Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
జీర్ణశక్తిని పెంచే అల్లం కొత్తిమీర చట్నీ.. వేడి వేడి అన్నం, టిఫిన్స్ లోకి అమృతంలా,,
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి అదిరిపోయే చట్నీ ఉంటేనే కడుపు నిండా మరో రెండు ఇడ్లీలు ఎక్కువ తినాలనిపిస్తుంది. మీరు ఎప్పుడూ రొటీన్ గా తినే పల్లీల చట్నీ, కొబ్బరి పచ్చడిలకు భిన్నంగా ఏదైనా కొత్తగా, రుచిగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే అల్లం కొత్తిమీర చట్నీ ట్రై చేయండి. కారం, పులుపు, తీపి కలగలిపిన ఈ పచ్చడి ఇంట్లో చేసిన మొదటి రోజు నుంచే అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్‌గా మారిపోయింది.

అల్లం కొత్తిమీర చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - అర టేబుల్ స్పూన్
అల్లం ముక్కలు - పావు కప్పు
పచ్చిమిర్చి - 2 లేదా 3
కొత్తిమీర - ఒక గుప్పెడు
వెల్లుల్లి రెబ్బలు - 3 లేదా 4
బెల్లం - 1 టేబుల్ స్పూన్
చింతపండు రసం - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
శనగపప్పు - అర టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
ఎండు మిర్చి - 2 లేదా 3
కరివేపాకు - 1 రెమ్మ
అల్లం కొత్తిమీర చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి.
-నూనె వేడెక్కాక మినపప్పు, శనగపప్పు వేసి దోరగా, బంగారు రంగు వచ్చే
వరకు వేయించండి. ఆ తర్వాత ధనియాలు వేసి కమ్మటి వాసన వచ్చే వరకు
వేయించాలి.
ఇప్పుడు పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం,
పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేలా బాగా వేయించాలి. ఇవి కొద్దిగా
వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న
గుప్పెడు కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి,
ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, బెల్లం, చింతపండు రసం వేసి మెత్తగా చట్నీలా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. బెల్లం, చింతపండు వేయడం వల్ల ఈ పచ్చడికి అసలైన రుచి వస్తుంది.
-ఇప్పుడు తాలింపు కోసం చిన్న పాన్ లో నూనె వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఈ తాలింపును మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం కొత్తిమీర పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన అల్లం కొత్తిమీర పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి ఇడ్లీపై కాస్త నెయ్యి వేసుకుని తిన్నా, క్రిస్పీగా ఉండే దోశతో తిన్నా, లేదా వేడి వేడి అన్నంలో కలుపుకుని తిన్నా అమృతంలా ఉంటుంది.
-జీర్ణక్రియను మెరుగుపరిచే అల్లం, ఆరోగ్యానికి మేలు చేసే కొత్తిమీర ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
