు పసుపు కుంకుమలు పెట్టడానికి గ్రంధాలు ఏం చెబుుతున్నాయి
గడపకు పసుపు రాసే సంప్రదాయం పాటించే ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. సమయానికి పెళ్ళి జరగడమే గాక మంచి వరుడు వస్తాడు. మనసు అర్ధం చేసుకునేవాడూ, ఎన్నడూ విడిపోనివాడూ వస్తాడు.

గడపకు పసుపు కుంకుమలు పెట్టడానికి గ్రంధాలు ఏం చెబుుతున్నాయి
గడపకు పసుపు రాసే సంప్రదాయం ఉన్న ఇళ్ళలో పిల్లలు చెప్పిన మాట వింటారు. అభివృద్ధి పథంలో నడుస్తారు. అలాంటి ఇళ్ళు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటాయి.

గడపకు పసుపు కుంకుమలు పెట్టడానికి గ్రంధాలు ఏం చెబుుతున్నాయి
పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి, కుటుంబానికి వన్నె తెస్తారు. గడపకు పసుపు రాసి, కుంకుమ దిద్దే తల్లులకు కూతురు లాంటి కోడళ్ళు, కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారు.

గడపకు పసుపు కుంకుమలు పెట్టడానికి గ్రంధాలు ఏం చెబుుతున్నాయి
జ్యోతిష్యశాస్త్రాన్ని అనుసరించి పసుపు గురు గ్రహాన్ని, అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని, సంపదలను సూచిస్తుంది. ఎరుపురంగు శుక్ర గ్రహాన్ని, సుఖాలను, సంపదలను సూచిస్తుంది. గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టడం ద్వారా గురు, శుక్రులు మనకు అనుకూలంగా ఉంటారు. సంపదలు లభ్యమౌతాయి.



Click it and Unblock the Notifications