Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం.. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథులు ఇవే.!
ఈ రోజు నుంచి పవిత్ర శ్రావణ మాసం కొనసాగుతుంది. హిందూ మత సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తూ సౌభాగ్యం, కుటుంబ ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు సిద్ధించమని మహిళలు ఈ మాసమంతా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి చేసే విశేష పూజలు తిలకించి పులకించి పోవాల్సిందే. ఇక, వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారి పూజా విధానం మరింత స్పెషల్. మరి వరలక్ష్మీ వ్రతంతో పాటు ఈ నెలలో ముఖ్యమైన పండుగలు, తిథులు ఏంటి.. ఆచరించాల్సిన నియమాలేంటి ఈ కథనంలో చూద్దాం..'

ప్రతి శ్రావణ మాసంలో అమ్మవారికి విశేష పూజలతో పాటు శివయ్యను మహిళలు ఆరాధిస్తారు. ఈ మాసమంతా సాత్విక ఆహారం తీసుకుంటూ ఉపవాసాలు, నిష్టలు పాటిస్తారు. మూఢాల తర్వాత ఈ మాసంలో పండుగల హడావుడి, పెళ్లిళ్ల ముహూర్తాలు, పూజలు.. వీటితో ఈ నెలంతా బిజిబిజీగా గడుపుతారు. కాగా, ఆగష్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం కొనసాగుతుంది.
నాగుల పంచమి
ఆగష్టు 17న సోమవారం నాగుల పంచమి తిథి వస్తుంది. ఈ రోజున మహిళలంతా శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. పుట్టలో పాలు పోసి నైవేద్యం సమర్పించి నాగదేవతను విశేషంగా ఆరాధిస్తారు. ఈ శ్రావణ శుద్ధ పంచమి ఎంతో పవిత్రమైన రోజు.
వరలక్ష్మీ వ్రతం
శాస్త్రాలు, పండితుల సలహా ప్రకారం ఈ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నుంచి మహిళలు తమ వీలు, సౌకర్యాన్ని బట్టి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ క్రమంలో ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం వస్తుంది. రెండో శుక్రవారం వీలు కాని వారు మళ్లీ వారం ఇలా ఇంటిని శుభ్రం చేసుకుని వ్రతాన్ని నిర్వహిస్తారు. ఉపవాసం, అమ్మవారి అలంకరణ, నైవేద్యాలు, కలశ పూజ, దోరం, వ్రత కథ.. వరలక్ష్మీ వ్రతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

రాఖీ పౌర్ణమి
ఆగష్టు 28న శ్రావణ శుద్ధ పౌర్ణమి. ఈ రోజే రాఖీ పండుగ. శుక్రవారం. ఒకే రోజు శుక్రవారం, రాఖీ పౌర్ణమి కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. పౌర్ణమి తిథి రావడంతో ఈ రోజు కూడా వరలక్ష్మీ వ్రతం ప్రారంభించడానికి శుభప్రదంగా భావిస్తారు. ఉదయం వ్రతం చేసుకునేవారికి ఈ రోజు మంచిది. సాయంత్రం వ్రతం చేసే వారు ఆగష్టు 21న చేసుకోవడం మేలు.
కృష్ణాష్టమి
సెప్టెంబర్ 4న శుక్రవారం గోకులాష్టమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి రానుంది. సెప్టెంబర్ 11న పోలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగియనుంది.



Click it and Unblock the Notifications
