Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
మీ ఇంట్లో తాబేలు ఉందా? అష్టైశ్వర్యాలు,సకల సుఖాలు పొందాలంటే ఈ విధంగా చేయండి
వాస్తు శాస్త్రం చేసే పనులు జీవితంలో సంతోషాన్ని,ఇంటికి ఆనందం కలిగిస్తాయని చెబుతారు. వాస్తు అంటే చాలామంది ఇళ్లు కట్టేటప్పుడు మాత్రమే చూసేది అని అనుకుంటారు. అయితే జీవితంలో ప్రతిదీ వాస్తుతో ముడిపడి ఉంటుంది. ఇంట్లో ఉంచే వస్తువుల దిశ కూడా వాస్తుప్రకారం ఉండాలని చెబుతారు. వాస్తు ట్రెండ్ ఈనాటిది కాదు. మహాభారత కాలం నుంచి వాస్తు ట్రెండ్ కొనసాగుతోంది. మహాభారత యుద్ధం తర్వాత యుధిష్ఠిరుని పట్టాభిషేక సమయం వచ్చినప్పుడు శ్రీ కృష్ణుడు రాజ్యం, ఇంటి ఆనందం, శ్రేయస్సు కోసం కొన్ని ప్రత్యేక వాస్తు టిప్స్ గురించి యుధిష్ఠిర్ తో చెప్పాడు.
హిందమతంలో తాబేలును విష్ణువు రూపంగా చూస్తారు. హిందూ కుటుంబాలలో తాబేలును పూజ్యమైనదిగా భావించడానికి ఇదే కారణం. తాబేలు సానుకూల శక్తి, భద్రత, శ్రేయస్సు, దీర్ఘాయువుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. దీన్ని సరైన దిశలో ఉంచడం వల్ల ఇంట్లో పురోగతి పెరుగుతుందని నమ్ముతారు. రాగి తప్ప ఏదైనా లోహంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచుకోవచ్చు.

లోహపు తాబేలును ఏ దిశలో ఉంచాలి
వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఇంట్లో లోహపు తాబేలును లేదా సజీవ తాబేలును ఉంచినట్లయితే దానికి అత్యంత అనుకూలమైన దిక్కు ఉత్తరం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తరం కుబేరుడి దిక్కుగా చెబుతుంటారు. ఈ దిశలో లోహపు తాబేలును ఉంచడం వల్ల సంపద, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. కుటుంబానికి సంపదలు చేకూరడంతోపాటు ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
స్ఫటిక తాబేలును ఏ దిశలో ఉంచాలి
మీ ఇంట్లో స్ఫటిక తాబేలు ఉంటే మీరు దానిని నైరుతి దిశలో ఉంచవచ్చు. ఈ దిశ ప్రేమ, సంబంధం, స్థిరత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో క్రిస్టల్ తాబేలు ఉంచడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ మెయింటైన్ చేస్తుంది, ఇంట్లోని వ్యక్తుల ఆరోగ్యం బాగుంటుంది.
చెక్క తాబేలును ఉంచడానికి సరైన దిశ
మీరు మీ ఇంట్లో చెక్క తాబేలును ఉంచినట్లయితే దానిని దక్షిణ దిశలో ఉంచాలి. ఈ దిశ కొత్త ప్రారంభాలు, కుటుంబ సామరస్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకార, చెక్క తాబేలును ఉంచడం వ్యక్తిగత ,వృత్తిపరమైన వృద్ధికి దారితీస్తుంది.



Click it and Unblock the Notifications
