Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
రుద్రాక్ష వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..? శివుడి కన్నీటి చుక్క నుంచి పుట్టిన రాద్రాక్ష వృక్షం..!
రుద్రాక్ష అంటే రుద్రుడి అక్షం అని అర్థం. దీన్ని బట్టి చూస్తే.. రుద్రాక్షలు శివుని కన్నీళ్ల నుంచి వచ్చిందని పురాణ శాస్త్రం చెబుతుంది. రుద్రాక్ష నుంచి కలిగే ప్రయోజనాలు శాస్త్రీయమైనవి. రుద్రాక్షను ఆధ్యాత్మికానికి చెందిన వారితో పాటు ఫ్యాషన్ అంటే మక్కువ వున్నవారు కూడా ఈ రుద్రాక్షలను వేసుకుంటారు. రుద్రాక్షలు ఒక చెట్టు నుంచి వస్తాయన్న విషయం మనకు తెెలిసిందే. అయితే ఈ చెట్టు పుట్టుక వెనకాల కూడా ఒక పురాణ చరిత్ర వుంది.
శివుని భార్య సతి తన తండ్రి ఇంటి వద్ద యఘ్నం జరుగుతున్నప్పుడు తనను ఆహ్వానించలేదు. అక్కడికి వెళ్లవద్దని శివుడు చెప్పినా వినకుండా సతి వెళ్తుంది. యఘ్నానికి వచ్చిన అందరి అతిథుల ముందే సతి తండ్రి శివుడిని అవమాన పరుస్తాడు. అవమానం భరించలేక సతియగ్న కుండంలో దూకుతుంది. విషయం తెలుసుకున్న శివుడు తన జుట్టులోంచి ఒక వెంట్రుక తీసి నేలకేసి కొడతాడు దీంతో వీరభద్ర, భద్రకాలి జననం అవుతుంది. ఈ ఇద్దరినీ ఆ యఘ్నాన్ని భగ్నం చేయమని చెబుతాడు. దక్షుడిని అప్పుడే హతమారుస్తాడు.

సతి మరణించిన తరువాత సతి శరీరాన్ని ఎత్తుకొని కైలాసం వెళ్తుండాడు అప్పుడు సతికి సంబంధించిన కొన్ని భాగాలు భూమిపై పడి అవి శక్తిపీఠాలుగా మారాయ్. సతి మరణించిన తరువాత శివుడు చాలా ఏళ్లు తపస్సు చేశాడు. అనంతమైన బాధలో శివుడు కళ్లు తెరిచిన తరువాత ఆ కన్నీటి చుక్క కిందపడ్డంతో ఆ కన్నీటి నుంచి రుద్రాక్ష చెట్టు బయటకు వచ్చింది.
రుద్రాక్షలకు చాలా శక్తి వుంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. నెగటివ్ ఎనర్జీని దగ్గరకు రానీయకుండా చేసే శక్తి రుద్రాక్షలకు వుంటుందని చెబుతున్నారు. రుద్రాక్ష వల్ల ఇంకేమి ఉపయోగాలు వున్నాయో తెలుసుకుందాం.
రాద్రాక్ష వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఎన్నో రోగాలు వుండవచ్చు. ఈ మద్య రకరకాల వ్యాధులు, వైరస్‌లు వస్తున్నాయ్. వీటి బారినుంచి రక్షించుకోవాలంటే రుద్రాక్షలను వేసుకోవాల్సిందే.
రుద్రాక్ష ఏకాగ్రతలను పెంచుతుంది. చేసే పని పట్ల ఫోకస్ వుండేలా తన వంతు పాత్ర పోషిస్తుంది. ఏకాగ్రత పెంచుకోవాడానిక మెడలో రుద్రాక్ష వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
కొందరు నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి కూడా రుద్రాక్షలు బాగా ఉపయోగపడతాయ్. శరీర ఉష్ణోగ్రతలను కూడా రుద్రాక్షలు అదుపుతో వుంచుతాయ్. మంచి నీళ్లు ఏవి, విషపు నీళ్లు ఏవి అనే వ్యత్యాసాన్ని రుద్రాక్ష వల్ల తెలుసుకోవచ్చు.
శివుడి ఆశిస్సులు ఎప్పుడూ వుంటాయ్. అలసటను దూరం చేస్తుంది. చుట్టూ ఏదైనా డార్క్ ఎనర్జీ, నెగటివ్ ఎనరజీ వున్నా తొలగిపోతుంది. మరణం తరువాత ఏమో అవుతుందనే భయాన్ని పోగొడుతుంది. ఆలోచనా శక్తిని రుద్రాక్షలు పెంచుతాయ్.
నీరు తాగడానికి అనువైనదా లేదా విషపుతా తెలుసుకోవడానికి కూడా రుద్రాక్షలు బాగా ఉపయోగపడతాయ్. సవ్య దిశలో రుద్రాక్ష తిరిగితే మంచి నీరు లేదంటే విషపు నీరని సాధువులు చెబుతున్నారు.
రుద్రాక్షలో మొత్తం 21 ముఖుల రుద్రాక్ష వుంది. ఏకముఖి రుద్రాక్ష నంచి 21 ముఖుల రుద్రాక్షలు వున్నాయ్. సమాజంలో ఫేక్ రుద్రాక్షలు కూడా వున్నాయ్. వీటి నుంచి అప్రమత్తంగా వుండాలి. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో బద్రాక్ష అనే విషపు కల్తీ రుద్రాక్షలను పెంచిపోషిస్తున్నారు. ఇలాంటి రుద్రక్షలను కొనుగోలు చేయవద్దు. కాబట్టి అప్రమత్తంగా వుండాలి.



Click it and Unblock the Notifications
