Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
కార్తీక మాసంలో ఖచ్చితంగా దానం చేయాల్సినవి..వాటి వల్ల ఎలాంటి ఫలితం పొందుతారు!!
ముఖ్యం గా ఏ రోజు ఎటువంటి దానం ఇస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలుసుకొని దానం చేయడం మరింత ఫలదాయకం. వారి వారి శక్తి కొలది దానాలు చేసుకొని మంచి ఫలితాలని పొందవచ్చు. కార్తీక మాసంలో ఏ రోజున ఎలాంటి దానం చేస్
కార్తీక మాసంలో చేసే ఎటువంటి చిన్న దానమైన అత్యంత ఫలితాలనిస్తుంది. కార్తీక మాసం ప్రారంభమైన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు చేసే దానాలు అత్యంత ప్రభావితమైనవి. పుణ్యల ఫలాలు లభించే రోజులు .
పవిత్రమైన కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంత పుణ్యమో దానాలు చేయడం వల్ల కూడా అంతే పాప పరిహారం . అందుకే ఈ మాసంలో శక్తి కొలదీ దానధర్మాలు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. సాధ్యపడేది ఒక్కటైనా చెయ్యమని సూచిస్తున్నాయి. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్పూర్తిగా, శ్రద్ధంగా చేస్తే మంచి ఫలితం అధికంగా ఉంటుంది.
ముఖ్యం గా ఏ రోజు ఎటువంటి దానం ఇస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలుసుకొని దానం చేయడం మరింత ఫలదాయకం. వారి వారి శక్తి కొలది దానాలు చేసుకొని మంచి ఫలితాలని పొందవచ్చు. కార్తీక మాసంలో ఏ రోజున ఎలాంటి దానం చేస్తే ఎలాంటి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం..

మొదటి రోజు నెయ్యి, బంగారం దానం చేస్తే
కార్తీక మాసంలో మొదటి రోజు నెయ్యి, బంగారం దానం చేస్తే మంచిది. అలాగే అగ్ని దేవుణ్ణి పూజిస్తే తేజస్సు ప్రాప్తిస్తుంది.

రెండవ రోజు కలువ పూలు, నూనె, ఉప్పు దానం చేస్తే
కార్తీక మాసంలో రెండవ రోజు కలువ పూలు, నూనె, ఉప్పు దానం చేస్తే మంచిది. అలాగే బ్రహ్మ దేవుణ్ణి పూజిస్తే మనశాంతి లభిస్తుంది

మూడవ రోజు ఉప్పు దానం చేస్తే
కార్తీక మాసంలో మూడవ రోజు ఉప్పు దానం చేస్తే మంచిది. అలాగే పార్వతి దేవి ని పూజిస్తే సౌభాగ్యం చేకూరుతుంది

నాలుగవ రోజు నూనె, పెసర పప్పు దానం చేస్తే
కార్తీక మాసంలో నాలుగవ రోజు నూనె, పెసర పప్పు దానం చేస్తే మంచిది. అలాగే గణపతి ని పూజిస్తే సద్బుద్ధి, కార్య సిద్ది ప్రాప్తిస్తాయి

ఐదవ రోజు స్వయంపాకం, విసనకర్ర దానం చేస్తే
కార్తీక మాసంలో ఐదవ రోజు స్వయంపాకం, విసనకర్ర దానం చేస్తే మంచిది. అలాగే ఆదిశేషున్ని పూజిస్తే మంచి కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి

ఆరవరోజు చిమ్మిలి దానం చేస్తే
కార్తీక మాసంలో ఆరవరోజు చిమ్మిలి దానం చేస్తే మంచిది. అలాగే సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే సత్సంతానం లభిస్తుంది అలాగే జ్ఞాన లబ్ది పొందుతారు.

కార్తీక మాసంలో ఎడవ రోజు పట్టుబట్టలు, గోదుమలు, బంగారం దానం చేస్తే
కార్తీక మాసంలోఎడవ రోజు పట్టుబట్టలు, గోదుమలు, బంగారం దానం చేస్తే మంచిది. అలాగే సూర్యుడిని పూజిస్తే మంచి తేజస్సు, ఆరోగ్యం కలుగుతాయి.

ఎనిమిదవ రోజు యధాశక్తి దానం చేస్తే
కార్తీక మాసంలోఎనిమిదవ రోజు యధాశక్తి దానం చేస్తే మంచిది. అలాగే దుర్గా దేవిని కొలిస్తే మంచి దైర్యం విజయం ప్రాప్తిస్తాయి

తొమ్మిదవ రోజు యథాశక్తి ఎనిమిది రకాల వస్తువులను దానం చేస్తే
కార్తీక మాసంలోతొమ్మిదవ రోజు యథాశక్తి ఎనిమిది రకాల వస్తువులను దానం చేస్తే మంచిది. పితృదేవతలని పూజించడం పితృతర్పణాలు వదిలితే సంతానరక్షణ కలుగుతుంది

పదవ రోజు గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె దానం చేస్తే
కార్తీక మాసంలోపదవ రోజు గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె దానం చేస్తే మంచిది అష్ట దిగ్గజాలను పూజిస్తే యశస్సు ధనప్రాప్తి కలుగుతాయి

పదకొండవ రోజు విభూతిపండ్లు దక్షిణ తో సహా దానం ఇస్తే
కార్తీక మాసంలోపదకొండవ రోజు విభూతిపండ్లు దక్షిణ తో సహా దానం ఇస్తే మంచిది. శివున్ని పూజిస్తే ధన ప్రాప్తి, ఉన్నత పదవి ప్రాప్తిస్తాయి.

పన్నెండవ రోజు పరిమళ ద్రవ్యాలు, స్వయం పాకం, రాగి
కార్తీక మాసంలోపన్నెండవ రోజు పరిమళ ద్రవ్యాలు, స్వయం పాకం, రాగి, దక్షిణ దానం చేయడం మంచిది. అలాగే భూదేవి సమిత మహా విష్ణువుని పూజిస్తే బంధ విముక్తి కలుగుతుంది. ధనధాన్యాబివృద్ది మరియు జ్ఞానం ప్రాప్తిస్తాయి

పదమూడవ రోజు మల్లెపూలు, జాజిపూలు వంటి పూలు దానం చేస్తే
కార్తీక మాసంలోపదమూడవ రోజు మల్లెపూలు, జాజిపూలు వంటి పూలు దానం చేస్తే మంచిది. అలాగే మన్మధుడిని పూజిస్తే వీర్య వృద్ది, మంచి సౌందర్యం కలుగుతాయి

పద్నాలగవ రోజు నువ్వులు, ఇనుము పాడె గేదె దానం చేస్తే
కార్తీక మాసంలోపద్నాలగవ రోజు నువ్వులు, ఇనుము పాడె గేదె దానం చేస్తే మంచిది. యమధర్మరాజు ని పూజిస్తే అకాలమృత్యువులు తొలగుతాయి.

పదిహేనవ రోజు వరి అన్నం, భోజనం, వెండి దానం చేస్తే
కార్తీక మాసంలోపదిహేనవ రోజు వరి అన్నం, భోజనం, వెండి దానం చేస్తే మంచిది. చంద్రున్ని పూజిస్తే మనశాంతి కలుగుతుంది.

పదహారవ రోజు నెయ్యి, సమిథలు, దక్షిణ, బంగారం దానం చేస్తే
కార్తీక మాసంలో పదహారవ రోజు నెయ్యి, సమిథలు, దక్షిణ, బంగారం దానం చేస్తే మంచిది. అలాగే అగ్ని దేవుణ్ణి పూజిస్తే మంచి వర్చస్సు, తేజస్సు, పవిత్రత ప్రాప్తిస్తాయి

పదిహేడవ రోజు ఔషదాలు, ధనం దానం చేస్తే
కార్తీక మాసంలోపదిహేడవ రోజు ఔషదాలు, ధనం దానం చేస్తే మంచిది. అశ్వని దేవతల్ని పూజిస్తే సర్వ వ్యాదులు తొలగి స్వస్థత లభిస్తుంది

పద్దెనిమిదవ రోజు పులిహోర, అట్లు, బెల్లం దానం చేస్తే
కార్తీక మాసంలోపద్దెనిమిదవ రోజు పులిహోర, అట్లు, బెల్లం దానం చేస్తే మంచిది. గౌరి దేవి ని ప్రార్దిస్తే అఖండ సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది.

పందొమ్మిదవ రోజు నువ్వులు, కుడుములు, దానమిస్తే
కార్తీక మాసంలోపందొమ్మిదవ రోజు నువ్వులు, కుడుములు, దానమిస్తే మంచిది. అలాగే విఘ్నెస్వరుణ్ణి పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి విజయం ప్రాప్తిస్తుంది

ఇరవయ్యొవ రోజు గోవు, భూమి, సువర్ణ దానాలు చేస్తే
కార్తీక మాసంలోఇరవయ్యొవ రోజు గోవు, భూమి, సువర్ణ దానాలు చేస్తే మంచిది. నగుల్ని పూజిస్తే గర్బదోష పరిహారం కావింపబడుతుంది, సంతానం కలుగుతుంది.

ఇరవయ్యొకటొవ రోజు సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే
కార్తీక మాసంలోఇరవయ్యొకటొవ రోజు యథాశక్తి దానం చేయడం మంచిది. సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే సత్సంతానం, జ్ఞానం, విజయం లభిస్తాయి

ఇరవైరెండోవ రోజు పట్టుబట్టలు, సువర్ణం, గోధుమలు దానం చేస్తే
కార్తీక మాసంలోఇరవైరెండోవ రోజు పట్టుబట్టలు, సువర్ణం, గోధుమలు దానం చేస్తే మంచిది, సూర్యుణ్ణి పూజిస్తే ఆయురారోగ్యాలు,సద్భుద్ది కలుగుతాయి

ఇరవైమూడవ రోజు మంగళద్రవ్యాలు దానమిస్తే
కార్తీక మాసంలోఇరవైమూడవ రోజు మంగళద్రవ్యాలు దానమిస్తే మంచిది. అలాగే సప్త మాతృకలను పూజిస్తే మాతృరక్షణ కలుగుతుంది.

ఇరవై నాలుగవ రోజు ఎర్రని చీర జాకెట్టు, ఎర్ర గాజులు, ఎర్ర పూలు దానం చేస్తే
కార్తీక మాసంలోఇరవై నాలుగవ రోజు ఎర్రని చీర జాకెట్టు, ఎర్ర గాజులు, ఎర్ర పూలు దానం చేస్తే మంచిది. అలాగే దుర్గా దేవి ని పూజిస్తే శక్తిసామర్ద్యాలు, కార్య విజయం కలుగుతాయి.

ఇరవై ఐదవ రోజు యథా శక్తి దానమిస్తే
కార్తీక మాసంలోఇరవై ఐదవ రోజు యథా శక్తి దానమిస్తే మంచిది. అష్ట దిక్పాలకులను పూజిస్తే అఖండ కీర్తి ప్రతిష్ఠలు, ఉన్నత పదవులు లభిస్తాయి.

ఇరవై ఆరవ రోజు ఉప్పు పప్పులని (వంటకు ఉపయోగించే వస్తువులు) దానం చేస్తే
కార్తీక మాసంలోఇరవై ఆరవ రోజు ఉప్పు పప్పులని (వంటకు ఉపయోగించే వస్తువులు) దానం చేస్తే మంచిది. అలాగే కుబేరుణ్ణి పూజిస్తే ధన ప్రాప్తి, సిరిసంపదాభివృద్ది కలుగుతుంది.

ఇరవై ఏడవ రోజు ఉసిరికాయ, వెండి, సువర్ణం, దానం, దీపం దానం చేస్తే
కార్తీక మాసంలోఇరవై ఏడవ రోజు ఉసిరికాయ, వెండి, సువర్ణం, దానం, దీపం దానం చేస్తే మంచిది. కార్తీక దామోదరుణ్ణి పూజిస్తే రాజ భోగాలు ప్రాప్తిస్తాయి.

ఇరవై ఎనిమిదవ రోజు నువ్వులు, ఉసిరికాయ దానమిస్తే
కార్తీక మాసంలోఇరవై ఎనిమిదవ రోజు నువ్వులు, ఉసిరికాయ దానమిస్తే మంచిది ధర్మదేవుణ్ణి పూజిస్తే సకల రోగాలు నయమవుతాయి.

ఇరవై తొమ్మిదవ రోజు శివుడిని పూజించడం శివలింగం ,వీభూది పండు ,బంగారం యధా శక్తిగా దానం ఇస్తే
కార్తీక మాసంలోఇరవై తొమ్మిదవ రోజు శివుడిని పూజించడం శివలింగం ,వీభూది పండు ,బంగారం యధా శక్తిగా దానం ఇస్తే అకాల మృత్యు దోషాలు తొలగుతాయి, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది .

ముప్పైవ రోజు సర్వదేవతలను పూజించడం , నువ్వులు, ఉసిరి దానం ఇస్తే ఆత్మ స్థైర్యం
కార్తీక మాసంలోముప్పైవ రోజు సర్వదేవతలను పూజించడం , నువ్వులు, ఉసిరి దానం ఇస్తే ఆత్మ స్థైర్యం కలుగుతుంది, కుటుంబ క్షేమం కలుగుతుంది.



Click it and Unblock the Notifications