Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.!
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.!
హిందూ సంప్రదాయం, ఆచారం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు. ఇది చాతుర్మాసానికి ప్రారంభం కావడంతో ఆ రోజున శ్రీ మహా విష్ణుమూర్తిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. మరి ఈ ఏడాది తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది.. ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి.. ఇక్కడ తెలుసుకుందాం..

తొలి ఏకాదశిని హరిశాయని ఏకాదశి అని కూడా పిలుస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ప్రతి యేటా ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు తొలి ఏకాదశి జరుపుకొంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏకాదశి తిథి జులై 24న ఉదయం 9.13 గంటలకు ప్రారంభమై జులై 25న ఉదయం 11.35 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటే జులై 25న తొలి ఏకాదశి వ్రతాన్ని పాటించాలని పండితులు చెబుతున్నారు.
ఆషాఢ మాసం తొలి ఏకాదశి నాడు మహావిష్ణువు క్షీర సాగరంలో యోగా నిద్రావస్థలో నాలుగు నెలల పాటు ఉంటారు. కార్తీక శుక్ల ఏకాదశి నాడు యోగా నిద్ర నుంచి మేల్కొంటారు. అందుకే ఆషాఢ మాసంలో వివాహం, గృహప్రవేశాలు, తలనీలాలు సమర్పించడం వంటి శుభకార్యాలకు నిషేధం తీసుకొచ్చారు. కాగా, ఆధ్యాత్మికంగా భగవంతుడికి చేరువగా ఉంటే మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తూ కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.
తొలి ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తం ఉదయం 04:16 నుంచి 04:57 వరకు ఉంటుంది. ఉపవాసం అనంతరం మీరు ఏకాదశి వ్రతాన్ని విరమించాలనుకుంటే, జులై 26న ఉదయం 05:38 నుంచి 08:22 వరకు శుభ సమయంగా పండితులు చెబుతున్నారు.

తొలి ఏకాదశి పర్వదినం శనివారం రావడం ఇంకా శుభదాయకం. ఆ రోజు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు. మహా విష్ణువును పూజిస్తూ ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థికంగా సంతోషంగా ఉంటారు. స్వామివారితో పాటు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారికి ఎర్రకుంకుమ సమర్పించడం వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి.
ఆరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శారీరక, మానసిక బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పూజ గదిలో పీటపై పసుపు వస్త్రాన్ని ఉంచి, దానిపై విష్ణు మూర్తి విగ్రహం లేదా ఫొటో పెట్టాలి. నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ మాతను ఈ రోజు పూజించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు నిండుతాయి.
తొలి ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకుని వ్రతం ప్రారంభించాలి. విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు వస్త్రాలు సమర్పించడం శుభసూచకం. పూలతో అలంకరించాలి. స్వామివారికి ఇష్టమైన శనగపిండి లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి. చివరిగా హారతి ఇచ్చి పూజ ముగించాలి. మరుసటి రోజు ఉపవాసం విరమించాలి. పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. అరటి చెట్టును పూజించడం ద్వారా మనసులోని నిస్వార్థమైన కోరికలు నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications