Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
Ugadi 2023:ఉగాది రోజున ఈ ఆచారాలను ఎందుకు పాటించాలంటే?
2023లో ఉగాది పండుగ ఆచారాలు, సంప్రదాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కొత్త సంవత్సరం అంటే జనవరి ఒకటో తేదీ అంటారు. అయితే తెలుగు వారికి మాత్రం కొత్త సంవత్సరం అంటే గుర్తొచ్చేది ఉగాది పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏటా ఛైత్ర మాసంలో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ మాసంలో పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2023 ఏడాదిలో మార్చి 22వ తేదీన బుధవారం రోజున ఈ పండుగ వచ్చింది.

ఈరోజునే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తమ రాశి చక్రాల జాతకలు, గ్రహాల స్థితిని అంచనా వేస్తారు. తమ జాతకంలో ఏవైనా దోషాలుంటే వాటి శాంతి కోసం కొన్ని పరిహారాలు పాటించడం, నివారణలు పాటించడం వంటివి చేస్తారు.

మరికొన్ని రోజుల్లో మనం 'శుభకృతు' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శోభకృత్' నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న సందర్భంగా ఉగాది పండుగ ఆచారాలు, తెలుగువారి వేడుకల సంప్రదాయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పాడ్యమి రోజునే..
పురాణాల ప్రకారం.. బ్రహ్మదేవుడు ఈ అనంతమైన లోకాన్ని ఉగాది రోజున అంటే ఛైత్రమాసంలోని శుక్ల పక్షంలో పాడ్యమి రోజున సృష్టించాడని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ఈ పవిత్రమైన రోజు నుండే భూలోకం ప్రారంభమైందని శాస్త్రాలలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.

కొత్త జీవితానికి నాంది..
ఛైత్ర మాసంలో శుక్ల పక్షం రోజున పాడ్యమి రోజున వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. అందుకే ఈరోజున కొత్త జీవితానికి నాందిగా భావిస్తూ వేడుకలు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. వేదాలను హరించిన సోమకుడిని శ్రీ విష్ణుమూర్తి మత్స్యావతారంలో వచ్చి తనను సంహరిస్తాడు. అదే సమయంలో వేదాలను బ్రహ్మదేవుడికి అప్పజెబుతాడు. ఈ సందర్భంగా ఉగాది పండుగను జరుపుకుంటారని పండితులు చెబుతారు.

ఉగాది అంటే..
చరిత్రను పరిశీలిస్తే.. శాలివాహన చక్రవర్తి ఛైత్ర శుక్ల పాడ్యమి రోజునే పట్టాభిషిక్తుడయ్యాని.. ఈరోజునే ఉగాదిని జరుపుకోవడం సంప్రదాయంగా వచ్చిందని కూడా చెబుతారు. ‘ఉగ' అంటే నక్షత్ర గమనం.. జన్మ ఆయుష్షు అనే అర్థాలొస్తాయి. అలాగే యుగం అంటే ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయణ ద్వయ సంయుతాన్ని యుగం అంటారు. ఈ యుగానికి ఆది యుగాదిగా మారిందని.. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగానే ఈ ఉగాది వచ్చిందని పెద్దలు చెబుతంటారు.ఉగాది పండుగ రోజు నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది.

తోరణాలు కట్టడం వల్ల..
ఉగాది పండుగ రోజున గుమ్మానికి కట్టే తోరణాల వల్ల క్రిములు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయట. ఇవి శ్రీరామ నవమి వరకు పరిశుభ్రంగా ఉండటం వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు.

షడ్రుచుల అర్థాలివే..
1) బెల్లం తియ్యదనానికి.. సంతోషానికి ప్రతీకగా భావిస్తారు.
2) వేప పువ్వు చేదుతనానికి అంటే బాధలు, దుఃఖాన్ని గుర్తు చేస్తుంది.
3) పులుపు వంటి రుచులు మనం ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తుంది.
4) ఉప్పు మన జీవితంలో జరిగే ఉత్సాహం, రుచికి సంకేతంగా భావిస్తారు.
5) పచ్చి మామిడి ముక్కలు వగరు అంటే కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది.
6) కారం అంటే మనం సహనం కోల్పోయే లేదా కోపం పడే పరిస్థితులను సూచిస్తుంది.

తొమ్మిదిరోజుల పాటు..
ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు కొందరు శ్రీరాముడిని, సీతాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నవమి రోజుల్లో అంటే తొమ్మిది రోజుల పాటు ఇళ్లను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటారు. అలాగే తమను తాము శుభ్రంగా ఉంచుకుని.. దేవుడికి నైవేద్యంగా సమర్పించే మంచి పోషకాహారమే తింటుంటారు. దీంతో ఆరోగ్యానికి ఎన్నో మంచి ప్రయోజనాలు దక్కుతాయని చాలా మంది నమ్ముతారు. ఇక ఉగాది పచ్చడిని తీసుకోవడం వల్ల బాడీలోని టాక్సిన్లు, క్రిములు నశిస్తాయి.



Click it and Unblock the Notifications