Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Ganesh Jayanti In 2021 :వినాయక చతుర్థి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదో తెలుసా...
గణేష్ జయంతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏటా అషాఢ మాసం ముగిసిన తర్వాత వచ్చే భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. అయితే మాఘ మాసంలో కూడా వినాయక జయంతి వేడుకలు జరుగుతాయని చాలా మందికి తెలియదు.

మాఘ మాసంలోని శుక్ల చతుర్థిని తిల్కుండ చతుర్థి మరియు వరద్ చతుర్థి రోజు గణేష్ జయంతిని జరుపుకుంటారు. ఈ పండుగను ఎక్కువగా మహారాష్ట్ర మరియు గోవాలో ఎక్కువగా జరుపుకుంటారు.

2021లో కరోనా తర్వాత తొలిసారి గణేష్ జయంతి వేడుకలను జరుపుకునేందుకు భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ మాసంలో ఏ రోజున గణేష్ జయంతి వచ్చింది? ఆరోజున శుభముహుర్తంతో పాటు గణేష్ జయంతిని మహారాష్ట్ర, గోవాలోనే ఎందుకు ఎక్కువగా జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గణేష్ జయంతి ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలోని శుక్ల పక్షం చతుర్ధి రోజున గణేష్ జయంతిని పండుగలా జరుపుకుంటారు. ఇది సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో వస్తుంది. ఈ ఏడాది 2021లో ఫిబ్రవరి 15వ తేదీన అంటే సోమవారం నాడు వచ్చింది. ఈరోజున హిందువులందరూ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. తమ కోరికలను నెరవేరాలని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈరోజున వినాయకుడి భక్తులందరూ ఉపవాసం ఉంటారు.

శుభఫలితాల కోసం..
ఈరోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా, ఈ ఏడాదంతా శుభఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. గణేష్ జయంతి రోజున ఎర్రని దుస్తులు, ఎర్రని పువ్వులు, ఎర్రని రంగులో ఉండే మిఠాయిలను వినాయకుడికి సమర్పిస్తారు.

చంద్రున్ని చూడకూడదు..
హిందూ పురాణాల ప్రకారం, గణేష్ జయంతి రోజున వినాయకుడు కడుపు నిండా భోజనం చేసి, నడుస్తున్నప్పుడు పొట్ట పగిలిపోయేలా కనిపిస్తుంది. అది చూసిన చంద్రుడు గణేశుడిని హేళన చేస్తాడు. దీంతో కోపం వచ్చిన వినాయకుడు చంద్రుడికి శాపం విధిస్తాడు. నా పుట్టినరోజున నిన్ను ఎవరైనా చూస్తే, అనవసరంగా నిందలు మోయాల్సి ఉంటుంది.. అంతేకాదు మానసిక క్షోభకు గురవుతారని శాపం పెడతాడు. అందుకే గణేష్ జయంతి రోజున చంద్రుడిని చూడకూడదు. ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూస్తే ఆ వ్యక్తి మానసిక శోభకు గురవ్వడమే కాదు.. తప్పుడు ఆరోపణలకు గురవుతారని భావిస్తారు.

విఘ్నాలు తొలగిపోవడానికి..
వినాయక చతుర్థి రోజున నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేసి, పసుపు గణపతిని పూజించి, పగటి పూట ఉపవాస దీక్షను చేపట్టాలి. అనంతరం వినాయక దేవాలయాలకు వెళ్లి దేవుడిని దర్శించుకోవాలి. ఇలా చేయడం వల్ల సంతాన యోగం లేని వారికి సంతానంతో పాటు మీ సకల విఘ్నాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు మీకు సంపద, కీర్తి, ప్రతిష్టలు కూడా లభిస్తాయి.

వినాయకుడికే తొలిపూజ..
పురాణాల ప్రకారం, విఘ్నాలు తొలగించే వినాయకుడికి తొలి పూజ చేయాలి. ఎందుకంటే భక్తుల కష్టాలను తొలగించేది విఘ్నేశ్వరుడు. అలాగే ఈ దేవుని పుట్టినరోజునే వినాయక చవితి పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు ఘనంగా జరుపుకుంటారు.

‘గణ’ అంటే..
బ్రహ్మవైవర్తన పురాణంలో ‘గణ' అనే శబ్దానికి అర్థముంది. ‘గ' అంటే విజ్ణానమని ‘ణ' అంటే తేజస్సు అని పండితులు చెబుతున్నారు. మరోవైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన లేఖకుడిగా వినాయకుడినే నియమించాడు.



Click it and Unblock the Notifications
