Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ప్రస్తుతమున్న ఈ 5 ఫేమస్ నిర్మాణాలు రాముడు నిర్మించినవే..అవేంటో చూడండి
భారతదేశంలో పుట్టిన ఎవరైనా సరే చిన్నతనం నుంచి ఓ పదం మాత్రం ఖచ్చితంగా వింటారు. అదే శ్రీరాముడు. మతాలకు అతీతంగా శ్రీరాముడుని కొలుస్తుంటారు. రాముడు జీవిత చరిత్రను తెలిపే గ్రంధం రామాయణం. ఓ మనిషి ఆదర్శంగా ఎలా జీవించాలో రామాయణం తెలియజేస్తుంది. కొందరు రామాయణం నిజమని నమ్ముతారు..మరికొందరు ఇదంతా కల్పిత కథ అని కొట్టిపారేస్తారు. అయితే రామాయణంలో చెప్పబడిన విధంగా రాముడు ఉన్నాడు అని చెప్పటానికి ఇప్పటికీ అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో రాముడి ఆనవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాసియాలోని అనేక దేశాల్లో రామయణ ఆనవాళ్లు ఉన్నాయి.
రామాయణం ప్రకారం..శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. రాముడు తన భార్య సీత,తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అయోధ్య నుండి బయలుదేరి వెళ్లి అనేక ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ తన వనవాస జీవితాన్ని గడిపాడు. అయితే వనవాసం టైంలోనూ రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లినప్పుడు శ్రీరాముడు సీతను వెతకడానికి,ఆమెను తిరిగి తీసుకురావడానికి చాలా ప్రాంతాలకు వెళ్లి,అక్కడ ఉండి కొన్నింటిని నిర్మించాడు. త్రేతాయుగంలో రాముడు నిర్మించిన ఇవి ఇప్పటికీ చాలా పాపులర్. రాముడు స్వయంగా తన చేతులతో నిర్మించిన ఆ ఐదు ఏవో ఇక్కడ చూడండి.

శివలింగం
శ్రీరాముడు లంకపై దాడి చేయడానికి బయలుదేరిన సమయంలో ముందుగా శ్రీరాముడు తమిళనాడులోని రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్టించి శివుడిని పూజించాడు. అంటే రామేశ్వరంలో శివలింగాన్ని తొలిసారిగా ప్రతిష్టించినది శ్రీరాముడు. నేటికీ రామేశ్వరం ఒక ప్రసిద్ధ ధార్మిక ప్రదేశం.
గుహలు
వనవాస సమయంలో శ్రీరాముడు మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్, మహారాష్ట్రలోని నాసిక్‌లలో కూడా ఉన్నాడు. ఈ ప్రదేశాలలో ఉన్న సమయంలో శ్రీరాముడు వర్షం నుండి రక్షణ కోసం నాసిక్, చిత్రకూట్‌లలో అనేక గుహలను కూడా నిర్మించాడు. ఇప్పటికీ చిత్రకూట్,నాసిక్ లోని అనేక పురాతన గుహలు త్రేతాయుగానికి సాక్ష్యంగా ఉన్నాయి.
పర్ణకుటి
ఆకులతో చేసిన కుటీరాన్ని లేదా గుడిసెను పర్ణకుటి అంటారు. శ్రీరాముడు తన ప్రయాణ సమయంలో చిత్రకూట్ చేరుకున్నప్పుడు మహర్షి భరద్వాజ గంగా యమునా సంగమ కొండపై పర్ణకుటిని నిర్మించమని సలహా ఇచ్చాడు. దాని ప్రకారం రాముడు పర్ణకుటిని నిర్మించాడు. మరింత ముందుకు వెళుతూ రాముడు నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకోవడానికి పర్ణకుటిని తయారు చేయమని ఇతర సహచరులకు నేర్పించాడు. ఇఫ్పటికీ పర్ణకుటి నాసిక్, శ్రీలంక మొదలైన ప్రదేశాలలో కనిపిస్తుంది..అయితే ఇది మొదట శ్రీరామునిచే సృష్టించబడింది.
సీతా కుండ్, లక్ష్మణ కుండ్
శ్రీరాముడు తన వనవాస సమయంలో అడవిలో నీటి సమస్యను అధిగమించడానికి వర్షపు నీటిని నిల్వ చేయడానికి అనేక చెరువులను నిర్మించాడు. నేటికీ భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో నిర్మించిన చెరువులను సీతా కుండ్, లక్ష్మణ్ కుండ్ అని కూడా పిలుస్తారు.
సముద్రం మీద వంతెన
నల, నీల్ సహాయంతో శ్రీరాముడు ప్రపంచంలోనే మొట్టమొదటి సముద్ర వంతెనను నిర్మించాడు. ప్రస్తుతం సముద్రం మీద ఇటువంటి అనేక ఆధునిక నిర్మాణాలు చూడవచ్చు. కానీ సముద్రం మీద రాముడు నిర్మించిన మొదటి వంతెనకు నల్ సేతు అని పేరు పెట్టారు. కానీ క్రమంగా ప్రజలు నల్ సేతును రామసేతు అని పిలవడం ప్రారంభించారు. రామసేతు నిజంగానే ఉందని అనేక పరిశోధనలు తేల్చాడు.



Click it and Unblock the Notifications
