Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
రాముడిపై శబరికి ఉన్న భక్తి భావం చాలా గొప్పది, అందుకే రాముడు ఆమె ఎంగిలి తిన్నాడు
రాముడు స్వయంగా విష్ణువుఅని తెలుసుకుంది. రాముడు ఎంత పెద్ద వీరుడో.. ఎంత దయార్ధ హ్రుదయుడో ఆమెకు మునులు చెప్పారు. అందుకే రాముడి కోసం ఆమె అన్ని సంవత్సరాలు వేచి చూస్తుంది. జీవితంలో ఒక్కసారి రాముడ్ని చూసి చన
రామాయణంలోని ప్రతి పాత్ర ఆసక్తికరమే. అందులో కొన్ని చిన్న పాత్రలకు ప్రాధాన్యం ఉంది. శబరి పాత్ర కూడా అలాంటిదే. శబరి ఒక గిరిజన జాతి మహిళ. ఆమె తన గురువులకు సేవ చేసుకుంటూ ఆశ్రమంలో ఉండేది. మునులు చెప్పిన విషయాలను నేర్చుకుంటూ సేవ చేస్తూఉండేది.
రాముడు అరణ్యవాసానికి వచ్చిన విషయం మతంగముని శిష్యులకు తెలుస్తుంది. వాళ్లు శబరికి చెబుతారు. దీంతో శబరి రాముడి కోసం దాదాపు పదమూడేళ్ల పాటు ఎదురు చూస్తుంది.

ఎంగిలి తినడం
అయితే శ్రీరామచంద్రుడు శబరి ఎంగిలి తినడం చాలా గొప్ప విషయమే. శబరి చిన్నప్పటి నుంచి పంపానది సమీపంలో ఉండే మతంగ ముని ఆశ్రమంలోనే ఉండేది. ఆ ఆశ్రమం తప్ప ఆమెకు మరో లోకం తెలియదు. అయితే ఆశ్రమంలో మునులంతా నిత్యం రాముడి గురించే మాట్లాడుకుంటూ ఉండడం వల్ల ఆమెకు రాముడిపై విపరీతమైన భక్తి భావం పెరిగింది.

రోజూ రామనామంతో
రాముడు స్వయంగా విష్ణువుఅని తెలుసుకుంది. రాముడు ఎంత పెద్ద వీరుడో.. ఎంత దయార్ధ హ్రుదయుడో ఆమెకు మునులు చెప్పారు. అందుకే రాముడి కోసం ఆమె అన్ని సంవత్సరాలు వేచి చూస్తుంది. జీవితంలో ఒక్కసారి రాముడ్ని చూసి చనిపోతే చాలు అనుకుంది శబరి.

వయస్సు పైబడిపోయింది
తన గురువు అయిన మతంగుడు ముసలివాడు అయిపోయి చివరకు అతను స్వర్గానికి వెళ్లిపోతాడు. అయితే ఎప్పటికైనా రాముడు వస్తాడు ఆశ్రమం దగ్గరే ఉండు అని శబరికి చెబుతాడు. రోజూ రామనామంతో రాముడి కోసం వేచి చూసింది. వయస్సు పైబడిపోయింది. ఒంట్లో సత్తువ పోయింది. అయినా రామనామాన్ని ఆమె ఆపలేదు.

స్వామికి సేవ చేయాలనుకుంటుంది
శబరి గురించి రాముడికి తెలిసింది. తన భక్తురాలిని చూడాలని బయల్దేరాడు. చివరకు రాముడు ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి ఆనందానికి అవధులుండవు. తన ఆశ్రమానికి వచ్చిన స్వామికి సేవ చేయాలనుకుంటుంది. రాముడి కాళ్లు కడుగుతుంది. పూలతో ఆశ్రమంలోకి ఆహ్వానిస్తుంది.

మోక్షం లభించింది
ఇక తాను తీసుకొచ్చిన రేగు పళ్లను రాముడికి తినడానికి ఇద్దామనుకుంది. అయితే అవి పుల్లగా ఉంటే కష్టమనుకుంది. అందుకే వాటిని కొరికి రుచి చూసింది. తర్వాత రాముడికి తినడానికి ఇచ్చింది. రాముడు ఆ ఎంగిలి పండ్లను కూడా ఇష్టంగా తిన్నాడు. భక్తులతో ప్రేమతో ఇచ్చే వాటిలో ఉండే మాధుర్యం ఇంకెందులోనూ ఉండదని రాముడికి తెలుసు. రాముడి రూపాన్ని ఎంతో ప్రేమగా చూసింది శబరి. ఈ జన్మకు తనకిది చాలనుకుంది. తర్వాత రాముడి వల్ల ఆమెకు మోక్షం లభించింది.



Click it and Unblock the Notifications
