For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుక్కలు బహిరంగంగా శృంగారం చేసుకోవడానికి కారణం ద్రౌపది ! ఐదుగురు భర్తలున్నా కూడా ద్రౌపది పతివ్రత

ఒక భర్త కలిగిన స్త్రీ పతివ్రత అవుతుంది. కానీ ఐదుగురు భర్తలను కలిగిన స్త్రీ.. ద్రౌపది ఎలా పతివ్రత అవుతుందని కొందరు వితండవాదం చేస్తుంటారు. ద్రౌపది నిజంగా పతివ్రతే.ఐదుగురు భర్తలున్నా ద్రౌపది పతివ్రత.

|

ఒక భర్త కలిగిన స్త్రీ పతివ్రత అవుతుంది. కానీ ఐదుగురు భర్తలను కలిగిన స్త్రీ.. ద్రౌపది ఎలా పతివ్రత అవుతుందని కొందరు వితండవాదం చేస్తుంటారు. ద్రౌపతి నిజంగా పతివ్రతే. అదెలాగండీ..ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ...అయిదుగురు భర్తలు గల ద్రౌపతి పతివ్రత ఎలా అవుతుందండీ? అని మీరు అనొచ్చు. ఆడదంటే.. ఆది పరాశక్తి, అపరకాళి. అలాంటి మహిళ పెళ్లయ్యాక తన భర్తనే దేవుడిగా భావించి పూజిస్తుంది. పతియే దైవంగా వ్రతం చేస్తుంది. హిందూ ఆచారాలు, సంప్రదాయం ప్రకారం ఒకే భర్త గల స్త్రీని 'పతివ్రత' అంటారన్న విషయం తెలిసిందే.

అయితే ఐదుగురు భర్తలు కలిగిన ద్రౌపదిని కూడా పతివ్రతే అంటారన్న విషయం కూడా మహాభారతం గురించి తెలిసిన అందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొంత కాలంగా మరో వాదన పుట్టుకొచ్చింది. ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ, ఐదుగురు భర్తలున్న ద్రౌపది పతివ్రత ఎలా అవుతుందని కొందరు వాదిస్తున్నారు. కానీ ఆ వాదన సరైంది కాదని, ఐదుగురు భర్తలున్నప్పటికీ ద్రౌపది పతివ్రతే అని కొందరికీ మాత్రమే తెలుసు.

ఇంద్రుడే ఐదు రూపాలుగా

ఇంద్రుడే ఐదు రూపాలుగా

ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య శచీదేవి.. ద్రౌపతిగా జన్మించింది.పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాజాలడు. పంచపాండవులు, ద్రౌపతి, నవమాసాలు మాతృ గర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు. వీరందరూ అయోనిజులే. ద్రౌపతి యఙ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు.

త్రిశిరుని ఇంద్రుడు సంహరించాడు

త్రిశిరుని ఇంద్రుడు సంహరించాడు

ఇక ధర్మరాజాదులు కుంతి, మాద్రులకు ఎలా జన్మించారో జగతికి తెలిసిన కథే. కానీ...అలా జన్మించడానికి వెనుక ఉన్న అసలు కథ చాలా మందికి తెలియదు. త్వష్ట్రప్రజాపతి కుమారుడైన ‘త్రిశిరుని' ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యార్హతను కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు దేవగురువు అయిన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్య పాతకం పోయే మార్గం చెప్పమని అర్థించాడు. బృహస్పతి ఇంద్రునికి తపస్సు చేయమని సూచిస్తాడు.

బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోమంటాడు

బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోమంటాడు

బ్రహ్మహత్య దోషాలున్న నీకు దైవ శక్తులు తోడుగా ఉండవని చెప్తాడు. నిన్ను సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టమేమీ కాదని చెప్పాడు. కాబట్టి నీ పంచప్రాణ శక్తుల్లో నాలుగింటిని నీకు నమ్మకం గల వారివద్ద దాచి ఉంచమంటాడు. ఐదో ప్రాణ శక్తి నీ దగ్గరే వుంచుకోమంటాడు. ఆపై తపస్సు చేసి బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోమంటాడు. గురుదేవుని ఆదేశాల మేరకు ఇంద్రుడు తన నాలుగు శక్తులను యముడు, వాయుదేవుడు, అశ్వినీ దేవతల వద్ద దాచి తపస్సు ప్రారంభిస్తాడు.

పంచపాండవులకు తల్లులయ్యారు

పంచపాండవులకు తల్లులయ్యారు

పాండురాజు భార్యలైన కుంతీమాద్రిలు దుర్వాసన మహర్షి సంతాన మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు. అలా యముడు, ఇంద్రుడు, వాయువు, అశ్విని దేవతలు తమ వద్దనున్న ఇంద్రుని పంచ ప్రాణాలను పంచ పాండవులుగా అనుగ్రహించి.. జన్మనెత్తేలా చేస్తారు. కాబట్టి పంచపాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు.

ఏ ఒక్కరు తగ్గినా

ఏ ఒక్కరు తగ్గినా

ఏ ఒక్కరు తగ్గినా పరిపూర్ణ ఇంద్రుడు కాదు. ఇక ఇంద్రుడు తన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోవడానికి తపస్సు చేస్తున్న సమయంలో ఆతని భార్య శచీదేవి రాక్షసుల బారి నుంచి తనకు రక్ష కావాలని అగ్నిదేవుడిని వేడుకుంటుంది. ఆయన నీడలో కాలం గడుపుతుంది.

పంచపాండవులకు అర్థాంగిగా

పంచపాండవులకు అర్థాంగిగా

కానీ తన భర్త ఇంద్రుడు ఐదు రూపాల్లో భూలోకంలో జన్మించాడని తెలుసుకున్న శచీదేవి.. యజ్ఞ గుండం నుంచి ద్రౌపదిగా జన్మించి.. పంచపాండవులకు అర్థాంగిగా మారింది. భౌతికంగా పాండవులు ఐదుగురిగా కనిపిస్తున్నా.. నిజానికి వారందరూ కలిసి ఒక్కరే. అంటే ఆ ఒక్కరితో ధర్మబద్ధంగా సంసారం సాగించిన ద్రౌపది కచ్చితంగా పతివ్రతే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.

తన భర్తలతో సంభోగించినా

తన భర్తలతో సంభోగించినా

ఇక ద్రౌపదికి ఉన్న వరం కారణంగా ఆమె తన భర్తలతో సంభోగించినా ఎప్పుడూ కన్యత్వాన్ని కోల్పోదు. ఒక భర్త దగ్గరి నుంచి మరో భర్త దగ్గరికి వెళ్లేటప్పుడు ఆమె అగ్నిలో నడుస్తూ వెళ్లేది. అప్పుడు తన కన్యత్వాన్ని తిరిగి పొందేది. అయితే ఆమె ఒక భర్తతో ఏకాంతంగా ఉండేటప్పుడు చుట్టుపక్కలకు ఎవరూ రాకూడదు. అలా వస్తే రాజ్య బహిష్కరణ ఉంటుంది.

కుక్కలన్నీ బహిరంగంగా శృంగారం చేసుకోవాలి

కుక్కలన్నీ బహిరంగంగా శృంగారం చేసుకోవాలి

ఒకసారి ద్రౌపది ధర్మరాజుతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక కుక్క అక్కడికి వచ్చి గట్టిగా మొరగడమే కాకుండా ధర్మరాజు చెప్పు కూడా ఎత్తుకుపోయింది. అప్పుడు ద్రౌపది కోపంతో... మా ఏకాంతానికి భంగం కలిగించినందుకు ఈ క్షణం నుంచి ఈ కుక్కలన్నీ బహిరంగంగా శృంగారం చేసుకుందు గాక అని శాపం ఇచ్చిందట.

మరో కథ కూడా

మరో కథ కూడా

ఇక ద్రౌపది గురించి మరో కథ కూడా ఉంది. స్వయంవరంలో అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నాడు. ఇంటికి వచ్చీ రాగానే అమ్మా నేను ఒక మంచి బహుమతిని గెలుచుకొని తెచ్చాను అని తల్లి కుంతితో అంటాడు. ఐదుగురు సమానంగా పంచుకోండి నాయనా అని అంటుంది. దీనిఫలితంగా ఆమె అయిదుగురు భర్తలకు ఇల్లాలు అయింది. దీనికి కారణం శివుడు కూడా ఆమెకు అయిదుగురు భర్తలకు ఇల్లాలు అవుతావని వరం ఇచ్చాడని కూడా ఉంది. మామూలుగా ఈ వివరణ అంతా ఇవ్వడం చారిత్రకంగా భారత రచనలలో చేరుస్తూ వచ్చారు.

అయిదుగురు భర్తలు ఉండడం

అయిదుగురు భర్తలు ఉండడం

దీనికి కారణం ఒక భర్త ఒక భార్య ఉండే సమాజం వచ్చిన తర్వాత ఈ పరిణత వాతావరణంలో అయిదుగురు భర్తలు ఉండడం అనేది అదొక తప్పుగానూ, విచిత్రం గాను సామాజికంగా చాలా తక్కువ చర్య గాను భావించే స్థితి వచ్చిన తర్వాత నే ద్రౌపదికి ఇలాంటి వివరణ ఇవ్వవలసి వచ్చింది. దేవుడి వరంగా కారణంగానూ, తల్లి ఆదేశం కారణంగానూ ఈమె అయిదుగురు భర్తలకు ఇల్లాలు అయింది. అందువల్ల ఇది తప్పు కాదు అని చెప్పే ధోరణి ఇది.

 పాంచాల దేశంలో బహు భర్తృత్వం అనేది చాలా సర్వసాధారణం

పాంచాల దేశంలో బహు భర్తృత్వం అనేది చాలా సర్వసాధారణం

కాని ఇది ఒక సామాజిక స్థితిని ఒక సమాజంలో నిజంగా ఎల్ల కాలంగా ఉండే స్థితినే చెబుతుంది. ద్రౌపది ఉన్న పాంచాల దేశంలో బహు భర్తృత్వం అనేది చాలా సర్వసాధారణంగా ఉన్న సామాజిక ఆచారం. దీన్ని వారి సమాజంలో వారు ఎవరూ తప్పుగా అనుకోరు. బహు భర్తృత్వం ఉన్న సమాజాలు నేటికీ ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని ఘడ్వాల్ ప్రాంతంలోను. ఈశాన్య భారత దేశంలోని ఖాసి, జైంతియా తెగలలోను ఈ ఆచారం ఇప్పటికీ ఉంది. ఎక్కువ మంది భర్తలు అదీ ఒకేసారి ఉండడం అక్కడి సమాజాలలో మామూలు విషయం. దక్షిణ భారతదేశంలోని కేరళలో ఒక తెగలో ఇప్పటికీ ఈ ఆచారం ఉంది. కాని అది తుది దశలో ఉంది. దీన్ని పాటించడం ఇప్పుడు వారు కూడా దోషంగా పరిగణించి మాని వేస్తున్నారు.

ఒక్కొక భర్తతో ఒక సంవత్సరం

ఒక్కొక భర్తతో ఒక సంవత్సరం

బహు భర్తృత్వం ఉన్నప్పుడు ఎలా జీవించాలి అనే ఒక అవగాహన స్పష్టంగా ఉంటుంది. ఇది మహాభారతంలో కూడా వర్ణించబడి ఉంది. ద్రౌపది ఒక్కొక భర్తతో ఒక సంవత్సరం పాటు వరుసలో వారితో ఉంటుంది. ఆ సమయంలో మరొక భర్త ఆమె వైపు చూడడం కలవడం ఉండదు. దాన్ని తప్పుగా పరిగణిస్తారు. ద్రౌపది ధర్మరాజుతో ఉన్న కాలంలో ఆమె భర్తతో ఏకాంతంలో ఉన్న కాలంలో అర్జునుడు నియమం తప్పి వారు ఉన్న ఇంటి లోనికి పోతాడు. దీనికి ఫలితంగా ఒక సంవత్సరం పాటు వనవాసం శిక్షను అనుభవిస్తాడు. ఈ కాలంలోనే తపస్సు చేస్తాడు. శివుని మెప్పిస్తాడు, పాశుపతం సంపాదిస్తాడు. ఇలా నియమంతోనే వారి జీవితాలు ఉంటాయి. బయటి సమాజంలో ఉండే వారు భావించినట్లు అసంగతంగా కాని అడ్డగోలుగా కాని వారి జీవితాలు ఉండవు.

స్త్రీకి కూడా జరగని అవమానాలు ఆమెకు జరిగాయి

స్త్రీకి కూడా జరగని అవమానాలు ఆమెకు జరిగాయి

ద్రౌపది ఒక మహారాజు కుమార్తె. అంతే కాదు మరొక మహారాజుకు భార్య పరమ పతివ్రత. అయిదుగురు మహా వీరులకు ఇల్లాలు. వారు ఎంతటి మహావీరులు అంటే ప్రపంచంలోని మరెవ్వరూ వారిని గెలువలేరు. ఐదుగురు మహావీరులైన కుమారులకు తల్లి కూడా వీరికి ఏ మాత్రం తీసిపోని మహావీరుడు అయిన ఒక అన్నకు చెల్లెలు. మరొక మహావీరుడైన తండ్రికి కూతురు. కాని ఇంత మంది ఉండి ఏ స్త్రీకి జరగని అవమానాన్ని పొందింది. నిండు సభలో అందరి ఎదురుగా ఒకడు ఆమె బట్టలు ఊడదీసి నగ్నంగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మరొక దుర్మార్గుడు సైంధవుడు అనే వాడు వనవాసంలో ఉండగా ఆమెను బలాత్కారం చేయడానికి ప్రయత్నించాడు. ఇంత ఘోరమైన అవమానాలు ద్రౌపదికే జరిగాయి. ఆనాడు మరో సామాన్య స్త్రీకి కూడా జరగని అవమానాలు ఆమెకు జరిగాయి. ఇది ఆమెకు జరిగిన అన్యాయం. దీనికి కారణం ఆమె భర్తలు వారు నమ్మిన న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండడమే.

English summary

the shocking secret of draupadi and her relationship with the pandavas

the shocking secret of draupadi and her relationship with the pandavas
Story first published:Tuesday, June 19, 2018, 17:00 [IST]
Desktop Bottom Promotion