Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
vaikunta ekadashi 2025: వైకుంఠ ఏకాదశి రోజు ఈ 3 పనులు చేస్తే మీ జాతకం మారిపోతుంది,అఖండ ఐశ్వర్యం
ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో తెల్లవారుజామునుంచే కిటకిటలాడుతున్నాయి. శ్రీమహావిష్ణువుని ఉత్తరద్వారం గుండా ఈ రోజు దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మత విశ్వాసాల ప్రకారం వైకుంఠ ఏకాదశి ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆచారాల ప్రకారం పూజించడం, వ్రతాన్ని ఆచరించడం, ఉపవాసం పాటిస్తే వారి ప్రతి కోరికను శ్రీహరి తీరుస్తాడు. అయితే ఇప్పటిదాకా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంపద పెరగకపోతే, మీ కష్టాలు కొనసాగుతున్నట్లయితే ఈ రోజున 3 పనులు చేయడం ద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో, ఐశ్వర్యం కలిగి మీ జీవితం ఆహా అనేలా ఉంటుంది.
వైకుంఠ ఏకాదశి రోజున చేయాల్సిన 3 పనులు
కెరీర్ లో పురోగతి కోసం
మీరు ఎంత కష్టపడి పనిచేసినా కూడా మీ కెరీర్‌లో ఆశించిన విజయం సాధించకపోతే వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫొటో ముందు నెయ్యి దీపం వెలిగించండి. చేతిలో నీళ్ళు పట్టుకొని పసుపు పువ్వులు తీసుకుని శ్రీ హరిని ప్రార్థించండి, నారాయణ మంత్రాన్ని పఠించండి. దీని తర్వాత దక్షిణవర్తి శంఖాన్ని నీటితో నింపి విష్ణువును అభిషేకించాలి. ఇలా చేయడం ద్వారా మీరు వెంటనే ప్రయోజనాలను పొందుతారని పండితులు చెబుతున్నారు.

ఆర్థిక సమస్యలకు ఇదే పరిష్కారం
వైకుంఠ ఏకాదశి రోజున నిరుపేద వ్యక్తికి ఆహారం తినిపించండి. మీ శక్తి మేరకు నిరుపేదలకు కొన్ని బట్టలు, దక్షిణ ఇవ్వండి. ఈ రోజున ఇలా చేసే వ్యక్తికి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. దీంతో మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు, సంపద వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు బ్రాహ్మణులకు వస్త్రదానం,సువర్ణదానం, భూదానం, జలదానం, అన్నదానం చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి, ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువు,లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మీ సంపద అనేక రెట్లు పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
ఆనందం, శ్రేయస్సు కోసం
ఆనందం, శ్రేయస్సు కోసం వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్కను నాటండి. దీంతో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీ ఇంట్లో కురుస్తాయి. దీంతో ఇంట్లో ఆనందం,శ్రేయస్సు ఉంటుంది. మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజు తులసి మొక్కను దానంగా ఇవ్వడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.



Click it and Unblock the Notifications