Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
ఏం తిన్నా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తోందా? అసలు కారణం ఫుడ్ కాదు..
మనం ప్రతిరోజూ చాలా జాగ్రత్తగా, ఆరోగ్యం మీద శ్రద్ధతో ఎంతో మంచి ఆహారం తీసుకుంటూ ఉంటాం. కానీ ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా కూడా పొట్ట ఉబ్బరంగా, గ్యాస్ తో తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను జంక్ ఫుడ్ తినట్లేదు కదా.. అంతా కరెక్ట్ గానే, సమయానికే తింటున్నా కదా.. మరి నాకెందుకు ఈ బ్లోటింగ్ వస్తోంది? అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దీనివల్ల రోజంతా చిరాగ్గా, ఏ పని మీదా ఏకాగ్రత పెట్టలేని పరిస్థితి ఎదురవుతుంది.

అయితే ఇక్కడ మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక ఆశ్చర్యకరమైన నిజం ఉంది. ఈ సమస్యకు కారణం మీరు తినే ఆహారం కాదు..మీ మైండ్ సెట్, మీ ఆలోచనలే. అవును, మీరు భోజనం చేసేటప్పుడు మీ మైండ్ ఏ స్థితిలో ఉందనేదే మీ జీర్ణక్రియను నిర్ణయిస్తుంది.
అసలైన కారణం ఇదే
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్, ఆందోళన, భయం లేదా విపరీతమైన హడావిడిలో ఉంటున్నాం. ఇలా మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మన నరాల వ్యవస్థ చాలా వీక్ అయిపోయి ఫ్లైట్ మోడ్ లోకి వెళ్తుంది. అంటే మన శరీరం ఏదో ప్రమాదంలో ఉందని మెదడు భావించి, పొట్టకు అందాల్సిన రక్తప్రసరణను ఆపేసి, కండరాలకు పంపుతుంది.
బ్రెయిన్ - గట్ కనెక్షన్
మన మెదడుకు, పొట్టకు నేరుగా సంబంధం ఉంటుంది. మీ మైండ్ స్ట్రెస్ లో ఉన్న ప్రతిసారీ, ఆ ప్రభావం వెంటనే పొట్టపై పడుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థలో ఉండాల్సిన సహజమైన అగ్ని పూర్తిగా చల్లారిపోతుంది.
దీని ఫలితంగా, మీరు ఎంత్త ఖరీదైన, ఆరోగ్యకరమైన ఫుడ్ తిన్నా సరే అది సరిగ్గా అరగదు. జీర్ణం కాని ఆ ఆహారం పొట్టలోనే ఉండిపోయి, లోపల పులిసిపోయి విపరీతమైన గ్యాస్, బ్లోటింగ్ కు దారితీస్తుంది. అంటే సమస్య ప్లేట్ లో ఉన్న ఫుడ్ లో లేదు, ఆ సమయంలో మీ మైండ్ లో ఉన్న ఒత్తిడిలో ఉంది.
స్ట్రెస్ వల్ల వచ్చే ఈ బ్లోటింగ్ ను తప్పించుకోడానికి ఆయుర్వేద టిప్స్
కేవలం డైట్ మార్చినంత మాత్రాన ఈ గ్యాస్ సమస్య పోదు. మీ గట్ హెల్త్ ను రీసెట్ చేసుకోవడానికి ఈ కింది సింపుల్ ఆయుర్వేద చిట్కాలను పాటించండి.
మైండ్ ఫుల్ ఈటింగ్
తినడానికి కూర్చునే ముందు కళ్లు మూసుకుని 3 సార్లు డీప్ బ్రీత్ (దీర్ఘ శ్వాస) తీసుకోండి. దీనివల్ల నరాల వ్యవస్థ శాంతిస్తుంది. టీవీ చూస్తూ, ఫోన్ స్క్రోల్ చేస్తూ, ల్యాప్ టాప్ ముందు కంగారుగా తినడం పూర్తిగా ఆపేయండి. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ ప్రశాంతంగా తినండి.
చల్లటి నీళ్లు వద్దు.. గోరువెచ్చని నీళ్లే ముద్దు
భోజనం చేసేటప్పుడు ఫ్రిజ్ లోని ఐస్ వాటర్ అస్సలు తాగకండి. చల్లటి నీరు జీర్ణక్రియ అగ్నిని ఆర్పేస్తుంది. కేవలం కొంచెం గోరువెచ్చని నీటిని మాత్రమే భోజనం మధ్యలో సిప్ చేయండి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
ప్రాణాయామం - ధ్యానం
రోజులో కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మెడిటేషన్ లేదా ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ బాగా అంది, పొట్టలోని గ్యాస్ సమస్యలు నాచురల్‌గా తగ్గిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
