Latest Updates
-
మిగిలిన అన్నాన్ని ఇలా వాడారంటే.. ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తినాల్సిందే! -
ఈ ఒక్క పౌడర్ కలిపారంటే.. మొక్కజొన్నతో కరకరలాడుతూ టేస్టీ పకోడీ రెడీ.! -
పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం.. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథులు ఇవే.! -
శ్రావణ మాసం స్పెషల్ హెల్తీ లడ్డు.. పప్పు నానబెట్టే పనే లేదు,పాకం పట్టే శ్రమ లేదు..ఈజీగా చేసుకోండిలా.. -
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు!
శ్రావణ సోమవారం ఇలా చేస్తే.. డబ్బుకు కొదవ ఉండదు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి
మిగతా నెలలతో పోలిస్తే శ్రావణ మాసానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. అందుకే శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. హిందువులు ఉపవాసాలు కూడా పాటిస్తారు. దైవ పూజ, వ్రతాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. శ్రావణ మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ శ్రావణ మాసంలో సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

హిందూ మతవిశ్వాసం ప్రకారం సోమవారం శివుడికి అంకితమిచ్చిన రోజు. పరమేశ్వరుడికి ఇష్టమైన శ్రావణ మాసంలో, ఆయనకు ప్రీతిపాత్రమైన సోమవారం రోజు ఆయనను పూజిస్తే సమస్యలన్నీ తొలగిపోయి.. జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జీవితాంతం డబ్బుకు లోటు ఉండకూడదని మీరు కోరుకుంటుంటే.. శ్రావణ సోమవారాల్లో కచ్చితంగా ఈ పరిహారాలు పాటించాలి. దీని వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి, డబ్బుకు ఏలోటూ ఉండదు.
శ్రావణ సోమవారం పాటించాల్సిన పరిహారం:
రాగి, వెండి, కంచుతో చేసిన కలశాలను రెండింటిని తీసుకోవాలి. రెండు కలశాలు లేకపోతే, ఒక కలశం తీసుకుని దానిపై ఒక గిన్నెను ఉంచాలి. అంటే రెండు సంఖ్య వచ్చేలా ఉండాలి. ఆయా పాత్రలను నీటిలో నింపుకోవాలి. ఇప్పుడు ఆ పాత్రలతో ఏకకాలంలో శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల దేవదేవుడు మహాదేవుడు చాలా సంతోషిస్తాడట. ఇలా చేసిన వారికి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆనందం, శ్రేయస్సు, సంపద లభిస్తాయి. ఇలా చేస్తూ కోరుకునే కోరికలు నెరవేరుతాయి.
నీటిలో ఇది కలిపితే మరింత ఎక్కువ ప్రయోజనం:
మనసులో ఉన్న బలమైన కోరికను నెరవేర్చుకోవడానికి తాపత్రయపడేవారు.. శివలింగానికి నీటితో పాటు చెరకు రసాన్ని సమర్పించాలని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శివాలయానికి వెళ్లి ఉత్తరాభిముఖంగా శివ లింగం ముందు కూర్చోవాలి. మనస్సులో లేదా బయటకు వినిపించేలా ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ చెరకు రసం కలిపిన నీటితో లింగానికి జలాభిషేకం చేయాలి. ఆ తర్వాత చేతులు జోడించి పరమేశ్వరుడికి మొక్కాలి. మనసులో ఉన్న కోరికను తలచుకుని అది నెరవేర్చమని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications