Latest Updates
-
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.!
కల్కి అంటే ఎవరు? ఎప్పుడు వస్తాడు?.. ఆయన రాకతో కలియుగం అంతమైపోతుందా?
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న మూవీ ప్రాజెక్ట్-కే. తాజాగా ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేసింది చిత్రబృందం. కల్కి 2898 AD అనే టైటిల్ తో రాబోతుంది ఈ చిత్రం. అమెరికాలోని శాండియాగో కామిక్ కాన్ 2023 వేదికగా సినిమా పేరు, టైటిల్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. అద్భుతమైన టేకింగ్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ మొదటి నుంచి చెప్పినట్లుగానే ఈ మూవీ మరో రేంజ్ లో ఉండనుంది కన్ఫర్మ్ అయింది. ఇందులో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతోంది. ప్రభాస్ లుక్ ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ గ్లింప్స్ విడుదలతో ఆ అభిప్రాయం మారుతుంది.

ప్రాజెక్ట్ -కె మూవీకి కల్కి 2898 AD అనే టైటిల్ పెట్టారు మూవీ మేకర్స్. అసలు ఈ కల్కి అంటే ఎవరు, ఎప్పుడు వస్తాడు, ఆయన వస్తే కలియుగం అంతం అయిపోతుందా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కల్కి అంటే ఎవరు?
శ్రీభాగవత పురాణం - కల్కి పురాణం ప్రకారం కలియుగం- సత్యయుగం సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. శ్రీ మహావిష్ణువు ఈ అవతారం 64 కళలతో నిండి ఉంటుంది. దుష్టులను శిక్షించడానికి, పరిమితులు దాటిన పాపాన్ని నియంత్రించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కల్కి భగవానుడు అవతరిస్తాడు. కల్కి శంభల అనే గ్రామంలో విష్ణుయశస్సు అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరిస్తాడు. తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుష్టశిక్షణ చేసి సత్య యుగాన్ని స్థాపిస్తాడని భాగవతంలోని ద్వాదశ స్కందం రెండో అధ్యాయనంలో ఉంది. కలక లేదా కళంక అంటే దోషాన్ని హరించేదనే అర్థం వస్తుంది. ఈ భూమండలంపై దోషాన్ని హరించే అవతారం కాబట్టి కల్కి అనే పేరు వచ్చిందని అంటారు.
కల్కి ఎప్పుడు వస్తాడు?
సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది. త్రేతాయుగం, ద్వారపయుగంలో ధర్మం మూడు పాదాలపై నడుస్తుంది. కలియుగానికి వచ్చే సరికి ధర్మం కేవలం ఒక పాదంపై మాత్రమే నడుస్తుంది. అలాగే ఈ ధర్మం కూడా రోజురోజుకూ క్షీణిస్తూ పోతుంది. మంచికి, మానవత్వానికి విలువ ఉండదు. దొంగలే ప్రభువులుగా ఉంటారు. అలాంటి సమయంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వస్తాడు. దుష్ట శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి సత్య యుగాన్ని స్థాపిస్తాడని నమ్మకం. కృతయుగం (సత్యయుగం) నుంచి ఇప్పటి వరకు శ్రీమహావిష్ణువు 9 అవతారాలెత్తాడు. రామావతారం తర్వాత కృష్ణావతారం. కృష్ణావతారంలో ఉన్నప్పుడు ద్వారక నీట మునిగిన సమయంలో అవతారాన్ని చాలిస్తాడు. ఆ తర్వాతి నుంచే కలియుగం మొదలవుతుంది.
ఇలాంటివి జరుగుతున్నప్పుడు కల్కి వస్తాడు
- తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు
- భర్తలను భార్యలు గౌవరించరు
- స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబూసుకుని తిరుగుతుంటారు
- వివాహ వ్యవస్థ ఉండదు
- ఎక్కడా దైవపూజ ఉండదు, యజ్ఞయాగాదులు అస్సలే ఉండవు
- గోవులను వధిస్తుంటారు
- ప్రజలంతా మాంసాన్నే తింటుంటారు
- పురుషల ఆయుర్దాయం 18 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది
- మనుషులంతా ఓ వ్యాధిబారిన పడతారు. శరీరమంతా పుండ్లు వాటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది.
- పరమ పుణ్యాత్ములు మాత్రమే రోగాలు లేకుండా ఉంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications