Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
గంటలు గంటలు చదివినా గుర్తుండట్లేదా? ఇలా చేస్తే మీరే క్లాస్ టాపర్!..విద్యార్థుల విజయానికి వాస్తు చిట్కాలు
పుస్తకం తెరిచి గంటలు గంటలు కూర్చున్నా చదివింది మాత్రం 10 నిమిషాలేనా? రేపు ఎగ్జామ్ ఉంది, కానీ ఏకాగ్రత కుదరడం లేదు అని బాధపడుతున్నారా? ఇది ఈ తరం విద్యార్థులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బృహస్పతి, శుక్రుడు, చంద్రగ్రహాల బలహీన స్థానాలే మనసు చంచలంగా మారడానికి, ఏకాగ్రత లోపించడానికి ప్రధాన కారణాలు. అయితే కొన్ని రుద్రాక్షలు, వాస్తు చిట్కాలు,చిన్నపాటి మార్పులతో మీరు మీ జ్ఞాపకశక్తిని అద్భుతంగా పెంచుకోవచ్చు. అవి మీ చదువుకు గేమ్-ఛేంజర్ గా ఎలా మారతాయో ఇక్కడ చూడండి.

ఏకాగ్రతను పెంచే దివ్యౌషధం.. రుద్రాక్ష
జ్యోతిషశాస్త్రంలో రుద్రాక్షకు విశేషమైన శక్తి ఉందని నమ్ముతారు. ఇది విద్యార్థులకు మానసిక ప్రశాంతతను, తెలివితేటలను ప్రసాదిస్తుంది.
3-ముఖి రుద్రాక్ష
దీనికి అధిపతులు అగ్ని, బృహస్పతి. మతిమరుపు సమస్యతో బాధపడేవారికి ఇది గొప్ప వరం. ఇది జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దీనిని సోమవారం లేదా గురువారం ధరించాలి.
6-ముఖి రుద్రాక్ష
దీని పాలక దేవతలు కార్తికేయుడు, శుక్రుడు. మీ మనస్సు ఒక చోట నిలకడగా ఉండకపోతే, ఈ రుద్రాక్ష మీ ఇంద్రియాలను నియంత్రించి, ఫోకస్ పెంచడానికి సహాయపడుతుంది. శుక్రవారం ధరించడం బెటర్.
గణేష్ రుద్రాక్ష
విఘ్నాలను తొలగించే వినాయకుడి స్వరూపం ఇది. చదువులో ఆటంకాలు తొలగి, ఆత్మవిశ్వాసం పెరగడానికి బుధవారం నాడు దీనిని ధరించాలి.
ధరించే విధానం
రుద్రాక్షను గంగాజలంతో శుద్ధి చేసి ఎరుపు లేదా పసుపు దారంలో కట్టి, ఓం నమః శివాయ అని జపిస్తూ మెడలో ధరించాలి.
విజయాన్ని అందించే వాస్తు చిట్కాలు
కేవలం కష్టపడటమే కాదు, సరైన దిశలో కష్టపడటం ముఖ్యం. మీ స్టడీ రూమ్ లో ఈ చిన్న మార్పులు చేసి చూడండి.
సరైన దిశ: మీ స్టడీ టేబుల్‌ను ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచండి. ఈ దిశలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి.
రంగుల మ్యాజిక్: టేబుల్ మీద ఆకుపచ్చ లేదా నీలం రంగు వస్త్రాన్ని ఉంచడం వల్ల కళ్ళకు, మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
ప్రకృతితో బంధం: ఏకాగ్రత పెరగడానికి స్టడీ టేబుల్ మీద ఒక మనీ ప్లాంట్ లేదా పీస్ లిల్లీ మొక్కను ఉంచండి. ఇవి ఆక్సిజన్ తో పాటు పాజిటివ్ వైబ్స్ ను ఇస్తాయి.
మానసిక శక్తి కోసం.. మంత్రం,ధ్యానం
-చదువు ప్రారంభించే ముందు.. ఓం ఐం సరస్వత్యై నమః అని 11 సార్లు జపించండి. ఇది మెదడును ఉత్తేజితం చేస్తుంది.
-ప్రతిరోజూ 10-15 నిమిషాల ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఇది అనవసరపు ఆలోచనలను తొలగించి, మీ మెదడును లేజర్ షార్ప్ గా మారుస్తుంది.



Click it and Unblock the Notifications